వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫైర్ బ్రాండ్‌కు కీల‌క‌ ప‌ద‌వి..టీడీపీ డేగ క‌న్ను: ఆవేద‌న‌కు ఆయ‌నే కార‌ణం..జ‌గ‌న్ తేల్చి చెప్పారు..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఫైర్ బ్రాండ్‌ రోజాకు కీల‌క‌ ప‌ద‌వి || YCP MLA Roja Appointed As APIIC Chairman || Oneindia Telugu

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఇచ్చిన మాట మేర‌కు పార్టీ ఫైర్ బ్రాండ్ రోజాకు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు. మంత్రివ‌ర్గ కూర్పులో రోజాకు అవ‌కాశం ద‌క్క‌పోవ‌టంతో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌కు సైతం రోజా గైర్హాజ‌ర‌య్యారు. ప్ర‌భుత్వం ఏర్ప‌డిన ఈ 45 రోజుల్లో ప్ర‌తిప‌క్ష టీడీపీ ప్ర‌భుత్వం పైన విమ‌ర్శ‌లు చేస్తున్నా..రోజా పెద్ద‌గా రియాక్ట్ అవ్వ‌లేదు. తొలి నుండి పార్టీలో ఉన్న రోజాకు కీల‌క ప‌ద‌వి ఇస్తామ‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చారు. ఈ మేర‌కు అధికారిక ఉత్త‌ర్వులు జారీ చేసారు. ఇదే స‌మ‌యంలో రోజాకు సీఎం జ‌గ‌న్ దిశా నిర్ధేశం చేసారు. ఇంత‌కీ..జ‌గ‌న్ ఏం చెప్పారు..రోజా ఏం చేయ‌బోతున్నారు..

రోజాకు కీల‌క ప‌ద‌వి..ఉత్త‌ర్వులు జారీ..

రోజాకు కీల‌క ప‌ద‌వి..ఉత్త‌ర్వులు జారీ..

వైసీపీ ఫైర్ బ్రాండ్..న‌గ‌రి ఎమ్మెల్యే రోజాకు ఎట్ట‌కేల‌కు జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో కీల‌క ప‌ద‌వి ల‌భించింది. జ‌గ‌న్ తొలి మంత్రి వ‌ర్గంలో స్థానం ద‌క్క‌క‌పోవ‌టం పైన అసంతృప్తితో ఉన్నా రోజాకు నామినేటెడ్ ప‌ద‌వి ఇచ్చారు. కీల‌క‌మైన రాష్ట్ర పారి శ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) ఛైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు అధికారిక ఉత్త‌ర్వులు జారీ చేసింది. వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత జ‌గ‌న్ కేబినెట్‌లో రోజాకు మంత్రి ప‌ద‌వి ఖాయ‌మ‌నే ప్ర‌చారం జ‌రిగింది. మంత్రుల పేర్లు ప్ర‌క‌ట‌న రోజు సైతం రోజా త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఖాయ‌మ‌ని చెప్పుకు న్నారు. అయితే, చివ‌ర‌కు కేబినెట్ లిస్టులో రోజా పేరు లేదు. దీంతో..అసంతృప్తికి గురైన రోజా వెంట‌నే విజ‌య‌వాడ నుండి వెళ్లిపోయారు. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కాలేదు. త‌న అసంతృప్తిని బ‌య‌ట‌కు చెప్ప‌క‌పోయినా లోలోప‌ల మాత్రం ఆవేద‌న చెందుతూ..గ‌తంలో లాగా యాక్టివ్‌గా మాత్రం ఉండ‌టం లేదు.

