వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

y క్యాటగిరీ భద్రత కల్పించినందుకు ధన్యవాదాలు, స్పీకర్‌ ఓం బిర్లాకు వైసీపీ ఎంపీ రఘురామ థాంక్స్..

|
Google Oneindia TeluguNews

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అనుకున్నది సాధించారు. తన ప్రాణానికి హానీ ఉంది అని స్పీకర్‌కి ఫిర్యాదు చేసి.. వై క్యాటగిరీ భద్రత పొందారు. అయితే తనకు భద్రత కల్పించేందుకు హోంశాఖకు సిఫారసు చేసిన స్పీకర్ ఓం బిర్లాతో శనివారం సమావేశమయ్యారు. స్పీకర్ సూచనలతో రఘురామకు కేంద్రం సెక్యూరిటీ కల్పిస్తోంది. అయితే ఓం బిర్లాను కలిసి రఘురామ ధన్యవాదాలు తెలిపారు.

దిష్టిబొమ్మ దగ్దం, కేసులతో..

దిష్టిబొమ్మ దగ్దం, కేసులతో..

సొంత పార్టీ, ప్రభుత్వంపై రఘురామ విమర్శలు చేయడంతో అటు నుంచి కూడా అలానే రియాక్షన్స్ వచ్చాయి. దిష్టిబొమ్మలు దగ్దం చేయడం.. కేసులు నమోదు చేయడంతో తనకు భద్రత కల్పించాలని స్పీకర్ ఓం బిర్లాకు రఘురామ కృష్ణంరాజు జూన్‌లో లేఖ రాశారు. అంతకుముందు ప్రధాని మోడీకి కూడా రఘురామ లేఖ రాశారు. ఎంపీ రఘురామ లేఖపై స్పీకర్ స్పందించి... భద్రతపై తగిన చర్యలు తీసుకోవాలని హోంశాఖను కోరారు. స్పీకర్ సూచనతో హోంశాఖ ఆయనకు భద్రతను కల్పిస్తామని తెలిపింది. వై క్యాటగిర భద్రతను అందిస్తోంది.

బీజేపీకి దగ్గరగా..

బీజేపీకి దగ్గరగా..

రఘురామకృష్ణంరాజు బీజేపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. దీనికితోడు ఆయన సీఎం జగన్‌పై విమర్శలు చేయడం, ప్రభుత్వ పథకాల తీరును తప్పుపట్టడంతో వైసీపీ నేతలు ముప్పేట దాడికి దిగారు. తొలుత ఎమ్మెల్యే ప్రసాదరాజు.. ఎంపీపై విరుచుకుపడ్డారు. జగన్ దయతోనే ఆయన ఎంపీ అయ్యారని.. పేర్కొన్నారు. మిగతా నేతలు కూడా ఆడపా దడపా కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. దీనికి రఘురామ కూడా ధీటుగానే స్పందిస్తున్నారు.

Recommended Video

ప్రజా వాగ్గేయకారుడు వంగపండు మృతికి CM Jagan సహా సంతాపాన్ని తెలిపిన పలువురు రాజకీయ ప్రముఖులు !
 మంత్రుల కామెంట్స్..

మంత్రుల కామెంట్స్..

మంత్రి రంగనాథరాజు, కారుమూరి నాగేశ్వరరావుపై కామెంట్లు చేయడంతో.. ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగతా వైసీపీ నేతలు కూడా రఘురామపై ముప్పేట మాటల దాడి చేయడంతో.. తనకు భద్రత కల్పించాలని ప్రధాని, స్పీకర్‌కు ఆయన లేఖ రాశారు. దీంతో స్పీకర్ స్పందించి భద్రత కల్పించాలని హోంశాఖను కోరారు. దీనికి అనుగుణంగా హోంశాఖ స్పందించి వై క్యాటగిరీ ప్రొటెక్షన్ కల్పిస్తోంది.

ఢిల్లీలోనే మకాం..

గత కొంతకాలంగా రఘురమ ఢిల్లీలోనే ఉంటున్నారు. బీజేపీ పెద్దలు, కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సన్నిహితంగా మెలగుతున్నారు. వివిధ అంశాలపై ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. మరోవైపు ఆయనపై అనర్హత వేటు వేయాలని విజయసాయిరెడ్డి నేతృత్వంలోని బృందం స్పీకర్‌ని కోరిన సంగతి తెలిసిందే. దీనిపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే భద్రత కల్పించినందుకు థాంక్స్ చెప్పిన రఘురామ.. అనర్హత పిటిషన్‌పై చర్చించాడనే అంశం తెలియాల్సి ఉంది.

English summary
ycp rebel mp raghurama krishnam raju thanks to speaker om birla for providing y security security.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X