వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీ నవశకం... ఆ విషయంలో కేసీఆర్, చంద్రబాబులను ఫాలో అవుతున్న జగన్

|
Google Oneindia TeluguNews

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని, అలాగే తెలంగాణ రాష్ట్ర సీఎం కెసిఆర్ ను ఫాలో అవుతున్నారా? అంటే అవుననే చెప్పాలి. మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబును, అలాగే తెలంగాణ సీఎం కెసిఆర్ ను ఆదర్శంగా తీసుకునే సీఎం జగన్మోహన్ రెడ్డి తాజాగా కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

సంక్షేమ పథకాలు పక్కదారి పట్టకుండా ఏపీ సర్కార్ కీలక నిర్ణయం .. నవంబర్ 20 నుండే అమలుసంక్షేమ పథకాలు పక్కదారి పట్టకుండా ఏపీ సర్కార్ కీలక నిర్ణయం .. నవంబర్ 20 నుండే అమలు

సర్వేల విషయంలో చంద్రబాబు , కేసీఆర్ ల బాటలో జగన్

సర్వేల విషయంలో చంద్రబాబు , కేసీఆర్ ల బాటలో జగన్

గతంలో ఏపిలో అధికారం చెలాయించిన చంద్రబాబు,ఇక తెలంగాణ రాష్ట్రంలోని సీఎం కేసీఆర్ పాలన ఏ విధంగా సాగుతుంది? ప్రజలు తమ గురించి ఏమనుకుంటున్నారు? సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయా లేదా? వంటి అంశాలు తెలుసుకోవడం కోసం సర్వేల మీద ఆధారపడేవారు. ఇక తాజాగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి సైతం అధికారం చేపట్టిన నాటి నుండి నేటి వరకు పలు సంచలన నిర్ణయాలు తీసుకుని పాలనలో తనదైన మార్క్ చూపినప్పటికీ తమ పాలన ఎలా ఉంది అన్న అంశంపై సర్వే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

గతంలో చంద్రబాబు పల్స్ సర్వే... కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే

గతంలో చంద్రబాబు పల్స్ సర్వే... కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే

గతంలో చంద్రబాబు నాయుడు ప్రజల నాడి తెలుసుకునేందుకు,అధికార పార్టీపై ప్రజాభిప్రాయాన్ని సేకరించేందుకు పల్స్ సర్వే నిర్వహిస్తే, తెలంగాణ సీఎం కెసిఆర్ సమగ్ర కుటుంబ సర్వే పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించారు.అంతేకాదు ప్రజాప్రతినిధుల పనితీరుపై, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై కూడా పలు దఫాలుగా సర్వేలు నిర్వహించారు చంద్రబాబు,కెసిఆర్ లు.ఇక వారి బాటలోనే సీఎం జగన్ మోహన్ రెడ్డి సైతం వైసిపి నవశకం పేరుతో కొత్త సర్వే నిర్వహించాలని భావిస్తున్నారు.

 రాష్ట్ర వ్యాప్తంగా నెలరోజుల పాటు సర్వే

రాష్ట్ర వ్యాప్తంగా నెలరోజుల పాటు సర్వే

రాష్ట్రవ్యాప్తంగా నెల రోజుల పాటు నిర్వహించే వైసీపీ నవశకం సర్వే కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నాలుగు లక్షల మంది గ్రామ వాలంటీర్ లను వినియోగించనున్నారు.ఏపీలో అధికారంలోకి వచ్చిన సందర్భంలో ఏపీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరు నెలల కాలంలో మంచి సీఎంగా అనిపించుకుంటానని హామీ ఇచ్చారు. ఇక ఆయన ప్రమాణస్వీకారం చేసి ఈనెలాఖరుకు ఆరు నెలలు పూర్తవుతుంది కాబట్టి ఇప్పటివరకు పాలన ఏ విధంగా సాగించామన్న దానిపై ప్రజాక్షేత్రంలోకి వెళ్లనున్నారు.

Recommended Video

Vallabhaneni Vamsi & Kodali Nani Strategically Comparing Lokesh And Jr NTR || Oneindia Telugu
జగన్ సర్వే నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ

జగన్ సర్వే నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ

సర్వే ద్వారా ప్రజల అభిప్రాయాన్ని సేకరించి పరిపాలనలో ముందుకు సాగాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలు, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి, వైసీపీ పాలన వంటి అనేక అంశాల పైన సర్వే నిర్వహించనున్న నేపథ్యంలో జగన్ తీసుకున్న తాజా సర్వే నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. సర్వేల విషయంలో సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు బాటలోనే తాజా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా సాగుతున్నారని తెలుగు రాష్ట్రాల ప్రజలు చర్చించుకుంటున్నారు.

English summary
Chandrababu, who was formerly in power in the AP, and the Telangana state's CM KCR conducted surveys What do people think of themselves and the reach of welfare schemes to everyone. Recently, YS Jagan Mohan Reddy has taken sensational decision since he taken charge and has made his mark in governance, but has decided to conduct a survey on how their regime is.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X