 రోజా ఆవేద‌న‌కు కార‌ణం ఆయ‌నే..జ‌గ‌న్ ఓదార్పు

రోజా ఆవేద‌న‌కు కార‌ణం ఆయ‌నే..జ‌గ‌న్ ఓదార్పు

తొలుత టీడీపీలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన రోజా ఆ త‌రువాత వైయ‌స్సార్‌ను క‌లిసి కాంగ్రెస్‌లో చేరాల‌ని భావించారు. అయితే వైయ‌స్ ఆక‌స్మిక మృతితో జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తుగా నిలిచారు. తొలి నుండి జ‌గ‌న్ టీంలో ఫైర్ బ్రాండ్‌గా ఉన్నారు. 2014..2019 ఎన్నిక‌ల్లో న‌గ‌రి నుండి గెలుపొందారు. తాజా ఎన్నిక‌ల్లో గెలుపు మీద న‌మ్మ‌కం లేని స‌మ‌యంలోనూ జ‌గ‌న్ ధైర్యం చెప్పారు. ఖ‌చ్చితంగా గెలుస్తున్నావు అంటూ భ‌రోసా ఇచ్చారు. ఇక‌, మంత్రి ప‌ద‌వి రానందుకు బాధ ప‌డిన రోజా ను జ‌గ‌న్ త‌న వ‌ద్ద‌కు పిలిపించుకున్నారు. ఆ స‌మ‌యంలో రోజా త‌న ఆవేద‌న‌ను వెల్ల‌గ‌క్కారు. త‌న‌కు మంత్రి ప‌ద‌వి సామాజిక కార‌ణాల వ‌ల‌న ఇవ్వ‌లేక‌పోయామ‌ని చెబుతున్నా..చిత్తూరు జిల్లాలో కీల‌క నేత పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి కార‌ణంగానే త‌న‌ను ప‌క్క‌న పెట్టార‌ని..ఆయ‌న త‌న‌కు ప‌ద‌వి ఇవ్వ‌కుండా అడ్డుకున్నారంటూ రోజా ఆవేద‌న వ్య‌క్తం చేసారు. అయితే, జ‌గ‌న్ మాత్రం రెండో విడ‌త‌లో ఖ‌చ్చితంగా అవ‌కాశం ఉంటుంద‌ని.. న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం వ‌ర‌కు రోజా చెప్పిందే జ‌రుగుతుంద‌ని..ఏ మంత్రి జోక్యం చేసుకోర‌ని..జోక్యం చేసుకుంటే వారు మంత్రిగా ఉండ‌ర‌ని స్ప‌ష్ట‌మైన హామీ ఇచ్చారు. దీంతో..ఇక యాక్టివ్‌గా పార్టీలో ప‌ని చేయ‌టానికి ఎటువంటి అభ్యంత‌రం లేద‌ని రోజా స్ప‌ష్టం చేసారు.

టీడీపీ ఇక డేగ‌క‌న్ను...

టీడీపీ ఇక డేగ‌క‌న్ను...

వైసీపీలో చేరిన స‌మ‌యం నుండి రోజా ప్ర‌ధానంగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. లోకేశ్ ల‌క్ష్యంగా ఆరోప‌ణ‌లు చేసారు.
టీడీపీ అధికారంలో ఉన్న స‌మ‌యంలోనూ త‌న వాగ్దాటితో వారిని ఇబ్బంది పెట్టారు. దీంతో..నాటి ప్ర‌భుత్వం రోజాను శాస‌న‌స‌భ నుండి ఏడాది పాటు స‌స్పెండ్ చేసారు. తాజా ఎన్నిక‌ల్లో న‌గ‌రి నుండి ఓడించేందుకు చివ‌రి నిమిషం దాకా ప్ర‌య‌త్నాలు చేసారు. ఇక ఇప్పుడు రోజా అధికార పార్టీ ఎమ్మెల్యే కావ‌టం.. దీనికి తోడు కీల‌క‌మైన ఏపీఐఐస ఛైర్మ‌న్ ప‌ద‌వి ద‌క్క‌టంతో టీడీపీ ప్ర‌త్యేకంగా రోజా పైన దృష్టి సారించ‌నుంది. పారిశ్రామికాభివృద్ది..భూముల కేటాయింపులు వంటి వ్య‌వ‌హారాల్లో ఇక రోజా కీల‌కం కానున్నారు. దీంతో..రోజా తీసుకొనే నిర్ణ‌యాల పైన టీడీపీ ఎప్ప‌టిక‌ప్ప‌డు స్పందిం చే అవ‌కాశం ఉంటుంది. అదే విధంగా రోజాను ఇరుకున పెట్టేందుకు టీడీపీ ప్ర‌య‌త్నాలు మ‌రింత ముమ్మ‌రం చేసే అవ‌కాశాలు ఉంటాయి. దీంతో..ఇటు జ‌గ‌న్ త‌న మీద ఉంచిన న‌మ్మకాన్ని నిల‌బెట్టుకుంటూ..టీడీపీని ఇరుకున పెడు తూ రోజా ఏపీఐఐసీ తొలి మ‌హిళా ఛైర్మ‌న్‌గా ఎలా రాణిస్తారో చూడాలి.

English summary
YCP MLA Roja appointed as APIIC chairman. Govt issued Go on this appointment. CM Jagan directed Roja to take active role in Govt and in party. Roja may take charge on 12th of this month
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X