• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రోజా ఫ్యాన్సా మజాకా..! అసెంబ్లీ దగ్గర సెల్ఫీలతో హల్ చల్ ! దారి లేక వెయిట్ చేసిన బాలయ్య

|
  రోజాకు అంత ఫాలోయింగా నిల‌బ‌డిపోయిన బాల‌కృష్ణ‌ || Oneindia Telugu

  ఇద్ద‌రు వెండి తెర మీద క‌లిసి చేసారు. ఇప్పుడు శాస‌న‌స‌భ‌లోనూ స‌భ్యులుగా ఉన్నారు. ఇద్ద‌రూ వేర్వేలు పార్టీలు అయినా..వారిద్ద‌రూ స‌భ‌లో మాట్లాడినా అదే ఆస‌క్తి..మాట్లాడ‌క‌పోయినా అంతే ఆస‌క్తి. ఇక, ఇద్ద‌రూ అధికార - ప్ర‌తిప‌క్ష పార్టీల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మ‌రి ఆ ఇద్ద‌రూ ఒకే చోట‌కు వ‌స్తే..వారి అభిమానులు అక్కడే ఉంటే.. ఎలా ఉంటుంది. అటువంటి ఆస‌క్తి క‌ర స‌న్నివేశానికి అసెంబ్లీ లాబీ వేదికైంది. దీంతో..ఏం జ‌రుగుతుంద‌నే ఉత్సుక‌త‌తో ఇత‌ర ఎమ్మెల్యేలు క‌నిపించారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా..టీడీపీ ఎమ్మెల్యే బాల‌కృష్ణ ఒకే చోట‌కు వ‌చ్చారు.. అస‌లు ఆ స‌మ‌యంలో ఏం జ‌రిగిందీ...

  లాబీల్లో రోజా..బాల‌కృష్ణ ఇలా..

  లాబీల్లో రోజా..బాల‌కృష్ణ ఇలా..

  ఏపీ అసెంబ్లీ లాబీల్లో వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా..టీడీపీ ఎమ్మెల్యే బాల‌కృష్ణ ఒకే చోట‌కు వ‌చ్చారు. ఇద్ద‌రూ వేర్వేరు పార్టీల నుండి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఇద్ద‌రూ రెండో సారి ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఈ సారి ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యే వ‌ర‌కూ ఇద్దరి గెలుపు మీద చివ‌రి నిమిషం దాకా ఉత్కంఠ కొన‌సాగింది. ఇప్ప‌టి దాకా వైసీపీ ఎమ్మెల్యేగా రోజా టిడీపీ అధినేత చంద్ర‌బాబు..బాల‌కృష్ణ అల్లుడు లోకేశ్ మీద సంద‌ర్భం వ‌చ్చిన ప్ర‌తీ సారి విరుచుకుప‌డుతూనే ఉన్నారు. కానీ, ఏ రోజు బాల‌కృష్ణ మీద విమ‌ర్శ‌లు చేయ‌లేదు. సెటైర్లు వేయ‌లేదు. అదే స‌మ‌యంలో బాల‌కృష్ణ సైతం అప్పుడ‌ప్పుడు వైసీపీ మీద మాట్లాడారు మిన‌హా..రోజా గురించి ఏనాడు ఎటువంటి వ్యాఖ్య‌లు చేయ‌లేదు. ఇక‌, వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత స‌భ‌లో ఇప్పటి వ‌ర‌కూ బాల‌కృష్ణ ఏ అంశం మీద మాట్లాడ‌లేదు. ఇక‌, అసెంబ్లీలో జరిగిన తాజా ప‌రిణామంతో ఇప్పుడు రోజా..బాల‌కృష్ణ ఇద్ద‌రూ సెంట‌ర్ ఆఫ్ ఎట్రాక్ష‌న్‌గా నిలిచారు.

  రోజాకు ఇంత ఫాలోయింగా..

  రోజాకు ఇంత ఫాలోయింగా..

