వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నీవు హీరోవా..బాహుబ‌లివా: స‌భ‌లో చ‌ంద్ర‌బాబు..బోయ‌పాటిపై ఫైర్‌: పుష్క‌రాల తొక్కిస‌లాటపై విచార‌ణ‌..!

|
Google Oneindia TeluguNews

శాస‌న‌స‌భా సాక్షిగా ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు మీద ఎమ్మెల్యేలు విరుచుకుప‌డ్డారు. గోదావ‌రి పుష్క‌రాల్లో 29 మంది భ‌క్తు ల మ‌ర‌ణం పైన ఏపీ శాస‌న‌స‌భ‌లో చంద్ర‌బాబు తీరు పైన ఫైర్ అయ్యారు. పుష్కరాల సమయంలో 29 మంది భక్తులు చనిపోవడానికి కారణమేవరు?. దర్శకుడు బోయపాటి శ్రీనును అక్కడ షూటింగ్‌ చేయమని ఎవరు చెప్పారు?. బోయపా టిని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు షూటింగ్‌ చేయమన్నారా లేక బోయపాటినే సినిమా షూటింగ్‌ చేశారా అనేది టీడీపీ సమాధానం చెప్పాల‌ని అధికార పార్టీ నేత‌లు డిమాండ్ చేసారు. చంద్ర‌బాబు గోదావరి పుష్కరాల కోసం రూ. 3 వేల కోట్లు ఖర్చు పెట్టారని మండిపడ్డారు. ఆ నిధులను పూర్తిగా దుర్వినియోగం చేశారని ఆరోపించారు. గోదావరి పుష్క రాల ఘటనపై విచారణ చేయించాలని విజ్ఞప్తి చేశారు.

 చంద్ర‌బాబు హీరోనా..బాహుబ‌లా..

చంద్ర‌బాబు హీరోనా..బాహుబ‌లా..

గోదావ‌రి పుష్క‌రాల్లో జ‌రిగిన తొక్కిస‌లాట‌..29 మంది మృతి పైన విచార‌ణ చేయించాల‌ని వైసీపీ నేత‌లు డిమాండ్ చేసా రు. స‌భ‌లో గోదావ‌రి పుష్క‌రాల తొక్కిస‌లాటకు కార‌ణం ఎవ‌ర‌ని ప్ర‌శ్నించారు. వైసీపీ స‌భ్యుడు జోగి ర‌మేష్ ఈ అంశం పైన తీవ్రంగా మండి ప‌డ్డారు. ప‌బ్లిసిటీ కోసం ప్ర‌చార సాధ‌నాల్లో ముహూర్తం గురించి ప్ర‌చారం చేసి..కుంభ మేళా అని ప్ర‌చారం చేసి కుంభ‌కోణంకు పాల్ప‌డ్డార‌ని ఆరోపించారు. పుష్కరాల సమయంలో 29 మంది భక్తులు చనిపోవడానికి కారణమేవరు?. దర్శకుడు బోయపాటి శ్రీనును అక్కడ షూటింగ్‌ చేయమని ఎవరు చెప్పారు?. బోయపాటిని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు షూటింగ్‌ చేయమన్నారా లేక బోయపాటినే సినిమా షూటింగ్‌ చేశారా అనేది టీడీపీ సమా ధానం చెప్పాల‌ని డిమాండ్ చేసారు.చంద్ర‌బాబు ఏమైనా బాహుబ‌లా...హీరోనా ఎందుకింత ప్ర‌చార యావ‌..ఎవ‌రు ఈ మ‌ర‌ణాల‌ను బాధ్యులు అంటూ నిల‌దీసారు.

64 ల‌క్ష‌ల‌తో షూటింగ్ చేయించారు..

64 ల‌క్ష‌ల‌తో షూటింగ్ చేయించారు..


చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితోనే గోదావరి పుష్కరాల్లో 29 మంది భక్తులు చనిపోయారని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆరోపించారు. పర్యాటక శాఖ ద్వారా నేషనల్‌ జియో గ్రాఫిక్‌ ఛానల్‌కు రూ. 64 లక్షలతో డాక్యుమెంటరీ చిత్రీకరించే యత్నం చేశారని.. బోయపాటి శీనుతో ఆ షూట్‌ చేశారని విమ‌ర్శించారు. లక్షలాది మంది భక్తులు వచ్చినప్పుడు కనీ సం జాగ్రత్తలు తీసుకోలేదని మండిపడ్డారు. 29 మంది చనిపోవడానికి చంద్రబాబు కారణమని విమర్శించారు. ఎమ్మె ల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే చంద్రబాబు గోదావరి పుష్కరాల కోసం రూ. 3 వేల కోట్లు ఖర్చు పెట్టారని మండిపడ్డారు. ఆ నిధులను పూర్తిగా దుర్వినియోగం చేశారని ఆరోపించారు. గోదావరి పుష్కరాల ఘటనపై విచారణ చేయించాలని విజ్ఞప్తి చేశారు.

కేబినెట్ స‌బ్ క‌మిటీతో విచార‌ణ‌..

కేబినెట్ స‌బ్ క‌మిటీతో విచార‌ణ‌..

ఈ చ‌ర్చ పైన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. చంద్రబాబు నాయుడు వెళ్లిన పుష్కర ఘాట్‌ వద్ద కనీస జాగ్రత్తలు తీసుకోలేదని సోమయాజులు కమిటీ నివేదిక ఇచ్చిందని తెలిపారు. ఆ నివేదికను కూడా చంద్రబాబు ప్రభుత్వం తొక్కిపెట్టిందని మండిపడ్డారు. మృతుల కుటుంబసభ్యులు కూడా చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఫిర్యాదు చేశారని గుర్తుచేశారు. సామాన్య ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఘాట్‌కు చంద్రబాబు రావడం వల్లే ప్రమాదం జరిగిందని నివేదికలో పేర్కొన్నట్టు వెల్లడించారు. కేబినెట్‌ సబ్‌కమిటీ ద్వారా ఈ ఘటనపై విచారణ జరిపిస్తా మని ప్ర‌క‌టించారు. అదే విధంగా బాధ్యుల పైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని మంత్రి స్ప‌ష్టం చేసారు.

English summary
YCP MLA's fire on Opposition leader Chandra babu in Godavari Stampede at Pushkarams opening day. Gvot Announced to investigate this issue with cabinet sub committee.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X