• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

లోకేష్ డప్పు కొట్టుకోవటం ఆపాలంటున్న వైసీపీ .. అదంతా జగన్ క్రెడిట్

|

టీడీపీ కష్టాన్ని వైసీపీ ఖాతాలో వేసుకుంటారా అంటూ పోలవరం ప్రాజెక్ట్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంతా తామే చేసినట్టు డప్పు కొట్టుకునే ప్రయత్నం చేస్తుందని అలా చెప్పుకోవడం తగ్గించాలని ఆయన మండిపడ్డారు మాజీ మంత్రి నారా లోకేష్ . ఇక లోకేష్ మాట్లాడిన మాటలకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి కౌంటర్ వేశారు . పోలవరం క్రెడిట్ తన తండ్రిదంటూ లోకేష్ డప్పుకొట్టుకోవడం ఆపాలంటూ హెచ్చరించారు. అసలు డప్పు కొట్టుకునేది తాము కాదని లోకేష్ అని ఆయన మండిపడ్డారు .

బాలయ్యకు సోదరి పురంధరేశ్వరి కూడా షాక్ ఇచ్చారే ..ఏం చేశారంటే

 లోకేష్ పోలవరం నిధుల క్రెడిట్ తమదే అన్న వ్యాఖ్యలపై విజయసాయి ఫైర్ .. జగన్ అడిగితేనే నిధులు ఇచ్చారన్న విజయసాయి

లోకేష్ పోలవరం నిధుల క్రెడిట్ తమదే అన్న వ్యాఖ్యలపై విజయసాయి ఫైర్ .. జగన్ అడిగితేనే నిధులు ఇచ్చారన్న విజయసాయి

పోలవరం క్రెడిట్ అంతా టీడీపీది అయితే మీ హయాంలో నిధులు ఎందుకు తేలేకపోయారు అని ఆయన ఎద్దేవా చేశారు . పోలవరం అంచనాల ఆమోదం, నిధుల గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్రమోడీని కలిసినప్పుడు కోరారని తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ కోసం నిధులు మంజూరు చేసిన ఘనత జగన్ దేనని దాని ఫలితంగానే రూ.55,548 కోట్ల సవరించిన అంచనాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిపారు. ఇక లోకేష్ మాత్రం తన తండ్రి కష్టానికి ఫలితమని డప్పుకొట్టు కోవడం వల్ల నిధులు మంజూరు కాలేదన్నారు . పోలవరం ప్రాజెక్టుకు ఖర్చు చేసిన నిధులకు లెక్కలు చూపకుండా మొండికేసిన చరిత్ర మీదని విజయసాయి తిట్టిపోశారు.

టీడీపీ హయాంలో పంపిన డీపీఆర్ కు ఆమోదం .. అది టీడీపీ క్రెడిట్ అన్న నారా లోకేష్

టీడీపీ హయాంలో పంపిన డీపీఆర్ కు ఆమోదం .. అది టీడీపీ క్రెడిట్ అన్న నారా లోకేష్

పోలవరం ప్రాజెక్టుపై మాజీమంత్రి నారా లోకేష్ ట్వీట్ లో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు ఆమోదం లభించడంపై టిడిపి ప్రభుత్వం సాధించిన విజయాన్ని వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు . అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం డిపిఆర్ -2 కు అనుమతి పొందడానికి అన్ని ప్రయత్నాలు చేసి రూ .55 వేల కోట్ల నిధులకు డీపీఆర్ ఇస్తే ఇప్పుడు అది ఆమోదం పొందిందని పేర్కొన్నారు . చంద్రబాబు నాయుడు పంపిన అన్ని ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం అంగీకరించినందున, అందులో అవినీతి ఎక్కడ ఉంది? అని ఆయన లాజిక్ మాట్లాడారు. ఇక మీ గొప్పలు ఆపండి అంటూ మండిపడ్డారు. కానీ వైసీపీ నేత ఎంపీ విజయసాయి నీ డప్పు కొట్టటం ఆపు అని పోలవరం విషయంలో ఏం జరిగిందో ట్విట్టర్ వేదికగా తెలియజేశారు .

నేతల ఆరోపణలకు సోషల్ మీడియా వేదిక

నేతల ఆరోపణలకు సోషల్ మీడియా వేదిక

నేతలు ప్రెస్ మీట్ లు పెట్టి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునే రోజులు క్రమంగా తగ్గుతున్నాయి. ఇలా సోషల్ మీడియా వేదికగా జనాలకు తెలిసేలా మాటల దాడి చేసుకోవటం ఇప్పుడు ఏపీలో కామన్ అయిపొయింది. ఎవరు ఏం చెప్పాలన్నా, ఎవర్ని తిట్టాలన్నా ఫేస్ బుక్ నో , ట్విట్టర్ నో తమ అభిప్రాయం తెలిపే వేదికగా వాడుకుంటున్నారని తెలుస్తుంది. ఏది ఏమైనా ఇలా సోషల్ మీడియా ను బాగా వాడటంలో వైసీపీ నేత విజయసాయిది అందే వేసిన చెయ్యి. ఎన్నికల ముందు నుండీ ఇప్పటి వరకు ప్రతి రోజు టీడీపీపై ఆయన తన వాగ్బాణాలను ఎక్కు పెడుతూనే ఉన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Former minister Nara Lokesh said that the YSR Congress party is trying to duplicate the TDP's hardship in the YCP account. YSR Congress party leader Vijayasair Reddy countered the words of Lokesh. Polavaram Credit is not of his father and warned to stop such comments .If the credit of the Polavaram is all TDP, why did you not bring funds in your rule, he said. Chief Minister YS Jagan Mohan Reddy has asked Prime Minister Narendra Modi about the approval and funding of Polavaram estimates. He said that it is nothing but Jagan's credit .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more