• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రఘురామ కృష్ణంరాజుపై అనర్హత పిటిషన్ కు రంగం సిద్ధం ? ఈ చర్యతో అందరికీ వార్నింగ్ !!

|

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు పార్టీపై ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్న నేపథ్యంలో వైసిపి ఆయనపై అనర్హత వేటు వేయడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది అని సమాచారం. రఘురామ వ్యవహారంపై చాలా సీరియస్ గా ఉన్న హై కమాండ్ ఆయనపై తీసుకునే చర్యలతో భవిష్యత్ లో ఇలా పార్టీపైనే విమర్శలు చెయ్యాలని చూసే వారికి ముందస్తు వార్నింగ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారాన్ని ఈజీగా వదిలేస్తే మిగతా వారికి అలవాటవుతుంది అని భావిస్తున్న వైసీపీ హై కమాండ్ అనర్హత వేటు వేస్తేనే కరెక్ట్ అని భావిస్తుంది.

రఘురామ కృష్ణంరాజు తేడా.. మనిషే కాదు : తణుకు ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు

రఘురామపై అధిష్టానం ఫుల్ సీరియస్

రఘురామపై అధిష్టానం ఫుల్ సీరియస్

ఇప్పటికే ఎంపీ రఘురామ అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోనే కాకుండా ఢిల్లీ వేదికగా ఎండగడుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరువును రోడ్డు మీద పెడుతున్నారు.ఇంతా చేస్తూనే సీఎం జగన్మోహన్ రెడ్డి కలవడానికి అవకాశం ఇస్తే కలుస్తాను అని చెప్పి, సీఎం ను ఇరకాటంలో పెట్టేలా లేఖ రాశారు.రఘురామ రోజురోజుకు దూకుడు పెంచుతున్ననేపథ్యంలో హైకమాండ్ చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోందని సమాచారం. పార్టీ ఇచ్చిన షోకాజ్ నోటీసుపై ఆయన చేసిన రచ్చతో అధిష్టానం చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది.

రఘురామలా ఇంకెవరు చెయ్యకుండా స్ట్రాంగ్ గానే చర్యలు

రఘురామలా ఇంకెవరు చెయ్యకుండా స్ట్రాంగ్ గానే చర్యలు

ఇంతా జరుగుతున్నా రఘురామతో ఎలాంటి చర్చలకు పిలవని, సైలెంట్ గా ఉన్న సీఎం జగన్ మాత్రం పార్టీలో జరుగుతున్న ఈ పంచాయతీపై తీవ్ర అసహనంతో ఉన్నట్లుగా సమాచారం. రోజురోజుకు రఘురామ అటు పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం, రోజుకొక కొత్త వ్యాఖ్యలతో కలకలం సృష్టిస్తున్న పరిస్థితులతో ఆయనపై అనర్హత వేటు వేయాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు ఎదురైనా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే వెనుకాడేది లేదని మిగతా వారికి సంకేతాలు పంపాలని హైకమాండ్ భావిస్తున్నట్లుగా సమాచారం.

న్యాయనిపుణులతో సంప్రదింపులు

న్యాయనిపుణులతో సంప్రదింపులు

రఘురామ కృష్ణంరాజుపై వేటు ఎలా వేయాలి అన్న దానిపై న్యాయనిపుణులతో ఇప్పటికే చర్చలు జరిపిన వైసిపి హైకమాండ్ గతంలో జేడీయూ ఎంపీగా ఉన్న శరద్ పవార్ పై రాజ్యసభ చైర్మన్ అనర్హత వేటు వేసిన సందర్భాన్ని పరిశీలిస్తుంది. అదే పద్ధతిలో రఘురామకృష్ణంరాజు పైన వేటు వేయొచ్చని న్యాయ సలహా వైసిపి అధిష్టానానికి అందినట్లుగా తెలుస్తోంది.

వైసిపి హైకమాండ్ రఘురామ కృష్ణం రాజుపై అనర్హత వేటు వేయడానికి కావాల్సిన చర్యలను మొదలుపెట్టినట్లు గా సమాచారం.

లోక్ సభ స్పీకర్ కు అనర్హత పిటీషన్ ఇవ్వనున్న వైసీపీ

లోక్ సభ స్పీకర్ కు అనర్హత పిటీషన్ ఇవ్వనున్న వైసీపీ

అందులో భాగంగా రఘురామ వ్యవహారంపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తోనూ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తోనూ మాట్లాడడానికి,లోక్ సభ స్పీకర్ కు అనర్హత పిటిషన్ను ఇవ్వడానికి ఇద్దరు వైసీపీ ఎంపీలు ఢిల్లీ వెళ్లారు. ఎంపీ బాలశౌరి అక్కడ వేగంగా పావులు కదుపుతున్నారు. కేంద్రంలోని పలువురు మంత్రులను స్పీకర్ ను కలిసి తమ వాదన వినిపించారు. ఇక ఇదే సమయంలో తనకు ప్రాణహాని ఉందని రఘురామ చేసిన ఆరోపణలపై ప్రభుత్వం కూడా సమాధానం ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

  Raghurama Krishnam Raju ఎపిసోడ్ తో BJP లో చీలికలు!! || Oneindia Telugu
  ఢిల్లీలో రఘురామ టార్గెట్ గా పావులు కదుపుతున్న వైసీపీ ఎంపీలు

  ఢిల్లీలో రఘురామ టార్గెట్ గా పావులు కదుపుతున్న వైసీపీ ఎంపీలు

  ముందుగా పార్టీ నుంచి బహిష్కరించి ఆతర్వాత అనర్హత వేటు వేయాలని వైసీపీ హై కమాండ్ భావిస్తున్నట్టుగా సమాచారం. ఢిల్లీ వెళ్లిన ఎంపిలు అక్కడ పనులు చక్కబెడితే, గ్రీన్ సిగ్నల్ ఇస్తే, న్యాయ నిపుణుల సలహా మేరకు రఘురామకృష్ణంరాజుకు చుక్కలు చూపించాలి అనే ప్లాన్లో వైసిపి హైకమాండ్ ఉంది. ఏది ఏమైనా రఘురామ కృష్ణం రాజు పై అనర్హత వేటు వైపే వైసిపి ఆలోచన చేస్తోంది. అయితే రఘురామ కూడా న్యాయనిపుణుల సలహా తీసుకుని తనపై అనర్హత వేటు వేసేంత సీన్ వైసిపి హైకమాండ్ కు లేదని భావిస్తున్నారు. కానీ హైకమాండ్ మాత్రం రఘురామపై తీసుకునే చర్యలు భవిష్యత్తులో మిగతా నాయకులకు కూడా ఒక వార్నింగ్ లా ఉండాలని కాస్త సీరియస్ గానే చర్యలకు దిగుతోంది.

  English summary
  YCP high command has full serious on Narasapuram YCP MP Raghurama Krishnam Raju. Narasapuram MP Raghuramakrishnan Raju has raised his voice of contempt for the party and the YCP is preparing to field a disqualification.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more