వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోటంరెడ్డి వర్సెస్ గోవర్ధన్: నెల్లూరు ఎమ్మెల్యేల మధ్య కోల్డ్ వార్: ఫిర్యాదు నుండి అరెస్ట్ దాకా..!

|
Google Oneindia TeluguNews

నెల్లూరు అధికార పార్టీలో ఎమ్మెల్యే మధ్య ప్రచ్ఛన్న యుద్దం మొదలైంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో నెల్లూరు జిల్లాను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. దీంతో..జిల్లాలో ఇద్దరు యువ నేతలకు సీఎం జగన్ తన మంత్రి వర్గంలో స్థానం కల్పించటమే కాకుండా.. కీలక శాఖలు అప్పగించారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే అక్కడ వైసీపీ ఎమ్మెల్యే మధ్య సఖ్యత లోపిస్తోంది. తాజాగా..నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి స్థానికంగా ఒక మహిళా ఎంపీడీవో ఇంటి మీద దాడికి వెళ్లారనే ఫిర్యాదులు రావటంతో ముఖ్యమంత్రి సీరియస్ గా స్పందించారు.

కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సొంత పార్టీ ఎమ్మెల్యే అయినా చర్యల దిశగా పోలీసులను ఆదేవించారు. ఇదే సమయంలో..తన పైన కుట్ర చేసిన వారు సొంత పార్టీలోనే ఉన్నారంటూ కోటంరెడ్డి కామెంట్స్ చేసారు. ముఖ్యమంత్రిని అభినందిస్తూనే..సహచర ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డి పైన పరోక్ష ఆరోపణలు చేసారు. దీంతో..గతంలో చంద్రబాబు హాయంలో చింతమనేని పైన చర్యలు తీసుకోలేదనే అభిప్రాయం నాటి ముఖ్యమంత్రి మీద ఏర్పడిన విధంగా ఇప్పుడు తన మీద రాకుండా సీఎం జగన్ వ్యవహరించారు. కానీ..పార్టీ ఎమ్మెల్యే మద్య పెరుగుతున్న గ్యాప్ మాత్రం సమస్యగా మారుతోంది.

కోటంరెడ్డి వ్యాఖ్యలతో బయటపడ్డ విబేధాలు..

కోటంరెడ్డి వ్యాఖ్యలతో బయటపడ్డ విబేధాలు..

ఒక మహిళా అధికారి ఇంటి పైక వెళ్లి దౌర్జన్యం చేసారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసారు. ఇటువంటి విషయాల్లో ఎవరున్నా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలనే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే జిల్లా పోలీసులు కోటంరెడ్డిని అరెస్ట్ చేసారు.

దీంతో..కోటంరెడ్డి ముఖ్యమంత్రి నిర్ణయాన్ని అభినందించారు. అదే సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలతో జిల్లాలో ఎమ్మెల్యేల మధ్య ఉన్న విబేధాలు బయట పడినట్లు కనిపిస్తోంది. కొందరు చేసిన కుట్ర కారణంగా తన మీద కేసు నమోదైందని కోటంరెడ్డి చెబుతున్నారు. జిల్లా ఎస్పీ పైన ఆరపణలు చేసారు. తన సహచర ఎమ్మెల్యే అనుచరులే తన మీద కేసు పెట్టటానికి కారణమని పరోక్షంగా వ్యాఖ్యానించారు. కోటంరెడ్డి అనుచరులు మాత్రం ఇది గోవర్ధన్ రెడ్డి అనుచరులు పెట్టించిన కేసుగా చెబుతున్నారు.

గోవర్దన్ రెడ్డి పైన ఆరోపణలు..

గోవర్దన్ రెడ్డి పైన ఆరోపణలు..

తన ఇంటి మీదకు వచ్చి దౌర్జన్యం చేసారని ఫిర్యాదు చేసిన మహిళా అధికారిణి కోటంరెడ్డి అనుచరులు ఇంట్లోకి వచ్చే విద్యుత్‌ వైర్లను కట్‌ చేసి, తాగునీటి పైపులైను ధ్వంసం చేశారని వాపోయారు. చివరకు కేబుల్‌ వైర్లు సైతం ముక్కలు చేశారని చెప్పారు. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డికి విషయం తెలుపగా.. ఆయన స్పందించి విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ చేయించి, పైపులైను ధ్వంసం పనులను ఆపించారని సరళ చెప్పుకొచ్చారు. ఇప్పుడు కోటంరెడ్డి అనుచరులు తమ నేత మీద కుట్ర చేసారని ఆరోపిస్తున్నారు. అదే సమయంలో పూర్తి విచారణ చేయాలని.. తప్పు చేసి ఉంటే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సీఎం జగన్ ఆదేశాలతో కోటంరెడ్డి మీద కేసు నమోదు కావటం.. పోలీసులు అరెస్ట్ చేయటంతో వివాదం సద్దుమణిగింది.

కోటంరెడ్డికి బెయిల్.. కానీ, అసలు సమస్య..

కోటంరెడ్డికి బెయిల్.. కానీ, అసలు సమస్య..

పోలీసులు అరెస్ట్ చేయిన కోటంరెడ్డిని బెయిల్ మీద విడుదల చేసారు. మహిళా అధికారిణి ఇంటి పైన దౌర్జన్యం చేసారనే ఆరోపణల మీద నేరుగా ముఖ్యమంత్రి స్పందించారు. దీని మీద విచారించి చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. దీంతో..కోటంరెడ్డిని అరెస్ట్ చేసార. కొద్ది సేపటి క్రితం బెయిల్ మీద విడుదల చేసారు. అయితే..ఈ వ్యవహారం వెనుక కోటంరెడ్డి వర్సెస్ గోవర్దన్ రెడ్డి అనే విధంగా వివాదం మారుతుండటం పార్టీ అధినాయకత్వానికి సమస్యగా మారుతోంది. ఇదే సమయంలో గతంలో చంద్రబాబు నాడు చింతమనేనిని సమర్ధించినట్లుగా జగన్ వ్యవహరించలేదనే చర్చ సైతం జరుగుతోంది. మరి.. ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న ఈ కోల్ద్ వార్ కు సీఎం ఎలాంటి ముగింపు ఇస్తారో చూడాలి.

English summary
YCP mla kotamreddy Sridhar Reddy got bail and released. He arrested in Attack on lady officer house case. At the same time it seem to be cold war between nellore YCP mlas in this matter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X