వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు ముద్దాయిలు, పెద్దలసభలో ఏం మాట్లాడతారు: వర్ల రామయ్య

|
Google Oneindia TeluguNews

అధికార వైసీపీపై టీడీపీ నేత వర్ల, ఆ పార్టీ రాజ్యసభ అభ్యర్థి రామయ్య విరుచుకుపడ్డారు. పెద్దల సభకు వైసీపీ ముద్దాయిలను పంపుతోందని విమర్శించారు. వీరు వెళ్లి రాజ్యసభలో ఏం మాట్లాడతారు అని ప్రశ్నించారు. కోర్టుల చుట్టూ తిరిగేవారికి.. ప్రజా సమస్యలు ఏం తెలుసు అని దుయ్యబట్టారు.

ముద్దాయిలను రాజ్యసభకు సీఎం జగన్ పంపించడం సరికాదన్నారు. ఈ అంశంపై ప్రజలే నిలదీయాలని సూచించారు. అయోధ్య రామిరెడ్డి లాంటి నేరస్తులు రాజ్యసభకు వెళ్లడం ఏపీ ప్రజల దురదృష్టం అని పేర్కొన్నారు. మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణ ఇక్కడే ఉండాలని.. ఢిల్లీ వెళ్లి ఏ సమస్యలపై చర్చిస్తారని సెటైర్లు వేశారు.

ycp rajyasabha candidates are accused: varla ramaiah

Recommended Video

AP Local Body Polls: YSRCP MLA On Macherla Incident | టీడీపీ నేతలు మాచర్ల ఎందుకు వెళ్లారో చెప్పాలి ?

మోపిదేవి వెంకటరమణ రాష్ట్రంలో ఉండి జగన్‌ను చూసుకోవాలన్నారు. కానీ ఆయన రాజ్యసభకు వెళ్లి ఎగువసభ పరువుతీయాలని చూస్తోందని మండిపడ్డారు. వీరి రాజ్యసభలో సమస్యలపై చర్చిస్తారా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ సమస్యలపై వీరికి అవగాహన ఉందా..? ఏ అంశాలపై మాట్లాడతారు అని నిలదీశారు. వైసీపీ రాజ్యసభ అభ్యర్థుల జాతకాలు చైర్మన్ వెంకయ్యనాయుడుకు కూడా తెలుసు అని వర్ల రామయ్య కామెంట్ చేశారు. టీడీపీ నుంచి వర్ల రామయ్య రాజ్యసభ అభ్యర్థిగా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వైసీపీ అభ్యర్థులపై విమర్శలు చేశారు.

English summary
ycp rajyasabha candidates are accused tdp leader varla ramaiah alleged.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X