వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిజిపిని తప్పించండి : స‌్వేచ్చ‌గా ఓటు వేసుకోలేరు : ఇసికి వైసిపి ఫిర్యాదు..!

|
Google Oneindia TeluguNews

డిజిపి ఠాకూర్ పై వైసిపి ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఎన్నిక‌లు పూర్త‌య్యే వ‌ర‌కూ డిజిపి బాధ్య‌త‌ల నుండి ఠాకూర్ ను త‌ప్పించాల‌ని విజ్ఞ‌ప్తి చేసింది. వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారిని క‌లిసి ఈ మేర‌కు విన‌తి ప‌త్రం స‌మ‌ర్పించారు. ఠాకూర్ డిజిపిగా ఉంటే ఏపిలో ఎన్నిక‌లు స్వేఛ్చ‌గా జ‌ర‌గ‌వ‌ని ఫిర్యాదు చేసారు.

<strong>చంద్ర‌బాబుకు కొణ‌తాల ట్విస్ట్‌: టిడిపి కాదు వైసిపి లోకి ..చ‌క్రం తిప్పారు: మాగుంట రాజీనామా..!</strong>చంద్ర‌బాబుకు కొణ‌తాల ట్విస్ట్‌: టిడిపి కాదు వైసిపి లోకి ..చ‌క్రం తిప్పారు: మాగుంట రాజీనామా..!

డిజిపి పై తొలి నుండి..
జ‌గ‌న్ పై విశాఖ విమానాశ్ర‌యంలో జ‌రిగిన దాడి కేసు మొద‌లు ఇప్ప‌టి వ‌ర‌కు డిజిపి ఠాకూర్ పై వైసిపి ఆరోప‌ణ‌లు చేస్తూనే ఉంది. జ‌గ‌న్ పై దాడి జ‌రిగిన వెంట‌నే ఠాకూర్ మీడియా ముందుకొచ్చి జ‌గ‌న్ పై దాడి సంచ‌ల‌నం కోస‌మే చేసార‌ని..చేసింది వైసిపి అభిమాని అని ప్ర‌క‌టించారు. దీనిని వైసిపి నేత‌లు త‌ప్పు బ‌ట్టారు. గ‌త నెల‌లో వైసిపి అధినే త జ‌గ‌న్ ఢిల్లీలో కేంద్ర ఎన్నిక‌ల సంఘ ప్ర‌ధానాధికారి ని క‌లిసారు. ఆ స‌మ‌యంలోనూ ఎన్నిక‌ల విధుల నుండి డిజిపి ను తప్పించాల‌ని కోరారు. డిజిపి తో పాటుగా ఏపి ఇంట‌లిజెన్స్ చీఫ్ ఏబి వేంక‌టేశ్వ‌ర రావు అదే విధంగా కొత్త‌గా పోస్టు సృష్టించి నియ‌మించార‌ని ఆరోపిస్తున్న ఘ‌ట్ట‌మ‌నేని శ్రీనివాస్ పైనా ఫిర్యాదు చేసారు. ఏపి లో ఎన్నిక‌లు స‌క్ర‌మంగా జ‌రిగేలా చూడాల‌ని..వీరిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జ‌గ‌న్ కోరారు.

YCP Mla Ramaktishna Reddy complaint EC on Dgp..

సీఈవో కు ఆళ్ల ఫిర్యాదు..
డీజీపీ ఠాకూర్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఠాకూర్‌ను డీజీపీ పదవి నుంచి తప్పించాలని ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిసి ఆర్కే ఫిర్యాదు చేశారు. ఠాకూర్‌పై చర్యలు తీసుకోవాలని సీఈవోకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆయన డీజీపీగా ఉంటే ప్రజలు ఓటు హక్కును సజావుగా వినియోగించుకోలేరని తెలిపారు. ఠాకూర్‌పై హైకోర్టులో వేసిన పిల్ పెండిం గ్‌లో ఉండగా ఆయనను డీజీపీగా నియమించారని పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ పార్కు స్థలాన్ని డీజీపీ ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించారని విమర్శించారు. ఎన్నిక‌ల్లో స్వేచ్చ‌గా ఓట్లు వేసుకొనే అవ‌కాశం ద‌క్కాలంటే డిజిపిని త‌ప్పించాల‌ని ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి కోరారు. హైకోర్టులోనూ డిజిపి ఇంటి వివాదం పై ఇదే రామ‌కృష్ణారెడ్డి కేసు దాఖ‌లు చేసారు. ఇప్పుడు వైసిపి ఫిర్యాదు పై ఎన్నిక‌ల సంఘం ఎలా స్పందిస్తుందో చూడాలి.

English summary
YCP Mla Alla Rama krishna Reddy complain on DGP to Election Commission. he requested CEO that take action against DGp Thakur. YCP Chief Jagan also given same complaint to CEC last month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X