వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీ ట్ర‌బుల్ షూట‌ర్‌కే ట్ర‌బుల్స్‌: శిష్యుడికి ప్రాధాన్య‌త‌..ఆయ‌న‌కు మాత్రం: ఆవేద‌న‌లో వైసీపీ సీన

|
Google Oneindia TeluguNews

వైసీపీ అధికారంలోకి వ‌చ్చి రెండు నెల‌లు పూర్తి కాలేదు. అయితే..పార్టీలో .. ప్ర‌భుత్వంలో జ‌రుగుతున్న ప‌రిణామాలు కొంద‌రు సీనియ‌ర్ల‌కు రుచించం లేదు. పార్టీ అధికారంలోకి రావ‌టానికి జ‌గ‌న్ స్వ‌శ‌క్తి కార‌ణ‌మైనా..తాము సైతం త‌మ వం తు పాత్ర పోషించామ‌ని గుర్తు చేస్తున్నారు. జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయిన త‌రువాత త‌మకు ప్రాధాన్య‌త ఉంటుంద‌ని
భావించిన ఆ సీనియ‌ర్లు ఇప్పుడు అసెంబ్లీలో అధికార పార్టీకి ట్ర‌బుల్ షూట‌ర్లుగా మాత్ర‌మే ఉంటున్నారు. కానీ, వారి ట్ర‌బుల్స్ మాత్రం అధినేత సీరియ‌స్‌గా తీసుకోవ‌టం లేద‌నే అభిప్రాయం ఉంది. తమ‌కు మంత్రి ప‌ద‌వులు ఇవ్వ‌క పోయినా..త‌గిన గుర్తింపు కూడా ల‌భించ‌టం లేద‌నే ఆదేవ‌న‌లో వారున్న‌ట్లు పార్టీ నేత‌లు చెబుతున్నారు.

Recommended Video

ఎమ్మెల్యేకు నామినేటెడ్ పోస్ట్ కట్టబెడుతున్న సీఎం జగన్
వైసీపీలో వారు ట్ర‌బుల్ షూట‌ర్లుగా..

వైసీపీలో వారు ట్ర‌బుల్ షూట‌ర్లుగా..

వైయ‌స్ ఉన్న స‌మ‌యంలో..వైయ‌స్ మ‌ర‌ణం త‌రువాత‌..జ‌గ‌న్ పార్టీ స్థాపించిన‌ప్పుడు..అధికారంలోకి వ‌చ్చినా..అప్పటి నుండి ఇప్ప‌టి వ‌ర‌కు వారు ఆ కుటుంబానికి విధేయులుగానే ఉన్నారు. జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తుగా బ‌ల‌మైన వాయిస్ వినిపిం చ‌టంలో క్రియాశీల‌కంగా ప‌ని చేసారు. కానీ, ఇప్పుడు మాత్రం వారు కేవ‌లం ఎమ్మెల్యేలుగా మాత్ర‌మే ఉంటున్నారు. స్వ‌యంగా ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు అసెంబ్లీ సాక్షిగా అంబ‌టి రాంబాబును ట్ర‌బుల్ షూట‌ర్‌గా అభివర్ణించారు. స‌భ లో ప్ర‌తిప‌క్షం పై చేయి సాధిస్తున్న స‌మ‌యంలో స‌మ‌య స్పూర్తిగా..వాగ్భాణాల‌తో నేరుగా టీడీపీ నేత‌ల‌ను రాంబాబు గురి పెట్ట‌టంలో సక్సెస్ అవుతున్నారు. అయితే, ఆయ‌న కంటే జూనియ‌ర్ల‌కు ప‌ద‌వులు..ప్రాధాన్య‌త ల‌భిస్తున్నా అంబ‌టికి మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఎటువంటి ప‌ద‌వి లేదు. స‌త్తెన‌ప‌ల్లిలో కోడెలను ఎదుర్కొని గెలిచినా..మంత్రి ప‌ద‌వి లేదు..స‌రే..చాలా మంది ఎమ్మెల్యేల‌కు కీల‌క ప‌ద‌వులు ఇచ్చిన జ‌గ‌న్‌..రాంబాబుకు ఇప్ప‌టి వ‌ర‌కు ఎటువంటి ప‌ద‌వి గురించి చ‌ర్చించ‌లేదు. రాంబాబు కాపు కార్పోరేష‌న్ ఛైర్మ‌న్ ప‌ద‌వి మీద ఆశ‌లు పెట్టుకున్నారు. ఇప్పుడు అది కూడా జ‌క్కంపూడి రాజాకు ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు.

