హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబుపై విజయసాయి ఫైర్ ..తుప్పు, పప్పు ఇంట్లో దాక్కున్నా 150 మంది సెక్యూరిటీ అవసరమా ?

|
Google Oneindia TeluguNews

ఏపీలో లేకుండా హైదరాబాద్ లో కూర్చుని చంద్రబాబు విమర్శలు చెయ్యటంపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక తాజాగా విజయసాయి రెడ్డి మరోమారు చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు . తుప్పు, పప్పు .. హైదరాబాద్ పారిపోయి ఇంట్లో దాక్కున్నా 150 మంది సెక్యూరిటీ అవసరమా అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నించారు .

మౌనీ బాబా నోరు విప్పాలన్న విజయసాయి

మౌనీ బాబా నోరు విప్పాలన్న విజయసాయి

ఇక పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ పై చంద్రబాబు నోరు విప్పి మాట్లాడాలని పేర్కొన్నారు విజయసాయి రెడ్డి . ఇక ఈ క్రమంలో ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఇతర పార్టీల్లోకి తను పంపించిన బానిసల గొలుసులు విప్పి పోతిరెడ్డిపాడు జిఓపై ఉసిగొల్పుతున్నాడు చంద్రబాబు. వాళ్లెంత మొరిగినా న్యాయం అనేది ఒకటుంటుంది. ఏపీ తన కేటాయింపులకు మించి చుక్క నీటిని కూడా అక్రమంగా తీసుకోదని సిఎం జగన్ గారు స్పష్టం చేశారు. మౌనీ బాబా నోరు విప్పాలి అంటూ విజయసాయి రెడ్డి పోస్ట్ చేశారు .

 కరోనా కష్టకాలంలో చంద్రబాబు హైదరాబాద్ పారిపోయారు

కరోనా కష్టకాలంలో చంద్రబాబు హైదరాబాద్ పారిపోయారు

ఇక అంతేకాదు కరోనా కష్ట కాలంలో చంద్రబాబు హైదరాబాద్ పారిపోయారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు హైదరాబాద్ కు పారిపోయి అర్థశత దినోత్సవం పూర్తయింది. కరోనా కష్ట సమయంలో రాష్ట్రాన్ని వదిలి ప్రతిపక్ష నేత ఎక్కడో ఉండటమేమిటని ఎల్లో మీడియా ప్రశ్నించదు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నలుగురు కూర్చుని ప్లకార్డులు పట్టుకుంటే అమరావతి దీక్షలు 150 రోజులకు చేరాయని వార్తలు వడ్డిస్తోంది అంటూ చంద్రబాబును, చంద్రబాబుకు సపోర్ట్ చేస్తున్న మీడియాను విమర్శించారు విజయసాయి రెడ్డి .

Recommended Video

CM YS Jagan Key Announcement Of Janata Bazars In Every Village
ఇంట్లో దాక్కున్నా 150 మంది సెక్యూరిటీ సిబ్బంది అవసరమా?

ఇంట్లో దాక్కున్నా 150 మంది సెక్యూరిటీ సిబ్బంది అవసరమా?

అప్పట్లో వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీని బహిష్కరిస్తే జీతాలెలా తీసుకుంటారని ఎద్దేవా చేశారు అని గత ప్రభుత్వ హయాంలో జరిగిన విషయాన్ని ప్రస్తావించిన విజయసాయి తుప్పు, పప్పు రెండు నెలలుగా పొరుగు రాష్ట్రంలో ఉంటూ ప్రభుత్వ సదుపాయాలెలా ఉపయోగించుకుంటున్నారో చెప్పాలి అని ప్రశ్నించారు . అంతేకాదు ఇంట్లో దాక్కున్నా 150 మంది సెక్యూరిటీ సిబ్బంది అవసరమా? అంటూ విజయసాయి చంద్రబాబును నిలదీశారు. ఇక చంద్రబాబు విషయంలో ఏ చిన్న అవకాశం దొరికినా సరే విజయసాయి సోషల్ మీడియా వేదికగా ఎండగడుతున్నారు. ఆయనపై నిప్పులు చెరుగుతున్నారు.

English summary
Vijayasai Reddy once again criticized Chandrababu. YSRP MP Vijayasai Reddy questioned whether 150 people need security if they flee to Hyderabad and hide in the house in corona time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X