• search
 • Live TV
హిందూపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

వైసీపీ ఎంపీ ఎంత హాయిగా నిద్రపోతున్నారో..! :సభ అట్టుడుకుతున్న వేళ: సీఎం జగన్ ఇది చూసారా..!

|
  Disha Issue : YCP Mp Sleeping In Lokasabha At The Time Of Dicussion || Oneindia Telugu

  దేశం మొత్తం దిశ ఘటన పైన నిరసనలతో హోరెత్తుతోంది. పార్లమెంట్ లోనూ ఇదే అంశం పైన అట్టుడుకుతోంది. లోక్ సభలో దిశ అంశం పైన చర్చ సాగుతోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన పార్లమెంట్ సభ్యులు నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇంతలో..ఒక ఎంపీ సభలోనే ఆ చర్చ ఒక జోలపాటలా భావిస్తూ ప్రశాంతంగా కునుకు తీస్తున్నారు. ఇది పార్లమెంట్ సమావేశాలను ప్రత్యక్షంగా తిలకిస్తున్న ప్రతీ ఒక్కరి కంట పడింది.

  అదే చర్చలో ఏపీ అధికార పార్టీకి చెందిన ఎంపీలు సైతం పాల్గొన్నారు. బాధితురాలి పక్షాన తమ గళం వినిపించారు. తమను తాముగా బతకనివ్వడంటంటూ అదే పార్టీకి చెందిన మహిళా ఎంపీ ఆక్రోశించారు. కానీ, ఆ ఎంపీ మాత్రం ప్రశాంతంగా తన సీట్లో కూర్చొని హాయిగా నిద్ర పోతున్నారు. ఇది ఇప్పుడు ఢిల్లీలోనే కాదు..ఏపీ అధికార పార్టీలోనూ హాట్ టాపిక్ గా మారింది.

  సభలో నిద్రలో ఎంపీ గోరంట్ల మాధవ్

  సభలో నిద్రలో ఎంపీ గోరంట్ల మాధవ్

  తెలంగాణలోని సైబరాబాద్ పరిధిలో ఒక వెటర్నరీ డాక్టర్ పైన నలుగురు దుండగులు పైశాచికంగా దాడి చేసారు. అత్యాచారం చేసి హత్య చేసారు. ఈ ఘటనతో తెలుగు రాష్ట్రాలే కాదు..దేశం మొత్తం స్పందించింది. దీని పైన సోమవారం పార్లమెంట్ ప్రారంభం కాగానే ఉభయ సభల్లో చర్చ జరపాలని అన్ని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేసాయి.

  అందులో తెలంగాన నుండి కాంగ్రెస్..బీజేపీ ఎంపీలతో పాటుగా ఏపీ అధికార ..ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు సైతం చర్చలో పాల్గొన్నారు. టీడీపీ నుండి రామ్మోహన నాయుడు..వైసీపీ నుండి వంగా గీత..రఘురామ రాజు మాట్లాడారు. ఇదే సమయంలో సభ ఆ నలుగురు నిందితులపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ సమయంలోనే సభలోనే..తన సీట్లోనే ఉన్న ఏపి లోని హిందూపూర్ నుండి వైసీపీ తరపున ఎన్నికైన గోరంట్ల మాధవ ఇదేమీ తనకు పట్టదన్నట్లుగా ప్రశాంతంగా కునుకు తీస్తూ కనిపించారు. పార్లమెంట్ సమావేశాలు ప్రత్యక్షంగా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కంట ఈ సన్నివేశం స్పష్టంగా కనిపింపింది.

  గతంలో కియా ఓపెనింగ్ సందర్భంలోనూ..

  గతంలో కియా ఓపెనింగ్ సందర్భంలోనూ..

  అనంతపురం జిల్లాలో పోలీసుఅ అధికారిగా ఉన్న సమయంలో ఆయన నాటి టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పైన మీసం తిప్పి సంచలనంగా మారారు. ఆ తరువాత వైసీపీ లో చేరారు. రాకీయంగా అనుభవం లేకపోయినా ముఖ్యమంత్రి జగన్ ఆయనకు ఏకంగా హిందూపూర్ టిక్కెట్ ఖారారు చేసారు. వైసీపీ హవాలో ఆయన ఎంపీగా గెలిచారు.

  ఇక, ఆ తరువాత అనంతపురంలో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కియా సంస్థ తమ తొలి కారును ఆవిష్కరించింది. స్థానిక ఎంపీగా ఆయనతో పాటుగా పలువురు మంత్రులు..అధికారులు హాజరయ్యారు. ఆ సమయంలో ఆయన స్థానిక యువతకు ఉద్యోగం ఇవ్వాలనే డిమాండ్ పైన అనుచితంగా వ్యవహరించారని సొంత పార్టీ నేతలే సీఎంకు ఫిర్యాదు చేసారు. ఏకంగా కియా మేనేజర్ తోనే ఆ రకంగా వ్యవహరించటం పైన ముఖ్యమంత్రి సైతం మందలించినట్లుగా అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ తరువాత ఎంపీ మాధవ్ తన పని తాను చేసుకుంటూ జాగ్రత్తగా ఉంటున్నారు.

  సీఎం జగన్ ఇది చూసారా..

  సీఎం జగన్ ఇది చూసారా..

  ఇక, ఇప్పుడు ఒక యువతిపైన అఘాయిత్యానికి సంబందించి పార్లమెంట్ లో చర్చ సాగుతున్న వేళ..పార్టీ ఎంపీ ఇలా నిద్ర పోతూ టీవీ ఛానళ్లలో కనిపించటం పైన పార్టీలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. దీని పైన ఢిల్లీలో సైతం మాట్లాడుకుంటున్నారు. దేశాన్ని..పార్లమెంట్ లో అట్టుడుకుతున్న అంశం...అందునా తెలుగు యువతి..సున్నితమైన వ్యవహారం..జాగ్రత్తగా స్పందించాల్సిన సమయం..మద్దతు ప్రకటించాల్సిన వేళ..ఇలా ఎంపీ కీలక చర్చ సాగుతుండగానే నిద్రలోకి జారుకోవటం చర్చకు కారణమైంది.

  లోక్ సభలో వైసీపీ ప్రస్తుతం నాలుగో అతి పెద్ద పార్టీగా ఉంది. పార్టీ ఎంపీ ఇటువంటి సమయంలో జరుగుతున్న విషయాన్ని సీరియస్ గా తీసుకోలేదనే అభిప్రాయం కలిగే విధంగా వ్యవహరించటం పైన పార్టీ నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిని ఇప్పుడు ప్రతిపక్షాలు అందుకొనే అవకాశం కనిపిస్తోంది.

  మరి..ముఖ్యమంత్రి జగన్ దీని పైన ఎలా స్పందిస్తారో చూడాలి.

  English summary
  YCP Mp Gorantla Mahdava epresenting Hindupuram constituency sleeping i lokasabha at the time of Disha issue dicussion is became hot topic in political circles.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more