వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏంట్రా నువ్ మాట్లాడేది .. నోర్ముయ్ .. నేను చెప్పింది విను అంటూ టీడీపీ నేతపై వైసీపీ ఎమ్మెల్యే ఫైర్

|
Google Oneindia TeluguNews

Recommended Video

టీడీపీ - వైసీపీ మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం || The Demolition Of PrajaVedika Turned Into A Storm

ప్రజా వేదిక కూల్చివేత పాలక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరియు ప్రతిపక్ష టిడిపికి మధ్య పెద్ద తుఫానుగా మారింది. మాటల యుద్ధానికి తెరతీసింది . వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కట్టడాల కూల్చివేత నిర్ణయం తీసుకుంది. ప్రజావేదిక భవనాన్ని ధ్వంసం చేసినా టిడిపి మాత్రం నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది . ఇక ఇదే విషయమై వైఎస్ఆర్సీపీ మరియు టిడిపి నాయకులు ఒక టీవీ చర్చలో గొడవకు దిగారు. వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నోరుజారి టీడీపీ నేతను తిట్టడం హాట్ టాపిక్ గా మారింది .

టీడీపీ నేత పట్టాభిపై నోరు జారిన వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు

టీడీపీ నేత పట్టాభిపై నోరు జారిన వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు

కృష్ణానది ఒడ్డున అక్రమ నిర్మాణాల గురించి చర్చించేటప్పుడు మాటల యుద్ధానికి పాల్పడ్డారు. విజయవాడ సెంట్రల్ వైయస్ఆర్సిపి ఎమ్మెల్యే మల్లాది విష్ణు మరియు టిడిపి అధికార ప్రతినిధి పట్టాభి ఈ అంశంపై తీవ్ర వాదనలు వినిపించారు. ఆపై నాయకులు ఇద్దరూ ఒక సమయంలో సంయమనం కోల్పోయి మాట్లాడారు . అయితే వైఎస్‌ఆర్‌సిపికి చెందిన విష్ణునే టిడిపి నాయకుడైన పట్టాభిపై నోరు జారారు. బెదిరించడం ప్రారంభించాడు. ఏంట్రా నువ్వు మాట్లాడేది ... నోరు ముయ్యి .. నోర్మూసుకుని నేను చెప్పింది విను, ఏంట్రా నీకు మర్యాద అంటూ , విష్ణు పట్టాభిపై విరుచుకుపడ్డాడు. . టిడిపి నాయకుడు పట్టాభి మల్లాది విష్ణుని పద్దతిగా మాట్లాడాలని మీరు అని సంబోధిస్తుంటే అరేయ్ ఒరేయ్ అనటం సమంజసం కాదని నోరు జారవద్దని కూడా విజ్ఞప్తి చేశాడు.

సంయమనం కోల్పోయి మాట్లాడిన అధికార పార్టీ నేత.. ప్రజావేదికే కాదు అక్రమ నిర్మాణాలన్నీ కూల్చండి అన్న రాజకీయ వర్గాలు

సంయమనం కోల్పోయి మాట్లాడిన అధికార పార్టీ నేత.. ప్రజావేదికే కాదు అక్రమ నిర్మాణాలన్నీ కూల్చండి అన్న రాజకీయ వర్గాలు

ఇది చూసిన వారంతా షాక్ కు గురయ్యారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటి కంటే అధికార పార్టీలో ఉన్నప్పుడే ఎక్కువ సంయమనంతో మాట్లాడాలి. కానీ విష్ణు అలా కాకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడటం కరెక్ట్ కాదనే భావన అందరికీ కలిగింది. కృష్ణా నది కరకట్టపై ఉన్న అక్రమ కట్టడాలన్నీ కూల్చివెయ్యాలని , మంతెన సత్యన్నారాయణ రాజు ఆశ్రమానికి అనుమతులు ఇచ్చింది వైఎస్ఆర్ కాదా అని పెద్ద ఎత్తున చర్చ జరిగింది .ఇక వాటిని అన్నిటినీ కూల్చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. కృష్ణానది కరకట్టపై ఉన్న నిర్మాణాలన్నీ కూల్చేస్తేనే వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం కలుగుతుంది అని ఒక పక్క వివిధ పార్టీల నాయకులు ప్రకటనలు చేస్తున్నారు.

ఇప్పుడు మల్లాది తీరుపై రాజకీయ వర్గాల్లో చర్చ .. అధికారంలో ఉన్నామనే అహంకారం అంటున్న తెలుగు తమ్ముళ్ళు

ఇప్పుడు మల్లాది తీరుపై రాజకీయ వర్గాల్లో చర్చ .. అధికారంలో ఉన్నామనే అహంకారం అంటున్న తెలుగు తమ్ముళ్ళు

ఇదే సమయంలో సహనంతో మాట్లాడాల్సిన వైసీపీ నేత, ఒక ప్రజా ప్రతినిధి మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చెయ్యటం, బెదిరిస్తున్నట్టు, నేను చెప్పింది వినాలన్నట్టు మాట్లాడాటం నోరు జారి టీడీపీ నేతను ఏంట్రా నువ్ మాట్లాడేది అని సభ్యత లేకుండా మాట్లాడటం రాజకీయ వర్గాలోనే కాదు, ప్రజల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఇక అధికారంలో ఉన్నామనే అహంకారంతో వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని తెలుగు తమ్ముళ్ళు ఫైర్ అవుతున్నారు. ఏది ఏమైనా ఏపీలో ప్రస్తుత పరిస్థితులు ముందు ముందు వైసీపీ , టీడీపీ మధ్య ఎలాంటి యుద్ధాలకు కారణం అవుతుందో అన్న చర్చ జరుగుతుంది.

English summary
The demolition of Praja Vedika has turned into a storm between ruling YSR Congress and opposition TDP. Though the TDP is helpless, YSRCP government went ahead and razed the building. Last night YSRCP and TDP leaders indulged in a verbal war while debating about the illegal constructions on the banks of river Krishna.It was YSRCP MLA Malladi Vishnu and spokesperson of TDP, Pattabhi who had exchanged heated arguments on the topic and then both the leaders slipped their tongue. But it was YSRCP's Vishnu who started to threaten the TDP leader. "Yentra Nuvvu Matladedi... Nooru Muyyi ".., (what are ou talking shut your mouth) said Vishnu to Pattabhi. The TDP leader tried to maintain his calm and also appealed not to slip his tongue on television. The host of the program tried to pacify both the leaders but in vain. However as Vishnu continued his rant, Pattabhi too lost his cool.Well, this is not appreciated by any. In fact the ruling party leaders should be watchful. Already the news of YSRCP's attacks on TDP has not gone down well with many and this aggression will not work in politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X