AP Panchayat elections AP Panchayat elections 2021 vijayasai reddy chandrababu tdp Joe Biden us president letters Elections andhra pradesh ys jagan amaravati vijayawada ap local body elections local body elections nimmagadda ramesh kumar ramesh kumar high court chandrababu naidu ap government విజయసాయి రెడ్డి చంద్రబాబు టిడిపి లేఖలు ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ వైయస్ జగన్ అమరావతి విజయవాడ స్థానిక సంస్థల ఎన్నికలు హైకోర్టు చంద్రబాబు నాయుడు ఏపీ ప్రభుత్వం politics
చంద్రబాబు లేఖలపై సాయిరెడ్డి వ్యంగ్యం .. పిచ్చి ముదిరి జో బైడెన్, పుతిన్ లకు లేఖలు రాస్తాడని ఎద్దేవా
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఏదో జరుగుతోందంటూ రాష్ట్రపతికి, కేంద్ర హోంమంత్రికి లేఖలు రాశారని వెల్లడించిన ఆయన, చంద్రబాబుకి పిచ్చి బాగా ముదిరింది అంటూ ఎద్దేవా చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని జగన్ లేఖ రాశారు .. మరి చంద్రబాబు ఏం చేశారు? అంబటి ఫైర్

అమెరికా సైన్యాన్ని పంపాలని , ఐక్యరాజ్య సమితి శాంతి దళాలను పంపాలని బాబు లేఖలు
పిచ్చి ముదిరి చంద్రబాబు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు , రష్యా దేశాధినేత పుతిన్ లకు కూడా ఉత్తరాలు రాస్తాడని విజయ సాయి రెడ్డి ఎద్దేవా చేశారు. ఈసారి ఎన్నికలకు కేంద్ర బలగాలను కాదు అమెరికా సైన్యాన్ని , ఐక్యరాజ్యసమితి శాంతి దళాలను పంపించాలని కోరతాడని చంద్రబాబు పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు విజయసాయిరెడ్డి . చివరికి చిత్తుగా ఓడింది టీడీపీ కాదు ప్రజలే ఓడిపోయారు అంటూ తృప్తిపడతారు కూడా అంటూ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు.

గొలుసులతో కట్టేసే పరిస్థితి తెచ్చుకోవద్దు అంటూ హితవు
అంతకుముందు పచ్చ తమ్ముళ్లకు బాబు ఆరోగ్యంపై ఏ మాత్రం శ్రద్ధ లేదు . ఆయన అప్పర్ కంపార్ట్మెంట్ ఎప్పుడో పోయింది . పంచాయతీ ఎన్నికల్లో జోక్యం చేసుకోవాలంటూ కేంద్ర హోంమంత్రికి లేఖలు రాస్తున్నాడు అంటే పిచ్చి బాగా ముదిరిందని అర్థం చేసుకోవచ్చు. గొలుసులతో కట్టేసే పరిస్థితి తెచ్చుకోవద్దు అంటూ చంద్రబాబుపై టీడీపీ నేతలకు శ్రద్ధ లేదని,ఆయనకు పిచ్చి పట్టి కేంద్ర హోం శాఖ మంత్రికి లేఖలు రాస్తున్నారు అంటూ విమర్శించారు.

చంద్రబాబు లేఖలు రాయడంపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు
అంతేకాదు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ పాచిక పారలేదు అని కుట్రలన్నీ పటాపంచలయ్యాయి అని పేర్కొన్న విజయసాయిరెడ్డి తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో చంద్రబాబును అద్దంలో చూపించేశారు ప్రజలు. రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ పూర్తి అధికారం ఉపయోగించలేదంటూ లేఖలు రాస్తున్నాడు నాయుడు బాబు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఓట్లు వెయ్యకపోయినా టీడీపీ వారిని సర్పంచులుగా ప్రకటించాలా బాబు అంటూ ప్రశ్నించిన విజయ సాయి రెడ్డి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు, కేంద్ర పెద్దలకు చంద్రబాబు లేఖలు రాయడంపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు .