రాజ్యసభ డెప్యూటి ఛైర్మన్ ఎన్నికలో వైసీపి పక్కా ప్రణాళిక..! ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన
రాజ్యసభ డెప్యూటీ ఛైర్మన్ ఎన్నిక సందర్బంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. బీజెపితో వైసీపి రహస్య స్నేహం కొనసాగిస్తోందన్న అపవాదు నుండి బయటపడేందుకు శత విధాల ప్రయత్నం చేసింది. రాజకీయం కోసం కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపి విధానాలను వ్యతిరేకించే వైసీపి అందుకు తగ్గట్టు గానే బీజెపి బలపరిచిన అభ్యర్థికి ఓటు వేయకుండా దూరంగా ఉన్నామనే సంకేతాలను రాష్ట్ర ప్రజలకు ఇవ్వాలని భావించింది. అందు కోసం ఎంపీ విజయ సాయి రెడ్డి తన రాజకీయ చతురతకు పదును పెట్టి పక్కా ప్లాన్ ప్రకారం ఓటింగ్ కు ఎందుకు దూరంగా ఉన్నామో రాష్ట్ర ప్రజలు గమనించాలని ప్రకటించారు. ఇన్నాళ్లూ బీజెపిని మాటవరసకు కూడా విమర్శించని వైసీపి ఉన్న పళంగా మోదీ సర్కార్ విధానాలను వ్యతిరేకిస్తున్నమని చెబితే నమ్మేది ఎవరో వారే చెప్పాలి. ఇంత చేసినా కూడా రావాల్సిన మైలేజ్ రాలేదని వైసీపి నేతలు తమలో తాము మదనపడుతున్నట్టు సమాచారం..

రాజ్యసభ ఎన్నికలో బెడిసికొట్టిన వైసీపి వ్యూహం..! ఫలితం ఇవ్వని విజయసాయి చతురత..!!
దేశ వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో ఎన్డీయే విజయం సాధించిన విషయం తెలిసిందే. ఏకగ్రీవంగా జరగాల్సిన ఎన్నిక కాస్తా ఓటింగ్ వరకు వెళ్లడంతో అధికార, ప్రతిపక్షాలు ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నిక కోసం పార్టీలన్నీ ఎన్నో ప్రణాళికలు వేసుకున్నాయి. అయితే, విపక్షాలను ఏకం చేయడంలో విఫలమైన కాంగ్రెస్ పార్టీ ఓడిపోక తప్పలేదు. ఈ ఎన్నిక విషయంలో కొన్ని పార్టీలు అనుసరించిన విధానం ఆసక్తి రేకెత్తిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ ఓటింగ్‌కు గైర్హాజరవడం తీవ్ర చర్చనీయాంశం అయింది.

బీజెపి, వైసీపి రహస్య స్నేహితులనే ఆరోపణను
తిప్పికొట్టాలనుకున్న వైసీపి.. కానీ ఫెయిల్ ఐన ప్రయత్నం..
ఏపీ సమస్యల కోసం దేశ రాజధానిలో తీవ్ర స్థాయిలో పోరాటం జరుగుతున్న సమయంలో రాష్ట్రానికి చెందిన పార్టీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు కొద్ది సమయం ముందు వరకు బీజేపీ వ్యతిరేక కూటమికే ఓటు వేస్తామని ప్రకటించిన వైసీపీ, తర్వాత మాట మార్చింది. అప్పటి వరకు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తామని ప్రకటించిన వైసీపీ తర్వాత యూ టర్న్ తీసుకుంది. ఎన్నికకు గైర్హాజరవుతున్నట్లు ఆ పార్టీకి చెందిన ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు.

బీజెపిని బూచీగా చూపే ప్రయత్నం..! వైసీపి ని నమ్మని ప్రజానికం..!!
ప్రస్తుత వర్షకాల సమావేశాల్లో పాల్గొన్న విజయసాయిరెడ్డి రాజ్యసభ ఎన్నికకు నోటిఫికేషన్ వెలవడినప్పటి నుంచి బీజేపీ వ్యతిరేక పక్షానికి ఓటేస్తామని విస్తృతంగా ప్రచారం చేశారు. ఓటింగ్ సమయానికి ముందు పూర్తిగా మాట మార్చారు. కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారనే కారణంగానే తాము ఓటు వేయడం లేదని చెప్పుకొచ్చారు. విపక్షాల సమావేశంలో ఇతర పార్టీల అభ్యర్థిని నిలబెడతామని చెప్పారని, తర్వాత మాట మార్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినే రంగంలోకి దించారని విజయసాయిరెడ్డి చెప్పారు. ఏపీకి కాంగ్రెస్, బీజేపీ రెండూ అన్యాయం చేశాయని., అందుకే ఎవరికీ ఓటు వేయబోమని విజయసాయి రెడ్డి తెలిపారు.

అనుకున్న స్థాయిలో రాని మైలేజ్..! అంతర్మదనంలో నేతలు..!!
వాస్తవానికి విజయసాయిరెడ్డి కాంగ్రెస్ తరపున హరిప్రసాద్ నామినేషన్ దాఖలు చేసిన తర్వాత కూడా బీజేపీకి వ్యతిరేక పక్షానికే ఓటు వేస్తామని ప్రకటించారు. కానీ, ఓటు వేయకుండా నిర్ణయం తీసుకుని సేఫ్ గేమ్ ఆడింది వైసీపీ. ఈ మధ్య బీజేపీతో సన్నిహితంగా ఉంటున్న ఆ పార్టీ నేతలు, వ్యతిరేకంగా ఓటు వేస్తే తమ మధ్య సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉన్నదని భావించే, వారు ఓటింగ్‌కు గైర్హాజరై ఉంటారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో టీడీపీని ఇబ్బంది పెట్టాలనుకుని, వైసీపీ మరోసారి ఇరకున పడినట్లైంది. వైసిపి వేసిన రాజకీయ పన్నాగం సరైన రీతిలో రక్తి కట్టక ప్రజా క్షేత్రంలో మరోసారి నవ్వులపాలైనట్టు చర్చ జరుగుతోంది.