  రోజా..బాల‌కృష్ణ ఇద్ద‌రూ అసెంబ్లీ లాబీల్లో ఉన్నారు. ఆ స‌మ‌యానికి అక్క‌డికే పెద్ద సంఖ్య‌లో వైసీపీ కార్య‌క‌ర్త‌లు అక్క‌డ చేరుకున్నారు. వారంతా రోజాతో సెల్ఫీలు దిగ‌టానికి పోటీ ప‌డ్డారు. దీంతో ర‌ద్దీ ఏర్పడింది. అదే స‌మ‌యంలో టీడీపీ ఎమ్మెల్యే బాల‌కృష్ణ అటుగా వెళ్లాల్సి వ‌చ్చింది. కానీ, ఆయ‌న ముందుకు వెళ్ల‌టానికి ఖాళీ లేక‌పోవ‌టం చాలా సేపు అక్క‌డే నిరీక్షించాల్సి వ‌చ్చింది. ఆ స‌మ‌యంలో రోజా వ‌ద్ద‌కు పెద్ద సంఖ్య‌లో అభిమానులు రావ‌టం..సెల్ఫీలు దిగ‌టం బాల‌య్య చూస్తూనే ఉన్నారు. ముందుకు వెళ్లేందుకు దారి లేక వేచి చూస్తున్న బాల‌య్య‌ను అక్క‌డే ఉన్న మార్ష‌ల్స్ ముందుకు వ‌చ్చారు. రోజా వ‌ద్ద ఉన్న కార్య‌క‌ర్త‌ల‌ను ప‌క్క‌కు జ‌రిపి బాల‌య్య‌కు దారి ఇచ్చారు. ఆ స‌మ‌యంలో రోజా.. బాల‌కృష్ణ‌ను చూపి ప‌ల‌క‌రించారు. బాగున్నారా అని అడిగారు. బాల‌య్య సైతం న‌వ్వుతూ ..ఫైన్ అని చెబుతూ వెళ్లిపోయారు. అదే స‌మ‌యంలో టీడీపీ నేత అచ్చంనాయుడు సైతం రోజా అభిమానుల మ‌ధ్య చిక్కుకుపోయారు. ఆయ‌నకు సైతం మార్ష‌ల్స్ దారి ఇవ్వాల్సి వ‌చ్చింది.

  క‌ర‌ణంకు రోజా పంచ్‌...

  క‌ర‌ణంకు రోజా పంచ్‌...

  అదే స‌మ‌యంలో టీడీపీ నుండి చీరాల ఎమ్మెల్యేగా గెలిచిన సీనియ‌ర్ నేత క‌ర‌ణం బ‌ల‌రా అటుగా వ‌చ్చారు. దీంతో.. ఆయ‌న్ను చూసిన రోజా బ‌ల‌రాంను ఉద్దేశించి మీరు మా వైపు వ‌స్తార‌ని భావించాం అన్నా..కానీ, అటు నుండి వ‌చ్చారు అంటూ వ్యాఖ్యానించారు. దీనికి స్పంద‌గా బ‌ల‌రాం న‌వ్వుతూ అక్క‌డి నుండి వెళ్లిపోయారు. గొట్టిపాటి ర‌వి వైసీపీ నుండి టీడీపీలో చేరిన స‌మ‌యం నుండి క‌ర‌ణం బ‌ల‌రాం అసంతృప్తితో ఉన్నారు. ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ఇచ్చినా సంతృప్తి చెంద‌ని బ‌ల‌రాం ఆయ‌న త‌న‌యుడితో స‌హా వైసీపీలో చేరుతార‌నే ప్ర‌చారం సాగింది. అయితే చీరాల ఎమ్మెల్యేగా ఉన్న ఆమంచి కృష్ణ మోహ‌న్ వైసీపీలో చేర‌టంతో..టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఆ స్థానంలో క‌ర‌ణం బ‌ల‌రాంకు చీరాల బాధ్య‌త‌లు అప్ప‌గించారు. తాజా ఎన్నిక‌ల్లో క‌ర‌ణం బ‌ల‌రాం చీరాల నుండి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక‌, లాబీల్లో రోజా..బాల‌య్య గురించే ఎక్కువ‌గా చ‌ర్చ సాగింది.

  English summary
  YCP MLA Roja and TDP MLA Balakrishna became center of attraction in Assembly lobbies. Both met in Lobbies and given selfies. At that time Roja and Balayya greeted each other.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X