వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దీక్షకు అనుమతివ్వండి: ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌కు వైసీపీ ఎంపీల వినతి

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్‌తో పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడిన తర్వాత ఏపీ భవన్ వేదికగా ఆమరణ నిరహారదీక్షకు దిగాలని వైసీపీ నిర్ణయం తీసుకొంది. అయితే ఈ మేరకు దీక్ష చేసుకొనేందుకు అనుమతివ్వాలని కోరుతూ వైసీపీ ఎంపీలు సోమవారం నాడు రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాశ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

పార్లమెంట్ నిరవధికంగా వాయిదా పడిన తర్వాత తమ ఎంపీ పదవులకు రాజీనామాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అనుమతిచ్చినా లేకున్నా ఎంపీలు ఏపీ భవన్‌లో దీక్ష చేయాలని నిర్ణయం తీసుకొన్నారు.

YCP MPs meet AP Bhavan Resident Commissioner over Hunger Strike

కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకుగాను వైసీసీ ఎంపీలు ఆమరణ నిరహరదీక్షను అస్త్రంగా ఎంచుకొన్నారు. ఎంపీల దీక్షకు మద్దతుగా ఏపీ రాష్ట్రంలో కూడ అన్ని కేంద్రాల్లో దీక్షలు చేయాలని ఆ పార్టీ ప్రజలకు పిలుపునిచ్చింది.

ఏపీకి ప్రత్యేక హోదా విషయమై ఇప్పటికే టిడిపి, వైసీపీ ఎంపీలు కేంద్రంపై అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇచ్చాయి. టిడిపి,వైసీపీల అవిశ్వాస నోటీసులకు కూడ ఇతర పార్టీలు తోడయ్యాయి. అయితే పార్లమెంట్ ఉభయ సభల్లో అవిశ్వాస తీర్మానంపై నోటీసుపై ఇంకా చర్చ సాగడం లేదు. ఈ విషయమై బిజెపియేతర పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

English summary
YSRCP Member of Parliament (MP), Y.V.Subba Reddy, met Resident Commissioner of Andhra Bhavan in New Delhi and requested him to give the party MPs the permission to do hunger strike in the premises after they submit resignations to the Speaker.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X