వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడీపీపై విజయసాయి రెడ్డి తీవ్ర ఆరోపణ .. ఏపీలోని ఆడపిల్లల సమాచారం వారి గూండాల వద్ద ఉంది !

|
Google Oneindia TeluguNews

ప్ర‌జ‌ల వ్య‌క్తిగ‌త డేటాను టీడీపీ ప్ర‌భుత్వం దొంగ‌తనం చేసింద‌ని వైసిపి రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య సాయిరెడ్డి ఆరోపించారు. సేవామిత్ర గంద‌ర‌గోళం పైన ఏర్పాటు చేసిన సిట్ ఏమైంద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఫైబ‌ర్ గ్రిడ్స్ అశోక్ కొద్ది రోజుల కింద‌ట ఇవియం హ్యాక‌ర్స్‌తో సమావేశ‌మైన‌ట్లు స‌మాచారం ఉంద‌న్నారు. అశోక్ ఎక్క‌డ ఉన్నాడో సీయంతో పాటుగా లోకేశ్ కు తెలుస‌ని చెప్పుకొచ్చారు.

లోకేశ్ ద్వారానే స‌మాచారం లీక్‌

లోకేశ్ ద్వారానే స‌మాచారం లీక్‌

ప్ర‌జ‌ల వ్య‌క్తిగ‌త స‌మాచారాన్ని ఏపి లోని టీడీపీ ప్ర‌భుత్వం దొంగిలించింద‌ని విజ‌య సాయిరెడ్డి ఆరోపించారు. ఆడ‌పిల్ల‌ల‌కు సంబంధించిన స‌మాచారం టిడీపీ గూండాల వ‌ద్ద ఉంద‌ని ఫైర్ అయ్యారు. ఆధార్‌..బ్యాంకు..ఫోన్ నెంబ‌ర్లతో పూ్తి వివరాలు వీరి ద‌గ్గ‌ర ఉన్నాయ‌ని వివ‌రించారు. చంద్రబాబు బినామీలకే పలు ప్రభుత్వ కాంట్రాక్టులు అప్పజెప్పారని విమర్శించారు. అభయ యాప్‌ ద్వారా రాష్ట్రంలో ఎన్ని అత్యాచారాలు ఆపగలిగారని సూటిగా ప్రశ్నించారు.దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయంలో ఉపయోగించిన టెక్నాలజీకి పేరు మార్చి సీఎం డ్యాష్‌ బోర్డు అంటున్నారని ఎద్దేవా చేశారు. 2016లో జే సత్యనారాయణ యూఐడీఏ చైర్మన్‌ అయిన తర్వాత ఆధార్‌ డేటాను ఈ ప్రగతికి లింక్‌ చేశారు. సంక్షేమ పథకాల కోసం డేటాను ఈ ప్రగతికి లింక్‌ చేసినట్టు టీడీపీ ప్రభుత్వం చెప్పింది. ఆ తర్వాత ఈ ప్రగతి నుంచి ఆధార్‌ డేటాను టీడీపీ సేవామిత్ర యాప్‌కు మళ్లించారని ఆరోపించారు.

యాప్‌తో ట్రాక్ చేసారు..

యాప్‌తో ట్రాక్ చేసారు..

సేవామిత్ర యాప్ ద్వారా అనేక అనైతిక చ‌ర్య‌ల‌కు టిడిపి పాల్ప‌డింద‌ని చెప్పుకొచ్చారు. ప్రజల ఫోన్లలో ఉండే సమాచారాన్ని సేవామిత్ర యాప్‌తో ట్రాక్‌ చేసే అవకాశం ఉంది. చంద్రబాబు, ఆయన బినామీ అశోక్‌తో ప్రజలకు పెను ప్రమాదం పొంచి ఉందన్నారు. సేవామిత్ర యాప్‌తోనే టీడీపీ ఎన్నికల్లో సర్వేలు నిర్వహించిందని.. ఈ సర్వేల్లో ఎవరైతే టీడీపీపై అసంతృప్తి వ్యక్తం చేశారో.. వారి ఓట్లను తొలగించేందకు ఫామ్‌-7 దరఖాస్తులు చేశారని చెప్పుకొచ్చారు. ఐటీ మంత్రి నారా లోకేశ్‌ ద్వారానే ఐటీ గ్రిడ్‌కు ప్రజల వ్యక్తిగత డేటా చేరిందన్నారు. చంద్రబాబు, లోకేశ్‌లు అశోక్‌ అరెస్ట్‌ కాకుండా కాపాడుతున్నారని ఆరోపించారు. అశోక్‌ ఏ తప్పు చేయకుంటే అజ్ఞాతంలోకి ఎందుకు వెళతారని ప్ర‌శ్నించారు. టీడీపీ ప్రభుత్వం బాల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సిట్‌ను ఏర్పాటు చేసిందని... అయితే తాము ఏం చేశామో చెప్పాల్సిన బాధ్యత సిట్‌పై ఉందిన్నారు. అశోక్ ఇవియం హ్యాక‌ర్ల‌తో స‌మావేశ‌మైన‌ట్లు త‌మ వ‌ద్ద స‌మాచారం ఉంద‌ని చెప్పుకొచ్చారు.

అధికారుల కంపెనీల‌కు కాంట్రాక్టులు..

అధికారుల కంపెనీల‌కు కాంట్రాక్టులు..

చంద్రబాబు తన బినామీలకు టెక్నాలజీ అప్‌డేట్‌ పేరిట కాంట్రాక్టులు అప్పజెప్పారన్నారు. బాలసుబ్రహ్మణ్యం సతీమణి నిర్వహిస్తున్న గ్రీన్‌ ఆర్గ్‌, ఓటీఎస్‌ఐ కంపెనీలకు ఆర్టీఏ వెబ్‌సైట్‌ సాంకేతిక బాధ్యతలను అప్పగించారని వివ‌రించారు. రూ. 138 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభయ యాప్‌ పైలెట్‌ ప్రాజెక్టును తీసుకువచ్చారని... అయితే అభయ యాప్‌ ద్వారా ఎన్ని అత్యాచారాలు ఆపగలిగారని ప్ర‌శ్నించారు. బాలసుబ్రహ్మణ్యం రవాణాశాఖ కమిషనర్‌గా ఉండటం వల్లనే ఆ రెండు కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చారని ఆరోపించారు. పులివెందుల నియోజకవర్గంలో కూడా టీడీపీ నేతలు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించారని ఆధారాలు స‌మ‌ర్పించారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారి వివరాలు సేకరించి.. అందులో ఏవరైతే టీడీపీకి అనుకూలంగా ఉండరో వారి ఓట్లను తొలగించేందుకు ప్రయత్నించారని విమ‌ర్శించారు.

English summary
YCP MP Vijaya Sai Reddy serious comments on Chandra babu and Lokesh, Sai reddy says Ashok met with EVM's Hackers. By Sevamitra aap TDP Tried to remove YCP supporters votes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X