వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్టిక‌ల్ 370 ర‌ద్దుకు వైసీపీ మ‌ద్ద‌తు: మోదీకి హ్యాట్సాఫ్: కాశ్మీర్ ప్ర‌జ‌ల‌కు క‌విత మ‌ద్ద‌తు..!

|
Google Oneindia TeluguNews

కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న సంచ‌ల‌న నిర్ణ‌యానికి వైసీపీ మ‌ద్ద‌తుగా నిలిచింది. కాశ్మీర్ స‌మ‌స్య‌కు ఈ నిర్ణ‌యం ద్వా రా పరిష్కారం ల‌భిస్తుంద‌ని పార్టీ నేత విజ‌య సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. అదే స‌మ‌యంలో ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ తో పాటుగా త‌మ పార్టీ మ‌ద్ద‌తిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ప్ర‌ధాని మోదీ..హోం మంత్రి అమిత్ షా చ‌రిత్రో నిలిచిపోతార ని చెప్పుకొచ్చారు. అదే స‌మ‌యంలో టీఆర్‌య‌స్ మాజీ ఎంపీ క‌ల్వ‌కుంట్ల కవిత సైతం కేంద్రం నిర్ణ‌యం మీద ట్వీట్ చేసారు. కాశ్మీర్ ప్ర‌జ‌లు శాంతియుతంగా..ఆందోళ‌న లేకుండా ఉండాల‌ని కోరుకుంటున్న‌ట్లుగా పేర్కొన్నారు. కాంగ్రెస్ వ్య‌తిరేకించినా..టీడీపీ విధానం పైన స్ప‌ష్ట‌త రావాల్సిన అవ‌స‌రం ఉంది.

భారత్‌కు గత వైభవం వచ్చేనా..? సోషల్ మీడియాలో వైరల్‌గా 170ఏళ్ల క్రితం నాటి ప్లేట్ .. భారత్‌కు గత వైభవం వచ్చేనా..? సోషల్ మీడియాలో వైరల్‌గా 170ఏళ్ల క్రితం నాటి ప్లేట్ ..

ఆర్టిక‌ల్ 370 ర‌ద్దుకు వైసీపీ మ‌ద్ద‌తు..
కేంద్ర ప్ర‌భుత్వం తీస‌కున్న సంచ‌ల‌న నిర్ణ‌యానికి రాజ్య‌స‌భ‌లో వైసీపీ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. జ‌మ్ము కాశ్మీర్ లో ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు చేస్తూ కేంద్రం అనూహ్య నిర్ణ‌యం తీసుకుంది. దీని పైన కాంగ్ర‌స్..పీడీపీ నేత‌లు తీవ్రంగా నిర‌సించా రు. వారు స‌భ‌లో బిల్లు పైన చ‌ర్చ సాగుతున్న స‌మ‌యంలో వాకౌట్ చేసారు. ఇక‌, దీని పైన వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత విజ‌య సాయిరెడ్డి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ఆయ‌న కాశ్మీర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న రెండు జెండాల సిద్దాంతంను త‌ప్పు బ‌ట్టారు. ఇప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణ‌యం ద్వారా కాశ్మీర్‌లో శాంతి సాధ్యం అవుతుంద‌ని విజ‌య సాయి రెడ్డి అభిప్రాయ ప‌డ్డారు. ప్ర‌ధాని మోదీ..హోం మంత్రి అమిత్ షా చ‌రిత్రో నిలిచిపోతార ని చెప్పుకొచ్చారు. త‌మ పార్టీ అధినేత జ‌గ‌న్ సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నార‌న్నారు. కాశ్మీర్‌లో ఇటువంటి ప‌రిస్థితి ఏర్ప‌డ‌టానికి కార‌ణం నాటి కాంగ్రెస్ ప్ర‌భుత్వాలు అని వ్యాఖ్యానించిన విజ‌య సాయిరెడ్డి బిల్లుకు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు.

YCP support Central Govt proposed bill on abolish of article 370 in Rajya Sabha.

ప్ర‌ధాని మోదీకి హ్యాట్సాఫ్...
వైసీపీ నేత విజ‌య సాయిరెడ్డి జ‌మ్ము కాశ్మీర్ విష‌యంలో తీసుకున్న నిర్ణ‌యం పైన ప్ర‌ధానిని అభినందించారు. ఇక‌, ఇప్పుడు ఈ నిర్ణ‌యం తీసుకున్న ప్ర‌ధాని మోదీకి హ్యాట్సాఫ్ చెప్పారు. ఇదే స‌మ‌యంలో బ‌ల్లు ప్ర‌తిపాదించ‌నప్ప‌టి నుండి ఆందోళ‌న వ్య‌క్తం చేసిన కాంగ్రెస్ నేత‌లు.. పీడీపీ ఎంపీలు స‌భ నుండి వాకౌట్ చేసారు. డిఎంకే సైతం బిల్లును వ్య‌తిరేకించింది. మిగిలిన కీల‌క పార్టీలు దాదాపు బిల్లుకు మ‌ద్ద‌తు తెలిపుతున్నాయి. ఇదే స‌మ‌యంలో టీఆర్‌య‌స్ మాజీ ఎంపీ క‌విత సైతం స్పందించారు. నిర్ణ‌యాలు ఎలా ఉన్నా.. కాశ్మీర్ ప్ర‌జ‌లు సంతోషంతో ఉండాల‌ని..అక్క‌డ శాంతి నెల‌కొనాల‌ని క‌విత ఆకాంక్షంచారు. ఈ మేర‌కు క‌విత ట్వీట్ చేసారు. అయితే, కేంద్ర ప్ర‌భుత్వ తాజా నిర్ణ‌యం పైన ఇప్ప‌టి వ‌ర‌కు టీడీపీ నుండి అధికారిక స్పంద‌న రాలేదు. రాజ్య‌స‌భ‌లో ఉన్న ఇద్ద‌రు స‌భ్యులు ఇంకా స్పంద‌న వ్య‌క్తం చేయ‌లేదు. సాయంత్రానికి పార్టీ అధినేత చంద్ర‌బాబు దీని మీద స్పందించే అవ‌కాశం ఉంది.

English summary
YCP support Central Govt proposed bill on abolish of article 370 in Rajyasabha. YCP MP Vijaya Sai Reddy praised PM Modi and Amith Shah on taking this decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X