వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీ స్క్రిప్ట్ , బీజేపీ డైరెక్షన్ లో వర్మ సినిమా ..ఇప్పుడు కొత్త డ్రామా ...టీడీపీ నేత డొక్కా ఫైర్

|
Google Oneindia TeluguNews

ఏపీలో ఎన్నికలు ముగిశాయి. నేతలు ఎవరి అంచనాలలో వాళ్ళున్నారు. 130 స్థానాలు గెలుస్తాం నో డౌట్ అని చంద్రబాబు అంటే , ఆల్రెడీ విజయం డిసైడ్ అయ్యింది . ప్రమాణ స్వీకారానికి కూడా ముహూర్తం ఖరారయ్యింది అని చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నారు జగన్ . ఇక ఇదే సమయంలో వివాదాస్పద డైరెక్టర్ వర్మ ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టించారు.

రామ్ గోపాల్ వర్మ ప్రెస్ మీట్ వల్ల రెండు వర్గాల మధ్య ఘర్షణ: శాంతిభద్రతలకు విఘాతం: విజయవాడ పోలీసులురామ్ గోపాల్ వర్మ ప్రెస్ మీట్ వల్ల రెండు వర్గాల మధ్య ఘర్షణ: శాంతిభద్రతలకు విఘాతం: విజయవాడ పోలీసులు

విజయవాడలో లక్ష్మీస్ ఎన్టీఆర్ పై వర్మ ప్రెస్ మీట్ పెట్టేందుకు యత్నం

విజయవాడలో లక్ష్మీస్ ఎన్టీఆర్ పై వర్మ ప్రెస్ మీట్ పెట్టేందుకు యత్నం

ఏపీలో ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతివిమర్శలతో రాజకీయం రసవత్తరంగా సాగుతుంది. అలాంటి సమయంలో రాం గోపాల్ వర్మ విజయవాడలో నడిరోడ్ పై లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై ప్రెస్ మీట్ పెట్టాలని ప్రయత్నించి ఏపీలో అసలే హీట్ తో ఉన్న వాతావరణాన్ని మరింత హీటెక్కించే ప్రయత్నం చేశారు. పోలీసులు భగ్నం చెయ్యటంతో వర్మ విఫలం అయ్యారు. ఇక వర్మ ప్రెస్ మీట్ ఇష్యూపై టీడీపీ నేత డొక్కా ఫైర్ అయ్యారు.

విజయవాడలో వర్మ ప్రెస్ మీట్ భగ్నం ... అడ్డుకున్న పోలీసులు

విజయవాడలో వర్మ ప్రెస్ మీట్ భగ్నం ... అడ్డుకున్న పోలీసులు

సంచలనాలకు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీరు విజయవాడలో తీవ్ర కలకలం రేపింది . లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం కోసం ప్రెస్ మీట్ పెట్టేందుకు ప్రయత్నించిన వర్మను పోలీసులు అడ్డుకుని విజయవాడ నుంచి హైదరాబాద్ తిప్పి పంపేందుకు తీవ్రంగా ప్రయత్నించి ఎట్టకేలకు సఫలం అయ్యారు. ఇక ఈ లోపు వర్మ నడిరోడ్డుపై మీడియా సమావేశం పెట్టేందుకు ప్రయత్నించి విఫలం అయ్యారు. దీనిపై టీడీపీ అగ్రనేత డొక్కా మాణిక్యవరప్రసాద్ ఘాటుగా స్పందించారు.

వర్మ పై డొక్కా ఫైర్ .. ఎవరి డైరెక్షన్లో కొత్త డ్రామా మొదలు పెట్టారంటూ విమర్శలు

వర్మ పై డొక్కా ఫైర్ .. ఎవరి డైరెక్షన్లో కొత్త డ్రామా మొదలు పెట్టారంటూ విమర్శలు

రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొని ఉన్న సమయంలో వర్మ ఎవరి డైరక్షన్ లో చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు? అంటూ మండిపడ్డారు. వైసీపీ స్క్రిప్ట్, బీజేపీ ప్రొడక్షన్ లో సినిమా తీసిన వర్మ మరో కొత్త డ్రామా మొదలుపెట్టారని విమర్శించారు. విజయవాడలో 144 సెక్షన్ ఉంటే ఎవరి పర్మిషన్ లేకుండా ప్రెస్ మీట్ ఎలా పెడతారంటూ డొక్కా నిలదీశారు. ముఖ్యమంత్రి నిర్వహించే సమీక్షా సమావేశాలకు కోడ్ పేరుతో అడ్డుచెబుతున్నారు, అలాంటప్పుడు సినిమాలకు కోడ్ వర్తించదా? అంటూ సీఎస్, ఈసీలను ప్రశ్నించారు డొక్కా మాణిక్య వరప్రసాద్ .

English summary
With whom direction Varma trying to get rid of the tranquil atmosphere in the state? TDP leader Dokka Manikya Varaprasad criticized Varma for making a new drama on the production of BJP with YCP script. If there was 144 section in Vijayawada, varma tried to conduct a press meet without anyone's permission asked Dokka Manikya Varaprasad .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X