ఏపీ ప్రభుత్వంతో బ్యాంకుల కుమ్మక్కు?? నిబంధనలకు విరుద్ధంగా రుణాలు?
ఏ ప్రభుత్వంతో బ్యాంకులు కుమ్మక్కయ్యా? నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వానికి రుణాలు మంజూరు చేస్తున్నాయా? దీనిపై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా దర్యాప్తు చేయబోతోందా? అనే ప్రశ్నలకు ఔననే సమాధానం వస్తోంది.
బ్యాంకులతోపాటు ప్రభుత్వరంగ ఆర్థిక సంస్థలు కూడా రాష్ట్ర ప్రభుత్వంతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగాకానీ కుమ్మక్కై అవకతవకలకు పాల్పడుతున్నాయని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేశారు. ఆయన ఆరు పేజీలతో లేఖ రాశారు. ఆర్థికంగా ప్రభుత్వ పరిస్థితి ఏమిటి? అనేది చూడకుండా దాని ఆధ్వర్యంలోని సొసైటీలకు, కార్పొరేషన్లకు, కంపెనీలకు బడ్జెటేతర రుణాలిస్తూ బ్యాంకులు తప్పుడు మార్గంలో పయనిస్తున్నాయని ఆ లేఖలో వివరించారు.

బ్యాంకులు ప్రభుత్వ ఆర్థిక స్థితిగతులను అసలు పరిశీలించడంలేదు. ఇచ్చే నిధులు ఎందుకు ఉపయోగపడుతున్నాయో పరిశీలించడంలేదు. నిబంధనల ప్రకారమైతే ప్రభుత్వరంగ సంస్థలు రుణాలు తీసుకొని ప్రభుత్వ వ్యయం కోసం సమకూర్చకూడదు. కానీ ఇక్కడ అదే జరుగుతోంది. బ్యాంకులు అందరికీ తెలిసేలా అవకతకవలకు పాల్పడుతున్నా ఆర్బీ ఐ కనిపెట్టలేని పరిస్థితి నెలకొందని, ఆయా బ్యాంకులపై చర్యలు తీసుకోవాలని కోరారు.