అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబును ఇమ్రాన్ ఖాన్‌తో పోల్చిన అంబటి.. ! ఆయన కొంప ఎప్పుడో మునిగిపోయింది.

|
Google Oneindia TeluguNews

Recommended Video

చంద్రబాబు ఇల్లు ఖాళీ చేస్తే ఆయనకే మంచిది: అంబటి || Ambati Rambabu Satires On Chandrababu Naidu

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. ఆర్టికల్‌ 370 రద్దుతో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు వచ్చినంత కోపం కృష్ణా వరదలతో చంద్రబాబుకు వచ్చిందని ఎద్దేవా చేసారు. వరదలతో చంద్రబాబు నివాసం మునిగిపోతే.. గత ఎన్నికల్లో ఓటమితో రాజకీయంగా చంద్రబాబు కొంప ఎప్పుడో మునిగిపోయిందని వ్యాఖ్యానించారు. హై సెక్యురిటీ జోన్‌లో ఉన్న చంద్రబాబు ప్రమాదకరమైన ఇంట్లో ఎందుకు వుంటున్నారని అంబటి రాంబాబు ప్రశ్నించారు.

చంద్రబాబుకు ఎందుకీ ఆందోళన..
ప్రస్తుత ఏడాది కురుస్తున్న వర్షాలతో రాష్ట్ర ప్రజలంతా ఆనందంగా ఉంటే.. వరద నా కొంప ముంచడానికే వస్తోందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆందోళన చెందుతున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ప్రజలు ప్రాజెక్టుల దగ్గరకి వెళ్లి కృష్ణా ప్రవాహం చూసి ఆనందిస్తున్నారని, కానీ చంద్రబాబు కుటుంబం మాత్రం బాధగా ఉందని ఆయన అన్నారు. హై సెక్యురిటీ జోన్‌లో ఉన్న చంద్రబాబు ప్రమాదకరమైన ఇంట్లో ఎందుకు వుంటున్నారని ప్రశ్నించారు. కృష్ణానదికి ఈ స్థాయిలో వరద రావడం చాలా అరుదున్నారు.

ఆర్టికల్‌ 370 రద్దుతో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు వచ్చినంత కోపం కృష్ణా వరదలతో చంద్రబాబుకు వచ్చిందని అన్నారు. ఆయన నివాసం అక్రమ కట్టడమని, నది ప్రవాహంలో ఉందని ముఖ్యమంత్రి జగన్‌ ముందే చెప్పినట్లు ఆయన గుర్తుచేశారు. అయినా చంద్రబాబు తప్పని తెలిసికూడా మొండిగా అక్కడే వుంటున్నారని విమర్శించారు. వరదలతో చంద్రబాబు నివాసం మునిగిపోతే.. గత ఎన్నికల్లో ఓటమితో రాజకీయంగా చంద్రబాబు కొంప ఎప్పుడో మునిగిపోయిందని ఎద్దేవా చేశారు.

YCP Senior leader Ambati Rambabu serious comments on TDP Chief Chandra Babu

చంద్రబాబు కోరితే పరిశీలిస్తాం..
భారీ వరదలతో నది గర్భంలో నిర్మించిన చంద్రబాబు నివాసంలోకి నీరు చేరిన విషయం గురించి అంబటి రాంబాబు వివరించారు. దీంతో ఇంట్లో నుంచి సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోవాలని అక్కడి సిబ్బందికి అధికారులు సూచించారని గుర్తు చేసారు. నీచమైన ప్రచారాల వల్లే ప్రజలు టీడీపీని ఛీ కొట్టారని... ఇంటి విషయంలో తప్పు చేస్తూ దాన్ని కప్పిపుచ్చుకునేందుకు అనేక తప్పులు చేస్తున్నారని ఆరోపించారు. నోటీస్ ఇచ్చేందుకు వెళ్లిన రెవెన్యూ సిబ్బందిని కూడా రానివ్వకుండా అడ్డుకున్నారని ఫైర్ అయ్యారు. తక్షణమే ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవడం మంచిదని సూచిస్తున్నామని... తప్పును సరిదిద్దుకోకపోతే ప్రకృతి ప్రకోపానికి గురి అవుతారని హెచ్చరించారు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి అమరావతిలో సొంత ఇల్లు ఎందుకు కట్టుకోలేదని రాంబాబు ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత హోదాలో ప్రభుత్వ ఇళ్లు ఏర్పాటు కోసం చంద్రబాబు కోరితే పరిశీలిస్తామని అంబటి రాంబాబు స్పష్టం చేసారు. వదర ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నామని..మంత్రులు బాధితులతో మాట్లాడుతున్నారని వివరించారు.

English summary
YCP Senior leader Ambati Rambabu serious comments on TDP Chief Chandra Babu. He demanded Babu to vacaate from illegal constrution whcih effected by flood.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X