శిష్యుడికి పద‌వులు..గురువుకు నిరీక్ష‌ణ‌

శిష్యుడికి పద‌వులు..గురువుకు నిరీక్ష‌ణ‌

ఇక‌..వైయ‌స్‌కు వీర విధేయుడు భూమ‌న క‌రుణాక‌ర రెడ్డి తొలి నుండి జ‌గ‌న్‌తోనే ఉంటున్నారు. ఇప్పుడు ఆయ‌న తిరు ప‌తి నుండి ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎప్పుడూ త‌న వాయిస్‌తో ప్ర‌తిపక్షం పైన విరుచుకుప‌డే భూమ‌న కొద్ది రోజులుగా స‌భ లోప‌లా..బ‌య‌టా మౌనంగా ఉంటున్నారు. ఆయ‌న మంత్రి ప‌ద‌వి ఆశించినా ల‌భించ‌లేదు. అదే విధంగా కీల‌క ప‌ద‌వి ఇస్తార‌నుకుంటే ఆ ప్ర‌స్తావ‌నే లేదు. ఇక‌, ఆయ‌న శిష్యుడు చెవిరెడ్డి భాస్క‌ర రెడ్డికి మాత్రం ఇప్ప‌టికే విప్‌గా..తుడా చైర్మ‌న్ గా అవ‌కాశం ఇచ్చారు. తాజాగా టీటీడీ బోర్డులో తుడా ఛైర్మ‌న్‌కు ఎక్స్ అఫీషియో స‌భ్యుడికి అవ‌కాశం ఇస్తూ చ‌ట్ట స‌వ‌ర‌ణ చేయ‌టం ద్వారా చెవిరెడ్డి టీటీడీ బోర్డు స‌భ్యుడిగానూ కొన‌సాగ‌నున్నారు. ఇప్పుడు ఇది భూమ‌న అనుచ‌రుల‌కు రుచించ‌టం లేదు. తొలి నుండి న‌మ్ముకున్న భూమ‌నకు గుర్తింపు ఇవ్వ‌క‌పోవ‌టం స‌రి కాద‌నే అభిప్రాయం వ్య‌క్తం అవు తోంది. ఇదే చిత్తూరు జిల్లాలో రోజా..చెవిరెడ్డిల‌కు ప‌ద‌వులు.. మంత్రులుగా పెద్దిరెడ్డి..నారాయ‌ణ స్వామిల‌కు గుర్తింపు ఇవ్వ‌గా..భూమ‌న విష‌యంలో జ‌గ‌న్ ప‌ట్టించుకోవ‌టం లేద‌నే ఆవేద‌న వ్య‌క్తం అవుతోంది.

అదే బాట‌లో మ‌రి కొంత మంది సీనియ‌ర్లు..

అదే బాట‌లో మ‌రి కొంత మంది సీనియ‌ర్లు..

ఇక‌..అధికార పార్టీ వాయిస్ వినిపించ‌టంలో సీనియ‌ర్ నేత‌లు పార్ధ‌సార‌ది..ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి లాంటి వారు ముఖ్యంగా కీల‌క భూమిక పోషిస్తున్నారు. పార్ధ‌సార‌ధి మంత్రి ప‌ద‌వి ఆశించి భంగ ప‌డ్డారు. విప్ ప‌ద‌వి ఇస్తే తిర‌స్క‌రిం చారు. అదే విధంగా ఆనం రామానారాయ‌ణ రెడ్డి ఎన్నిక‌ల ముందు పార్టీలోకి వ‌చ్చినా..రాజ‌కీయంగా సీనియ‌ర్ నేత‌. ఆయ‌న‌కు జిల్లాలో ఉన్న స‌మీక‌ర‌ణాల కార‌ణంగా మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేక పోయినా..ఆయ‌న అనుభ‌వాన్ని జ‌గ‌న్ త‌గిన రీతిలో వినియోగించుకోవటం లేద‌నే అభిప్రాయ వ్య‌క్తం అవుతోంది. జ‌గ‌న్ ప్ర‌ధానంగా యువ‌త‌కు ప్రాధాన్య‌త ఇస్తున్న ట్లుగా స్ప‌ష్టం అవుతోంది. అదే విధంగా.. కొల‌గొట్ల వీర‌భ‌ద్ర స్వామి..కాట‌సాని రాంభూపాల్ రెడ్డి.. ప్ర‌సాద రాజు.. తెల్లం బాల‌రాజు.. బాబూరావు వంటి వారు సైతం జ‌గ‌న్ త‌మ‌కు అవ‌కాశం ఇవ్వ‌క‌పోతారా అనే ఆశ‌తో ఎదురు చూస్తున్నారు. జ‌గ‌న్ మాత్రం సీనియ‌ర్ల అసంతృప్తిని గ‌మ‌నించ‌క పోతే..భ‌విష్య‌త్‌లో ఇబ్బందులు త‌ప్ప‌వ‌నే వాద‌న బ‌లంగా ఉంది. మ‌రి..జ‌గ‌న్ ఏం చేస్తారో చూడాలి..

English summary
YCP seniors disappointed with Jagan. They expected key position in YCP Govt..but Jagan giving priority for youth. At the same time nominated posts also giving to others apart senior leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X