వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కనెక్ట్ టూ ఆంధ్రా : ఎమ్మెల్యే ఆర్కే అయిదేళ్ల జీతం విరాళంగా: సీఎం పిలుపిచ్చారు...ఆళ్ల స్పందించారు..!

|
Google Oneindia TeluguNews

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కొత్తగా కనెక్ట్ టూ ఆంధ్రా వెబ్ పోర్టల్ ను ప్రారంభించారు. దీని ద్వారా ప్రభుత్వ పధకాలు..కార్యక్రమాల్లో ప్రవాసాంధ్రులు..అవకాశం ఉన్నవారు భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు.
సొంత గ్రామంలో అమలవుతున్న నవరత్నాలు, నాడు-నేడు సహా, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు ఎవరైనా సహాయం చేయవచ్చని సూచించారు.

దీనికి వెంటనే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి స్పందించారు. ముఖ్యమంత్రి పిలుపు మేరకు తాను ఎమ్మెల్యేగా ఉండే కాలం మొత్తం ఎటువంటి జీత భత్యాలు తీసుకోకుండా...తనకు వచ్చే మొత్తాన్ని కనెక్ట్ టూ ఆంధ్రాకు విరాళంగా ఇవ్వాలని కోరుతూ అసెంబ్లీ స్పీకర్ కు లేఖ అందించారు. ముఖ్యమంత్రి పిలుపు మేరకు మిగిలిన ఎమ్మెల్యేలు...అధికార పార్టీకి చెందిన ఎంపీలు..ప్రజా ప్రతినిధులు సైతం స్పందించేందుకు ముందకు వస్తున్నారు.

కనెక్ట్‌ టూ ఆంధ్రా..సీఎం జగన్ పిలుపు..

కనెక్ట్‌ టూ ఆంధ్రా..సీఎం జగన్ పిలుపు..

రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రవాసాంధ్రుల నుంచి వచ్చే సహాయం కొరకు ఏర్పాటు చేసిన కనెక్ట్‌ టూ ఆంధ్రా వెబ్‌ పోర్టల్‌ను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ ఆవిష్కరించారు. దాతలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రవాసాంధ్రుల నుంచి వచ్చే సహాయం కోసం ఈ వెబ్‌సైట్‌ను రూపొందించారు. దీనికి ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా, సీఎస్‌ వైస్‌ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. కనెక్ట్‌ టు ఆంధ్రా ద్వారా ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల్లో ప్రవాసాంధ్రుల భాగస్వామ్యం కావాలని గతంలోనే సీఎం పిలుపునిచ్చారు. ఇప్పుడు వెబ్‌ పోర్టల్‌ ప్రారంభం తర్వాత ప్రవాస ఆంధ్రులను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. సొంత గ్రామంలో అమలవుతున్న నవరత్నాలు, నాడు-నేడు సహా, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు ఎవరైనా సహాయం చేయవచ్చు అని అన్నారు.

 అదే విధంగా ప్రవసాంధ్రులే కాకుండా..

అదే విధంగా ప్రవసాంధ్రులే కాకుండా..

ఎవరైనా ఇందులో భాగస్వాములు అయ్యేందుకు ముందుకు రావాలని సీఎం పిలుపునిచ్చారు. రాష్ట్రం మీద మీ ప్రేమాభిమానాలు చూపించడానికి ఇదొక మంచి అవకాశం... మీరు ఎంత సహాయం చేస్తారన్నది ముఖ్యం కాదు. మీ గ్రామానికి లేదా మీ నియోజకవర్గానికి, మీ జిల్లాలో ఏ కార్యక్రమైనా చేపట్టవచ్చు... దానికి ఎంత మొత్తమైనా సహాయం చేయవచ్చు. మెరుగైన రాష్ట్రం కోసం ఎంతోకొంత మంచి చేయడానికి ఖండాతరాల్లో ఉన్న వారంతా ముందుకు రావాలని సీఎం పిలుపునిచ్చారు.

తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే ఆర్కే..

ముఖ్యమంత్రి పిలుపుతో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి స్పందించారు. అసెంబ్లీకి చేరుకున్న ఆయన నేరుగా స్పీకర్ కు లేఖ అందించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం తనకు వచ్చే జీత ..భత్యాలను మొత్తంగా ప్రభుత్వం ప్రారంభించిన కనెక్ట్ టూ ఆంధ్రా కు విరాళం గా మళ్లించాలని కోరుతూ లేఖలో పేర్కొన్నారు. కేవలం జీతం మాత్రమే కాకుండా ఎమ్మెల్యేగా తనకు వచ్చే అలవెన్సులు సైతం విరాళంగా అందించాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి పిలుపుతో ఆర్కే తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అధికార పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

 అటూ ఇటూగా 60 నెలలు ఉండటం

అటూ ఇటూగా 60 నెలలు ఉండటం

ఎన్నికలు జరిగి అయిదు నెలలు అవుతోంది. వాస్తవంగా ఎమ్మెల్యే పదవిలో రెండు నెలలు అటూ ఇటూగా 60 నెలలు ఉండటం సాధారణం. అయితే, ఇప్పటికే అయిదు నెలల కాలం పూర్తయింది. మరో 50 నెలలకు పైగా తనకు ఎమ్మెల్యేగా వచ్చే జీత భత్యాలను వదులుకొని..కనెక్ట్ టూ ఆంధ్రాకు విరాళంగా ఇవ్వాలని ఆర్కే నిర్ణయించారు. ప్రస్తుతం ఎమ్మెల్యేకు జీత..భత్యాల కింద నెలకు సుమారు రూ 75,000 వరకు అందుతోంది. ఆర్కే నిర్ణయం..ఇక ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు..ఎంపీలు..ప్రజా ప్రతినిధులను కదలించి..వారు ఇదే ఫాలో అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

English summary
Mangalagiri Mla Alla Ramakrishna reddy announced his salary and allowances to connect to Andhra scheme which inaugurated by Cm jagan. Respond to Cm call MLA given letter to Assembly speaker on this decision. Cm Jagan appealed that people sho have interest come forward to give donations for govt schemes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X