వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీసం మెలేసిన పోలీస్ మాధవ్‌కు తొలిజాబితాలో చోటిచ్చిన వైసీపీ

|
Google Oneindia TeluguNews

హైదరాబాదు: శనివారం పులివెందులలో తన చిన్నాన్న వివేకానందరెడ్డి అంత్యక్రియలకు హాజరై హైదరాబాదు చేరుకున్న వైసీపీ అధినేత జగన్... తమ లోక్‌సభ అభ్యర్థులకు సంబంధించి కసరత్తు చేసి తొలి జాబితాను విడుదల చేశారు. తొలి జాబితాలో 9 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు, మూహుర్తం బాగుందని చెప్పడంతో ముందుగా 9 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తున్నట్లు రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఆదివారం రోజు ఉదయం 10 గంటలకు ఇడుపులపాయలోని వైయస్ ఘాట్‌కు వెళ్లి తన తండ్రి వైయస్‌కు నివాళులు అర్పించి మిగతా లోక్‌సభ అభ్యర్థుల పేర్లు... 175 నియోజకవర్గాలకు చెందిన క్యాండిడేట్ల పేర్లను జగన్ ప్రకటించనున్నట్లు వేమిరెడ్డి తెలిపారు.

YCP releases first list with candidates for the upcoming loksabha polls

నాడు సీఐగా పనిచేసి రాజీనామా చేసిన గోరంట్ల మాధవ్‌కు హిందూపురం నుంచి టికెట్ కేటాయించగా... కర్నూలు లోక్‌సభను డాక్టర్ సంజీవ్ కుమార్‌కు కేటాయించారు. ఇక బాపట్ల నియోజకవర్గం నుంచి సాధారణ వ్యక్తి నందిగం సురేష్‌ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు వైయస్ జగన్. ఇక తొలి జాబితాలో స్థానం దక్కించుకున్న అభ్యర్థుల పేర్లు ఇలా ఉన్నాయి.

నేను చనిపోయినా..జగన్ అన్ననే గెలిపించండి: పూతలపట్టు ఎమ్మెల్యే సెల్ఫీ వీడియోనేను చనిపోయినా..జగన్ అన్ననే గెలిపించండి: పూతలపట్టు ఎమ్మెల్యే సెల్ఫీ వీడియో

1. కడప- వైయస్ అవినాష్ రెడ్డి
2. అరకు - గొడ్డేటి మాధవి
3. అనంతపురం - తలారి రంగయ్య
4. అమలాపురం- చింత అనురాద
5. బాపట్ల - నందిగామ సురేష్
6. కర్నూలు - డాక్టర్ సంజీవ్ కుమార్
7. హిందూపురం - గోరంట్ల మాధవ్
8. రాజంపేట - పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి
9. చిత్తూరు - నల్లకొండాగారి రెడ్డప్ప

English summary
The YSRCP had anounced its first list of contesting candidates for the upcoming loksabha polls. Rajyasabha MP Vemireddy Prabhakar reddy had anounced the list of 9 candidates. Gorantla Madhav who resinged to his police job found place in the first list.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X