వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వారు టీడీపీ యాక్టివిస్టులు : వైసీపీ వ్య‌తిరేకిస్తోంది : సీఎస్‌కు సాయిరెడ్డి లేఖ‌..!

|
Google Oneindia TeluguNews

ఏపీలో స‌మాచార హ‌క్కు కమీష‌న‌ర్ల నియామ‌కానికి సంబంధించి అమోదించిన పేర్ల పైన వైసీపీ అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. ఈ మేరకె పార్టీ ఎంపీ విజ‌య సాయిరెడ్డి రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యంకు లేఖ రాసారు. ఎన్నికల్లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బిజీగా ఉన్న సమయంలో కమిటీని ఏర్పాటు చేసి సిఫార్సు చేశార‌ని గుర్తు చేసారు.

వైసీపీ వ్య‌తిరేకిస్తోంది..

వైసీపీ వ్య‌తిరేకిస్తోంది..

ఏపీలో తాజాగా ఇద్ద‌రు స‌మాచార హ‌క్కు క‌మిష‌నర్ల నియామ‌కానికి సంబంధించి వైసీపీ అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. సామాజిక సేవా రంగంలో ఉన్న వారికి ప్రాధాన్య‌త ఇవ్వాల్సి ఉండ‌గా..టీడీపీ యాక్టివిస్టుల‌కు స‌మాచార హ‌క్కు క‌మిష‌న‌ర్లుగా ఎంపిక చేయ‌టం పైన వైసీపీ ఎంపీ విజ‌య సాయిరెడ్డి రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌దర్శికి లేఖ రాసారు. అందులో ప్ర‌ధానంగా విజయవాడకు చెందిన హోటల్ యజమాని ఐలాపురం రాజాను ఇన్ఫర్మేషన్ కమిషనర్‌గా నియమించటంపైనా..అదే విధంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి ప్రైవేటు సెక్రటరీగా ఉన్న ఇ.శ్రీరాంమూర్తి పేరు సిఫార్సు చేయ‌టాన్ని త‌ప్పు బట్టారు. వారు టీడీపీ పార్టీ యాక్టివిస్టులని.. ఇలాంటి వారిని ఆర్టీఐ కమిషనర్లుగా ఎలా నియమిస్తారని ప్ర‌శ్నించారు. ఆర్టీఐ యాక్ట్ 2005, సెక్షన్ 15 ప్రకారం నియామకాలు చేపట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌ని లేఖ‌లో పేర్కొన్నారు. ఆర్టీఐ యాక్ట్ 2005 సబ్ సెక్షన్ 5 ప్రకారం స్టేట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్లుగా బాధ్యతలు చేపట్టేవారికి తగిన అర్హతలు ఉండాలని సాయిరెడ్డి గుర్తు చేసారు.

జ‌గ‌న్ బిజీగా ఉన్న స‌మ‌యంలో..

జ‌గ‌న్ బిజీగా ఉన్న స‌మ‌యంలో..

ఎన్నికల్లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బిజీగా ఉన్న సమయంలో కమిటీని ఏర్పాటు చేసి సిఫార్సు చేశారని సాయిరెడ్డి లేఖ‌లో పేర్కొన్నారు. ఆర్టీఐ యాక్ట్ ప్రకారం చూస్తే..లా, సైన్స్ అండ్ టెక్నాలజీ, సోషల్ సర్వీస్, మేనేజ్‌మెంట్, జర్నలిజం, మాస్ మీడియాలో అనుభవం ఉన్న వ్యక్తులనే ఆ పదవులకు ఎంపిక చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. దానికి భిన్నంగా టీడీపీ యాక్టివిస్టులను ఆర్టీఐ కమిషనర్లుగా నియమించారని ఆరోపించారు.
అయితే, ఓ హోటల్ యజమాని, మంత్రికి ప్రైవేటు సెక్రటరీగా ఉన్న వ్యక్తులను ఎలా ఎంపిక చేశారని... ఏ ప్రాతిపధికన సీఎం, సీనియర్ కేబినెట్ మినిస్టర్ వీళ్ల పేర్లు సిఫార్సు చేసార‌ని ప్ర‌శ్నించారు.

ఒక పేరుకే గ‌వ‌ర్న‌ర్ ఆమోదం..

ఒక పేరుకే గ‌వ‌ర్న‌ర్ ఆమోదం..

రాష్ట్ర ప్ర‌భుత్వం ఇద్ద‌రు పేర్ల‌ను గ‌వ‌ర్న‌ర్‌కు ప్ర‌తిపాదిస్తే వీరిలో ఐలాపురం రాజా పేరును గవర్నర్ ఆమోదించారు. శ్రీరాంమూర్తి పేరును గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. శ్రీరాంమూర్తికి సామాజిక సేవతో సంబంధాలు ఉన్నాయా అని ప్ర‌శ్నించారు. ఈ ఆర్టీఐ కమిషనర్ నియామకాలు అన్నీ రాజకీయ దురుద్దేశంతో కూడినవిగా పేర్కొన్నారు. 4 ఏళ్ల పాటు సాగదీసి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఈ నియామకాలు చేయటంలో ఆంతర్యం ఏమిటని నిల‌దీసారు. 2017లో ఆరుగురును ఆర్టీఐ కమిషనర్లుగా నియామకంలో రాజకీయ ప్రమేయం ఉండటంతో సుప్రీంకోర్టు కొట్టేసిందని గుర్తు చేస్తూ... ఇప్పటికైనా ఆర్టీఐ కమిషనర్ల నియామకంలో పారదర్శకత పాటించాలని విజయసాయి రెడ్డి కోరారు.

English summary
YCP MP Vijaya Sai Reddy written letter to Chief secretary LV Subramanyam. In the letter Sai reddy objected Govt proposals as Right to information commissioner posts. mobile summary
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X