• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బీజేపీలో టీడీపీ విలీనం.. ప్రతిపాదించిందెవరు..రాజీ ఫార్ములా ఏంటి..!!

|
  బీజేపీలో టీడీపీ విలీనం పై వ్యాక్యలు చేసిన విజయసాయి || Chandrababu Naidu Trying To Merge With BJP

  సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం తరువాత టీడీపీని ఏకంగా బీజేపీలో విలీనం చేయటానికి ప్రయత్నాలు జరిగాయా. అందులో భాగంగానే ముందుగా నలుగురు ఎంపీలు బీజేపీలో చేరారా. ఆ ఎంపీ చెబుతున్న మాటల్లో నిజమెంత. ఇప్పుడు ఇది ఏపీ మొత్తంగా జరుగుతున్న చర్చ. ఎన్నికల సమయంలో మోదీతో వ్యక్తిగత వైరానికి దిగిన చంద్రబాబు..ఫలితాల తరువాత నోరు మెదపలేదు. ఏపీలో జగన్‌ ఏకపక్షంగా విజయం సాధించటంతో..ఇక టీడీపీ భవిష్యత్‌ ఏంటనే సందేహాలు మొదలయ్యాయి. అదే సమయంలో తిరిగి బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని.. పొత్తు లేని కారణంగానే భారీ నష్టం జరిగిందంటూ పార్టీ సీనియర్లు ధ్వజమెత్తారు. అయితే, చంద్రబాబు ఏరకంగా స్పందించిందీ స్పష్టత లేదు. కానీ. ఆయన ఏకంగా టీడీపీని నేరుగా బీజేపీలో నిలీనం చేయటానికి రాయబారాలు నడిపారంటూ ఎంపీ చేసిన ట్వీట్ రాజకీయంగా కలకలం సృష్టిస్తోంది.

  చంద్రబాబు రాయబారం నడిపారా..

  చంద్రబాబు రాయబారం నడిపారా..

  సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తరువాత టీడీపీలో ఒక రకంగా వైరాగ్యం కనిపించింది. అధినేత మొదలు పార్టీ శ్రేణులు ఓటమిని జీర్ణించుకోలే క పోయాయి. అనేక మంది పార్టీ నేతలు లోకేశ్‌ను లక్ష్యంగా చేసుకుంటూ ఆరోపణలకు దిగారు. పార్టీ ఓడటానికి చినబాబు కారణమంటూ పార్టీని వీడారు. ఇదే సమయంలో బీజేపీ అధినాయకత్వం ఏపీలో టీడీపీ లక్ష్యంగా వలసలను ప్రోత్సహించింది. ఇక దశలో టీడీపీ ఎమ్మెల్యే లు సైతం బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం సాగింది. కానీ, అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్‌ తాము ఫిరాయింపులను ప్రోత్సహించమ ని..ఎవరైనా ఫిరాయింపులకు పాల్పడితే వెంటనే అనర్హత వేటు వేయాలంటూ స్పష్టం చేసారు. దీంతో..టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్లే నిర్ణయాన్ని ఉప సంహరించుకున్నారు. ఇప్పటికీ టీడీపీ నేతలు బీజేపీతో టచ్‌లో ఉన్నారనే ప్రచారం ఉంది. ఇటువంటి సమయంలో ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ రాజకీయంగా కలకలం సృష్టిస్తోంది. ఎప్పుడూ చంద్రబాబు..లోకేశ్ లక్ష్యంగా ట్వీట్‌ చేసే సాయిరెడ్డి ఇప్పుడు ఏకంగా టీడీపీ..బీజేపీ సంబంధాల గురించి కీలక కామెంట్లు చేసారు.

  లోకేశ్ నిజం ఒప్పేసుకున్నట్లేనా.. బాబు కియో కారు ఆవిష్కరణ ఉత్తిత్తిదే.. నాడు- నేడు..

  బీజేపీలో టీడీపీ విలీనం పైనా ఇలా..

  బీజేపీలో టీడీపీ విలీనం పైనా ఇలా..

  అవినీతి కేసులు పెట్టకుండా వదిలేస్తే టీడీపీని బిజెపిలో విలీనం చేస్తానని రాయబారాలు పంపింది మీరే కదా చంద్రబాబు గారూ? రాజీలో భాగంగానే నలుగురు రాజ్యసభ సభ్యులను బిజెపీలోకి పంపించారు. ఇంకా మీపైన ఫిర్యాదు చేస్తారన్న భయమెందుకు? భవిష్యత్తు కళ్లముం దు కనిపిస్తోందా?..అంటూ విజయ సాయి రెడ్డి ట్వీట్‌ చేసారు. నిత్యం ఢిల్లీలో బీజేపీ అగ్ర నేతలతో టచ్‌లో ఉండే విజయ సాయిరెడ్డి చేసిన ఈ ట్వీట్ ప్రధానంగా టీడీపీలో కలకలం సృష్టిస్తోంది. విజయ సాయి రెడ్డి టీడీపీని ఆత్మరక్షణలోకి నెట్టేసేందుకే ఇలా పోస్ట్ చేసారా..లేక నిజంగా జరిగిన విషయాన్నే బయట పెట్టారా అనే చర్చ మొదలైంది. అయితే, కొంత కాలంగా బీజేపీతో సన్నిహిత సంబంధాల కోసమే టీడీపీ ప్రయత్నిస్తోందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. కేంద్రం పైన పోరాటం చేసిన చంద్రబాబు ఇప్పుడు అదే మోదీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ప్రతీ బిల్లుకు మద్దతు ప్రకటిస్తున్నారు.

  చంద్రబాబే ప్రతిపాదించారా..

  చంద్రబాబే ప్రతిపాదించారా..

  విజయ సాయిరెడ్డి తన ట్వీట్‌లో విలీన ప్రతిపాదన చంద్రబాబు చేసారంటూ చెప్పుకొచ్చారు. బీజేపీలో తన పార్టీని నిజంగా చంద్రబాబు విలీనం చేయటానికి సిద్దంగా ఉన్నారా అంటే అది సందేహమే అనే సమాధానం వినిపిస్తోంది. ఇక, రాజీ ఫార్ములాలో భాగంగానే టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి పంపించారంటూ సాయిరెడ్డి పేర్కొన్నారు. ఆ నలుగురు ఏకంగా టీడీపీ రాజ్యసభ పార్టీ ని బీజేపీలో విలీనం చేసారు. వారి చేరిక మీద చంద్రబాబు ఇప్పటి దాకా ఎక్కడా సీరియస్‌గా స్పందించిన సందర్భాలు లేవు. అదే టైంలో ఆ రాజ్యసభ సభ్యుల సూచనల మేరకే మిగిలిని ఇద్దరు టీడీపీ రాజ్యసభ సభ్యులు నడుచుకుంటున్నారు. దీంతో..సాయిరెడ్డి చెప్పినట్లుగా విలీనం కాకపోయినా..భవిష్యత్‌లో పొత్తు మాత్రం ఖాయమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు సాయిరెడ్డి చేసిన ట్వీట్‌ మీద టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

  English summary
  YCP MP Vijaya Sai Reddy Sensational Tweet on TDP merge with BJP. Sai Reddy in his tweet says Chandra babu Merge proposed failed and as per agreement sent four Rajyasabha members to BJP.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
  X