వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

13మంది టీడీపీ ఎమ్మెల్యేలు మాతోనే: ఇక..బీజేపీతోనే మాకు: కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు..!

|
Google Oneindia TeluguNews

వైసీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. అసెంబ్లీ లాబీల్లో ఆయన తాజాగా తమ జిల్లాకు చెందిన సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద స్పందించారు. ఆనం నెల్లూరు జిల్లాలో మాఫియా పెరిగిపోయిందని..పోలీసు అధికారులను తాము పని చేసుకోనీయమంటూ చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చకు కారణమయ్యాయి. దీని పైన ముఖ్యమంత్రి జగన్ సైతం సీరియస్ అయ్యారు. షోకాజ్ నోటీసులు జారీ వరకు వ్యవహారం వెళ్లింది. అయితే, దీని పైన ఇప్పుడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. ఆనం చేసిన వ్యాఖ్యల మీద తనకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అయితే, వాటిని బహిరంగంగా కాకుండా..పార్టీ వేదికల మీదే స్పష్టం చేస్తానని చెప్పుకొచ్చారు. ఆనం నెల్లూరు రూరల్..అర్బన్ నియోజవకర్గాల్లోని పరిస్థితినే ప్రస్తావించారనే చర్చ పార్టీలో కొనసాగుతోంది. అయితే, దీని పైన సీఎంతో మాట్లాడో ఆలోచనలో నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది.

టీడీపీకి ప్రతిపక్ష హోదాకు కారణం సీఎం...
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ నుండి ఎమ్మెల్యేల వలసల గురించి స్పందించారుద. ముఖ్యమంత్రి జగన్ కారణంగానే టీడీపీకి ఇంకా ప్రతిపక్ష హోదా కొనసాగుతోందని చెప్పుకొచ్చారు. శాసన సభ్యత్వానికి ఇబ్బంది లేదని..అనర్హత వేటు గురించి హామీ ఇస్తే టీడీపీ నుండి 13 మంది ఎమ్మెల్యేలు వైసీపీలోకి వస్తారని స్పష్టం చేసారు. వచ్చే ఎన్నికల నాటికి టీడీపీకి ఏపీలో మూడో స్థానంలో ఉంటుందని కోటంరెడ్డి జోస్యం చెప్పారు. ఇదే సమయంలో ఆయన బీజేపీ గురించి ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. ఇక, ఏపీలో టీడీపీకి భవిష్యత్ లేదని చెప్పుకొచ్చారు.

YCP MLA Kotamreddy key comments on BJP and TDP..

ఇక వైసీపీ..బీజేపీ మధ్యనే పోరు..
వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ కనుమరుగు అవుతుందని..2024 ఎన్నికలు వైసీపీ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా పోటీ జరుగుతుందని వ్యాఖ్యానించారు. ఇప్పటికే కొందరు టీడీపీ నేతలు బీజేపీతో టచ్ లో ఉన్నారనే ప్రచారం పైనా స్పందించారు. టీడీపీ వచ్చే ఎన్నికల నాటికి పోటీ ఇచ్చే పరిస్థితలో ఉండదన్నారు. ఏది ఏమైనా టీడీపీ స్థానాన్ని బీజేపీ భర్తీ చేస్తుందనే విధంగా కోటంరెడ్డి వ్యాఖ్యానించారు. ఇతర పార్టీల నుండి అనేక మంది నేతలు వైసీపీలోకి రావటానికి సిద్దంగా ఉన్నారని ..రానున్న రోజుల్లో రాజకీయంగా అనేక మార్పులు చోటు చేసుకుంటాయని కోటంరెడ్డి చెప్పుకొచ్చారు.

English summary
YCP MLA Kotamreddy Sridhar Reddy key comments on Bjp and TDP. He says in 2024 Elections main contest will be between BJP and YCP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X