హిందూపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోలీసు బూట్లను తుడిచి..ముద్దాడి..: జేసీకి ఎంపీ మాధవ్ కౌంటర్: జగన్ నన్ను మందలించారు..!

|
Google Oneindia TeluguNews

అనంతపురంలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద మాజీ పోలీసు అధికారి..హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్రంగా స్పందించారు. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిపై హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. జేసీ వ్యాఖ్యలను ఖండించిన ఎంపీ... ఆయన మాటలకు కౌంటర్‌గా.. అమర పోలీసు బూటును ..తుడిచి..మాధవ్ ముద్దాడారు.

దేశ రక్షణకు పోలీసులు ప్రాణాలు అర్పిస్తున్నారని.. అలాంటి పోలీసులపై జేసీ దివాకర్‌రెడ్డి జుగుప్సాకరంగా మాట్లాడరని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో పోలీసులపై వ్యాఖ్యలు చేస్తే జేసీని ప్రజలు బజారుకీడ్చారని.. రాజకీయ సమాధి కట్టారన్నారు. జేసీ మాట్లాడుతుంటే దుర్యోధనుడిలా టీడీపీ అధినేత చంద్రబాబు నవ్వారని విమర్శించారు.

జేసీ వ్యాఖ్యలకు నిరసనగా..

జేసీ వ్యాఖ్యలకు నిరసనగా..

అనంతపురంలో జరిగిన టీడీపీ జిల్లా సమీక్షలో పార్టీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ఆ సమావేశంలో మాజీ ఎంపీ జేసి టీడీపీ అధికారంలోకి వస్తే తమకు అనుకూలమైన పోలీసులను తెచ్చుకుంటామంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పోలీసులతో బూట్లు నాకిస్తామంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీని మీద పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా మండిపడింది. జేసీ తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేసింది.

పోలీసుల పైన జేసీ వ్యాఖ్యల పట్ల చేశారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో తన వ్యాఖ్యలపై గురువారం వివరణ ఇచ్చారు. జిల్లాలో పోలీసులు వైసీసీ నాయకుల మాటలు విని తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. తాను చంద్రబాబు సమక్షంలో ఆవేదనతో చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించాల్సిన అవసరం లేదన్నారు. తాను ఏ ఒక్క అధికారినీ ఉద్దేశించి మాట్లాడలేదన్నారు. ఆవేశంలో ఒక మాట జారి ఉంటే ఉండవచ్చన్నారు. అంతే తప్ప వేరే లేదన్నారు.

గతంలో అలా చేస్తే..ఎంపీ అయ్యాను

గతంలో అలా చేస్తే..ఎంపీ అయ్యాను

గతంలో..2019 ఎన్నికలకు ముందు అప్పుడు పోలీసు అధికారిగా గోరంట్ల మాధవ్ ఉన్న సమయంలో అప్పడు ఎంపీగా ఉన్నారు. ఆ సమయంలో జేసీ పోలీసుల పైన అనుచిత వ్యాఖ్యలు చేసారు. దీనికి స్పందన గా అప్పుడు పోలీసు అధికారిగా ఉన్న గోరంట్ల మాధవ్ మీసం తిప్పి జేసీకి సవాల్ చేసారు. ఆ తరువాత ఉద్యోగానికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. నామినేషన్ గడువు ముగిసే చివరి రోజు వరకూ మాధవ్ తన ఉద్యోగానికి చేసిన స్వచ్చంద రాజీనామా ఆమోదం పొందలేదు.

ఎట్టకేలకు చివరకు ఆమోదం పొందటంతో ఆయన హిందూపూర్ నుండి వైసీపీ అభ్యర్ధిగా ఎంపీగా పోటీ చేయటం..గెలవటంతో ఇప్పుడు ఎంపీగా ఉన్నారు. తిరిగి..ఇప్పుడు జేసీ మరోసారి పోలీసుల మీద వ్యాఖ్యలు చేయటంతో ఎంపీగా ఉన్న మాజీ పోలీసు అధికారి మాధవ్ తీవ్రంగా స్పందించారు.

జగన్‌ నన్ను మందలించారు

జగన్‌ నన్ను మందలించారు

పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన జేసీ దివాకర్‌రెడ్డిని ఆయన పక్కనే ఉన్న చంద్రబాబు మందలించకపోడాన్ని ఎంపీ మాధవ్‌ తప్పుబట్టారు. పోలీసు వ్యవస్థను కించేపరిచేలా మాట్లాడిన జేసీని ఎందుకు వారించలేదని ప్రశ్నించారు. జేసీ మాటలు విని చంద్రబాబు నవ్వడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.

కర్ణకఠోమైన వ్యాఖ్యలు విని ఎలా నవ్వగలిగారని నిలదీశారు. ఇటీవల కియో కంపెనీకి వెళ్లినప్పడు తనతో పాటు వచ్చిన అతిథిని కారులో కూర్చోబెట్టుకోవడం మరిచిపోవడంతో తనను ముఖ్యమంత్రి జగన్‌ మందలించారని వెల్లడించారు. అప్పట్లోనే దీని పైన విమర్శలు వెల్లువెత్తాయి.

English summary
Hindupur YCP MP Gorantla Madhav kiss to police shoe and courter for Ex Empo JC Diwakar reddy against his comments on Police in presence of CBN.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X