వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ చేతల మనిషి .. పొలికేకలకి, పరిపాలనకి తేడా ఇదే : వైసీపీ ఎంపీ

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ పై దేశం పోరాటం సాగిస్తుంది. ఇదే సమయంలో ఏపీలో కూడా కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో లాక్ డౌన్ ప్రకటించిన ఏపీ సర్కార్ కరోనా నియంత్రణకు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక ఏపీ ప్రభుత్వ నిర్ణయాలు సరైనవి కాదని సీఎం జగన్ ను టార్గెట్ చేస్తూ టీడీపీ విమర్శలు గుప్పిస్తుంది. ఇక ఈ నేపధ్యంలో చంద్రబాబును టార్గెట్ చేసి జగన్ చేతల మనిషి అని చెప్తూ విజయ సాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు.

లాక్ డౌన్ : చంద్రబాబుకు ,లోకేష్ కు ఆ పని చెయ్యాలని వర్మ సలహా .. ఇంకా ఏం చెప్పారంటేలాక్ డౌన్ : చంద్రబాబుకు ,లోకేష్ కు ఆ పని చెయ్యాలని వర్మ సలహా .. ఇంకా ఏం చెప్పారంటే

చంద్రబాబును టార్గెట్ చేసిన విజయసాయి .. జగన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు

చంద్రబాబును టార్గెట్ చేసిన విజయసాయి .. జగన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు

శవాలపై పేలాలు ఏరుకునే నైజాన్ని చంద్రబాబు ఎప్పటికీ వదిలిపెట్టడు. ఎల్లో మీడియాలో వస్తున్న వార్తలు చూస్తుంటే, ఏడాది క్రితం కరోనా వైరస్ వచ్చుంటే బాగుండేదన్న క్రూరత్వం కనిపిస్తోంది. రాజకీయ మనుగడ కోసం ప్రజలు ఎప్పుడూ ఏదో ఒక ఉపద్రవంలో చిక్కుకోవాలనే స్వభావం బాబుది అని విమర్శలు గుప్పించిన విజయసాయిరెడ్డి సీఎం జగన్ మోహన్ రెడ్డి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును తిట్టిపోశారు .

సిఎం జగన్ చేతల మనిషి..ప్రచారానికి ఆయనెప్పుడు దూరం

సిఎం జగన్ చేతల మనిషి..ప్రచారానికి ఆయనెప్పుడు దూరం

సిఎం జగన్ చేతల మనిషి. ప్రచారానికి ఆయనెప్పుడు దూరం. ఏదైనా టాస్క్ విజయవంతమైతే క్రెడిట్ అధికారులకిస్తారు అంటూ ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు. లోటుపాట్లుంటే ఆ బాధ్యత తనే తీసుకుంటారని పేర్కొన్నారు . చంద్రబాబులా రోజుకు16 వీడియో కాన్ఫరెన్సులు, మీడియా సమావేశాల హడావుడి లేదిప్పుడు అంటూ ఆయన వ్యాఖ్యానించారు . ఇదంతా పచ్చ మీడియాకు కనిపించదని ఆయన తన ట్వీట్ ద్వారా టీడీపీ అనుకూల మీడియాపై విరుచుకుపడ్డారు.

పొలికేకలకి, పరిపాలనకి తేడా ఇదే అంటూ ఆగ్రహం

పొలికేకలకి, పరిపాలనకి తేడా ఇదే అంటూ ఆగ్రహం

తుఫాన్లు వస్తే మీడియా ఫోకస్ అంతా తనమీద ఉండేలా డ్రామాలాడేవాడు. పుష్కరాల్లో 30 మందిని పొట్టన పెట్టుకున్న వ్యక్తి అనుభవజ్ఞుడు, విజనరీ ఎలా అవుతాడు? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు . ఇక సిఎం జగన్ రూట్ మ్యాప్ ఇచ్చి అధికారులను పురమాయించారు. కలెక్టర్లు స్వేచ్ఛగా పనిచేస్తున్నారు. పొలికేకలకి, పరిపాలనకి తేడా ఇదే అంతో చంద్రబాబువి పొలికేకలు , జగన్ ది పరిపాలన అని పేర్కొన్నారు.

Recommended Video

Janatha Curfew:European Countries Are Already implementing what Modi Said To D On Marc 22nd
 గోల్డెన్ ఛాన్స్ మిస్సయిందని ఏడుస్తున్నాడని విమర్శలు

గోల్డెన్ ఛాన్స్ మిస్సయిందని ఏడుస్తున్నాడని విమర్శలు

హుదూద్, తిత్లీ తుఫాన్ల పరిహారం పేరుతో వందల కోట్లు పచ్చ నాయకులకు దోచిపెట్టాడు బాబు. భూములు లేని వారికి నష్టం పరిహారం అందింది. నిజమైన బాధితులకు సిఎం జగన్ గారు వచ్చాక న్యాయం జరిగింది. కరోనా మహమ్మారి విజృంభించిన ప్రస్తుత పరిస్థితుల్లో గోల్డెన్ ఛాన్స్ మిస్సయిందని ఏడుస్తున్నాడు అంటూ విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారు. ఒకపక్క కరోనా మహమ్మారి రాష్ట్రంలో తన ప్రతాపాన్ని చూపిస్తున్నా రాజకీయ నాయకులు మాత్రం తమ పంధా వీడటం లేదని ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు .

English summary
CM Jagan is a man who works for the people . He is very distance from the campaign. ycp mp vijayasai reddy tweeted that if any task is successful, credit will be given to officers. He claimed that the deficit would be the responsibility. vijaya sai said that Chandrababu's period 16 video conferences and media conferences per day and he want to campaign him self .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X