వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

"కేసుల భయంతో చంద్రబాబు హోదాపై ముఖం చాటేశారు"

By Pratap
|
Google Oneindia TeluguNews

ఒంగోలు: కేసుల భయంతోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాపై ముఖం చాటేశారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ వైయస్సార్ కాంగ్రెసు గురువారంనాడు రాష్ట్రంలోని అని జిల్లాల కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేసింది.

ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ముందు జరిగిన ధర్నాలో వైవీ సుబ్బారెడ్డి, పార్టీ నేత బాలినేని శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్యే వెంకటరెడ్డిలతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 ప్రత్యేక హోదా వద్దని చెప్పలేదు....

ప్రత్యేక హోదా వద్దని చెప్పలేదు....

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకూడదని 14వ ఆర్థిక సంఘం చెప్పలేదని అంటూ వైవీ సుబ్బారెడ్డి తన లేఖకు సంఘం చైర్మన్ స్వయంగా సమాధానం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. హోదాతో ఆర్థిక సంఘానికి సంబంధం లేదని, అది కేంద్రం నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు.

 చంద్రబాబు బూచీగా చూపి...

చంద్రబాబు బూచీగా చూపి...

చంద్రబాబు ఆర్థిక సంఘాన్ని బూచీగా చూపి తప్పించుకుంటున్నారని వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. ఎపికి ప్రత్యేక హోదా వచ్చే అవకాశం లేదని చంద్రబాబు చెబుతున్నారని, కానీ ఇప్పటికే హోదా ఉన్న రాష్ట్రాలకు దాన్ని పొడగించిందని ఆయనయ చెప్పారు.

 కేసుల భయంతోనే చంద్రబాబు

కేసుల భయంతోనే చంద్రబాబు

కేసుల భయంతోనే చంద్రబాబు హోదాపై ముఖం చాటేశారని వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. హోదాతో పాటు విభజన హామీల అమలుకు తమ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని చెప్పారు. పార్లమెంటు వేదికగా ఆందోళన చేస్తాని, 21వ తేదీన కేంద్రంపై అవిశ్వాసం పెడుతామని ఆన చెప్పారు అప్పటికీ కేంద్రం దిగిరాకపోతే ఏప్రిల్ 6వ తేదీన రాజీనామాలు చేస్తామని చెప్పారు.

 చంద్రబాబు తీరని ద్రోహం

చంద్రబాబు తీరని ద్రోహం

విభజన సమయంలోరాష్ట్రానికి చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి తీరని ద్రోహం చేశారని, ఇద్దరు కూడా చిత్తూరు జిల్లాకు చెందినవారేనని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. రాష్ట్రం కష్టాల్లో ఉంటే లక్షల కోట్ల పెట్టుబడులు, వేల ఉద్యోగాలు వచ్చాయని చంద్రబాబు అంటున్నారని ఆయన అన్నారు.

దండుకోవచ్చునని చంద్రబాబు

దండుకోవచ్చునని చంద్రబాబు

ప్యాకేజీ అయితే బాగా దండుకోవచ్చునని చంద్రబాబు ఆలోచన అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు ప్రజలు ప్రత్యేక హోదానే కోరుకుంటున్నారని, హోదానే ఎపికి సంజీవని అని, ఆ విషయం తెలిసి కూడా చంద్రాు మాట్లాడడం లేదని అన్నారు. మాట్లాడితేకేసులు పెడతారేమోనని చంద్రబాబు భయపడుతున్నారని అన్నారు. తమకు అలాంటి భయాలు లేవని, వైఎస్ జగన్ నేతృత్వంలో తాము పోరాటం సాగిస్తామని అన్నారు.

English summary
The YSR Congressparty leaders YV Subba Reddy, Peddireddy Ramachandra Reddy and others blamed Andhra Pradesh CM and Telugu Desam party chief Nara Chnadrababu Naidu on special category status.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X