వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ‌గ‌న్ అనుమానం నిజ‌మేనా : వైసిపి అభ్య‌ర్దులు..ప్ర‌జాశాంతి క్యాండెట్స్ పేర్లు ఒక‌టే: క‌డ‌ప ఫార్ములా

|
Google Oneindia TeluguNews

ఎన్నిక‌ల వేల రాజ‌కీయ పార్టీలు కొత్త ఎత్తుగ‌డ‌ల‌కు దిగుతున్నాయి. వైసిపి అభ్య‌ర్దుల పై అదే నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జా శాంతి నుండి ఆ పేర్లు క‌లిగిన అభ్య‌ర్దులు ప్ర‌జాశాంతి నుండి పోటీ చేస్తున్నారు. అయితే, అందులో వైసిపి నుండి పోటీ చేస్తున్న కొంద‌రు నేత‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకున్నారు. వైసిపి నుండి వారు నామినేష‌న్లు దాఖ‌లు చేసారు. అదే పేర్లు క‌లిగిన వ్య‌క్తులు ప్ర‌జాశాంతి పార్టీ నుండి బ‌రిలో ఉన్నారు.

తొలి నుండి వైసిపి అనుమానం..

తొలి నుండి వైసిపి అనుమానం..

ప్ర‌జాశాంతి పార్టీ పై వైసిపి తొలి నుండి అనుమానం వ్య‌క్తం చేస్తోంది. తెలుగుదేశం పార్టీ, ప్రజాశాంతి పార్టీల మధ్య అం తర్గత బంధం ఉంద‌ని వైసిపి నేత‌లు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ప్రజాశాంతి పార్టీ హెలికాప్టర్‌ గుర్తును తీసుకుంది. హె లికాప్టర్‌ రెక్కలు వైఎస్సార్‌సీపీ ఫ్యాన్‌ గుర్తును పోలి ఉన్నాయి. ఇక ఆ పార్టీ జెండా రంగుల విషయానికొస్తే వైఎస్సార్‌సీ పీ జెండా రంగులను పోలి ఉండటం గమనార్హం. దీని పైనా వైసిపి అనుమానాలు వ్య‌క్తి చేస్తోంది. ఇక‌, తాజాగా వైసిపి బ‌ల‌మైన పోటీ ఇచ్చే నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌జాశాంతి అభ్య‌ర్దులు పోటీలో ఉన్నారు. అయితే, వైసిపి అభ్య‌ర్దుల పేర్లతో ఉన్న వారినే ఇక్క‌డ ప్ర‌జా శాంతి అభ్య‌ర్దులుగా ఖ‌రారు చేసింది. వారు నామినేష‌న్లు దాఖ‌లు చేసారు. అయితే, ఇదంతా ఉద్దేశ పూర్వ‌క‌మేన‌ని వైసిపి ఆరోపిస్తోంది.

ద‌గ్గుబాటి మొదలు రామ‌చంద్రారెడ్డి దాకా..

ద‌గ్గుబాటి మొదలు రామ‌చంద్రారెడ్డి దాకా..

ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలో దగ్గుబాటి ఇంటి పేరు ఉన్న ఇద్దరు బరిలో నిలిచారు. వారి పార్టీ గుర్తులు కూ డా సామీప్యంగా ఉండటంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. పర్చూరు నుంచి వైకాపా అభ్యర్థిగా మాజీ మంత్రి, డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ఇదే క్రమంలో ఒంగోలు సమీపంలోని పెళ్లూరుకు చెందిన దగ్గు బాటి వెంకటేశ్వర్లు అనే మరో వ్యక్తి కూడా... ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా పర్చూరు అసెంబ్లీకి నామినేషన్‌ వేశారు. అదే విధంగా రాయ‌దుర్గం నుండి వైసిపి అభ్య‌ర్దిగా కాపు రామ‌చంద్రారెడ్డి ఉండ‌గా, ప్ర‌జాశాంతి నుండి ఉండాల రామ చంద్రారెడ్డి పోటీ లో ఉన్నారు. ఉర‌వ‌కొండ నుండి వైసిపి అభ్య‌ర్ది గా విశ్వేశ్వర రెడ్డి పోటీలో ఉండ‌గా..ప్ర‌జాశాంతి నుండి కె.విశ్వనాథరెడ్డి బరిలో ఉన్నారు. అనంతపురం అర్బన్‌ అనంత వెంకటరామిరెడ్డి వైసిపి నుండి..ప‌గడి వెంకటరామి రెడ్డి ప్ర‌జాశాంతి నుండి పోటీకి దిగారు .కళ్యాణదుర్గం వైసిపి అభ్య‌ర్దిగా ఉషాశ్రీచరణ్ ఉండ‌గా..ప్ర‌జాశాంతి నుండి ఉషా రాణి నేసే నామినేష‌న్ దాఖ‌లు చేసారు. రాప్తాడు నుండి వైసిపి అభ్య‌ర్ది గా తోపుదుర్ది ప్ర‌కావ్ రెడ్డి పోటీలో ఉండ‌గా.. ప్రజా శాంతి నుండి డి ప్ర‌కాశ్ బ‌రిలో ఉన్నారు. పెనుకొండ నుండి ఎం శంక‌ర‌నారాయ‌ణ వైసిపి అభ్య‌ర్దిగా ఉన్నారు. ప్ర‌జా శాంతి నుండి ఎస్ శంక‌ర్ నారాయణ పోటీ చేస్తున్నారు. ధర్మ‌వ‌రం నుండి కేతిరెడ్డి వెంక‌ట‌రామిరెడ్డి వైసిపి అభ్య‌ర్దిగా ఉండ‌గా..ప్ర‌జాశాంతి నుండి పెద్దిరెడ్డిగారి వెంక‌ట‌రామి రెడ్డి పోటీకి దిగారు. క‌దిరి నుండి వైసిపి అభ్య‌ర్దిగా సిద్దారెడ్డి ఉండ‌గా, ప్ర‌జాశాంతి నుండి స‌న్న‌క సిద్దారెడ్డి బ‌రిలోకి దిగారు. పెద‌కూర‌పాడు నుండి వైసిపి అబ్య‌ర్దిగా నంబూరు శంక‌ర రావు పోటీ చేస్తుండ‌గా..ప్ర‌జాశాంతి నుండి కూడా నంబూరి శంక‌ర‌రావు అనే వ్య‌క్తి పోటీలో ఉన్నారు.

ఎన్నికల ప్రచారంలో జగన్: హోరెత్తిన జనం (ఫొటోలు)

క‌డ‌ప ఫార్ములా అమ‌లు..

క‌డ‌ప ఫార్ములా అమ‌లు..

వైసిపి స్థాపించిన స‌మ‌యంలో జ‌గ‌న్ క‌డ‌ప ఎంపీగా..విజ‌యమ్మ పులివెందుల ఎమ్మెల్యేగా పోటీ చేసారు. ఆ స‌మ‌యం లో ముఖ్య‌మంత్రి గా కిర‌ణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. జ‌గ‌న్ ను ఎలాగైనా ఓడించాల‌నే లక్ష్యంతో క‌డ‌ప లోక్‌స‌భ నామినేష న్ల స‌మ‌యంలో జ‌గ‌న్మోహ‌న రెడ్డి పేరుతో దాదాపు ప‌దుల సంఖ్య‌లో నామినేష‌న్లు దాఖ‌ల‌య్యాయి. అప్పుడు వైసిపి కి ఇంకా కామ‌న్ సింబ‌ల్ ఖ‌రారు కాలేదు. ఓట‌ర్ల‌ను క‌న్‌ఫ్యూజ్ చేయ‌టానికి ఆ విధానం అమ‌లు చేసారు. అయితే ఆ ఎన్నికల్లో జ‌గ‌న్ 5 ల‌క్ష‌ల పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక‌, ఇప్పుడు ప్ర‌తిష్ఠాత్మ‌కంగా మారిన ఈ ఎన్నిక‌ల్లో ఈ ర‌కంగా వైసిపి అభ్య‌ర్దుల పేర్లు క‌లిగిన వారినే అభ్య‌ర్దులుగా నిల‌బెట్ట‌టం ద్వారా ఏ మేర వైసిపికి న‌ష్టం చేయ‌గ‌ల‌రనే చ‌ర్చ మొద‌లైంది.

English summary
Prajasanthi party candidates names same as YCP candidates in contest for AP assembly. More than in ten segments KA Paul party announced same name candidates. Now, YCP saying that TDP and Prajasanthi math fixing come to open with this tricks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X