• search
  • Live TV
అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

జేసీ కంచు కోట‌కు బీటలు : 35 ఏళ్ల ఆధిప‌త్యానికి చెక్ ..ప‌రిటాల హ‌వాకు బ్రేక్‌: వైసీపీ ఎలా గెలిచింది..

|

రాయ‌ల‌సీమ‌లో అనంత‌పురం జిల్లా టీడీపీకి కంచుకోట‌. 2014 ఎన్నిక‌ల్లో టీడీపీకి 12 సీట్లు..వైసీపీకి రెండు సీట్లు ద‌క్కాయి. ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అయింది. వైసీపీకి 12 సీట్లు..టీడీపీకి రెండు సీట్లు వ‌చ్చాయి. ఇదే జిల్లాలో త‌మ అధిప‌త్యానికి అడ్డులేద‌ని భావించే జేసీ..ప‌రిటాల కుటుంబాల‌కు జ‌గ‌న్ మేనియా అడ్డు వేసింది. రెండు కుటుంబాల వార‌సుల‌కు ఆదిలోనే చెక్ పెట్టింది. వైసీపీ జెండా ఎగ‌ర‌వేసింది.

35ఏళ్ల కంచుకోట బ‌ద్ద‌లు..

35ఏళ్ల కంచుకోట బ‌ద్ద‌లు..

అనంత‌పురం జిల్లాలో 35 ఏళ్లుగా నిరాటంకంగా సాగుతున్న జేసీ బ్ర‌ద‌ర్స్ పాల‌న‌కు వైసీపీ చెక్ పెట్టింది. అనంత‌పురం జిల్లా తాడిప‌త్రిలో మొద‌టి సారి షాక్ త‌గ‌లింది. త‌మ వార‌సుల‌ను ప్ర‌మోట్ చేద్దామ‌ని భావించిన జేసీ బ్ర‌ద‌ర్స్ కు ఇది ఊహించ‌ని దెబ్బ‌. గెలుపు కోసం 50 కోట్లు ఖ‌ర్చు చేసామ‌ని వ్యాఖ్యానించిన జేసీ దివాక‌ర్ రెడ్డి త‌మ కుమారుల గెలుపు ఖాయ‌మ‌ని ధీమా వ్య‌క్తం చేసారు. దివాకరరెడ్డి కుమారుడు పవన్ రెడ్డి లోక్ సభ కు అనంతపురం నుంచి పోటీచేసి ఓడిపోయారు.అలాగే జెసి ప్రభాకరరెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యే సీటుకు పోటీపడి పరాజయం చెందారు. జెసి సోదరులు గత ఐదేళ్లలో పలు వివాదాలలో ఉన్నారు. అంతేకాక వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ ను దూషించిన తీరు కూడా విమర్శలకు గురైంది. చంద్రబాబు మెప్పుదల కోసం సభ‌ల్లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన జెసి దివాకరరెడ్డి తప్పులు వారి పిల్లలకు శాపాలుగా మారాయని వైసీప నేత‌లు వ్యాఖ్యానిస్తున్నారు.

కొత్త అభ్య‌ర్దుల చేతిలో ప‌రాజ‌యం..

కొత్త అభ్య‌ర్దుల చేతిలో ప‌రాజ‌యం..

వైసీపీ నుండి అనంత‌పురం లోక్‌స‌భ అభ్య‌ర్దిగా రిటైర్డ్ ప్ర‌భుత్వాధికారి రంగ‌య్య‌ను బ‌రిలోకి దించింది. జేసీ కుమారుడు కావ‌టంతో..రంగ‌య్య గెలుపు పైన అనుమానాలు మొద‌ల‌య్యాయి. అయితే, జ‌గ‌న్ అనంత‌పురం జిల్లా లోని రెండు లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల్లో బీసీల‌కే అవ‌కాశం ఇచ్చారు. ఆ స‌మీక‌ర‌ణ అంచ‌నా వేసిన విధంగానే వ‌ర్క‌వుట్ అయింది. రెండు లోక్‌స‌భ నియోజ‌క‌వర్గాల్లో వైసీపీ గెలిచింది. ఇక‌, తాడిప‌త్రి నుండి కేతిరెడ్డి పెద్దారెడ్డి తొలి సారి అసెంబ్లీకి పోటీ చేసారు. జేసీ బ్ర‌ద‌ర్స్‌కు క్ర‌మేణా అనుచ‌ర వ‌ర్గం దూర‌మైంది. లోక్‌స‌భ గెల‌వ‌క‌పోయినా క‌నీసం త‌మ‌ను గెలిపిస్తూ వ‌చ్చిన తాడిప‌త్రి ప్ర‌జ‌లు అయినా త‌మ‌ను గెలిపిస్తార‌నే న‌మ్మకంతో జేసీ బ్ర‌ద‌ర్స్ ఉన్నారు.

కానీ, తాడిప‌త్రి ప్ర‌జ‌లు సైతం వైసీపీకే మ‌ద్ద‌తు ప్ర‌కటించారు. ఫ‌లితంగా వైసీపీ అభ్య‌ర్ది పెద్దిరెడ్డి గెలుపొందారు.

రాప్తాడులో ప‌రిటాల వార‌సుడికి చెక్..

రాప్తాడులో ప‌రిటాల వార‌సుడికి చెక్..

అనంత‌పురం లో రాజ‌కీయంగా మ‌రో బ‌ల‌మైన కుటుంబం ప‌రిటాల కుటుంబం. ప‌రిటాల ర‌వి ఉన్నంత కాలం ఆయ‌న .. ఆయ‌న హ‌త్య త‌రువాత ర‌వి స‌తీమ‌ణి సునీత గెలుస్తూ వ‌చ్చారు. ఈ సారి ఎన్నిక‌ల్లో టీడీపీకి అనుకూలంగా ఉంద‌ని.. ఇదే త‌న వార‌సుడికి రాజకీయంగా అవ‌కాశం క‌ల్పించ‌టం ద్వారా భ‌విష్య‌త్ ఉంటుంద‌ని ఆశించారు. టీడీపీ నుండి రాప్తాడు అభ్య‌ర్దిగా బ‌రిలోకి దిగారు ప‌రిటాల శ్రీరాం. వైసీపీ నుండి గ‌త మూడు సార్లుగా ఓడిపోతూ వ‌చ్చిన తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి పోటీలో నిలిచారు. అనంత‌పురం జిల్లాలో కొన‌సాగిన జ‌గ‌న్ మేనియా ఈ నియోజ‌క‌వ‌ర్గంలోనూ కొన‌సాగింది. ప‌రిటాల శ్రీరాం పైన ప్ర‌కాశ్ రెడ్డి విజ‌యం సాధించారు. ఫ‌లితంగా అటు జేసీ..ఇటు ప‌రిటాల వార‌సుల‌కు వైసీపీ హ‌వా చెక్ పెట్టింది. ద‌శాబ్దాలుగా వారు కొన‌సాగిస్తున్న ఆధిప‌త్యానికి చెక్ ప‌డింది. రెండు చోట్ల వైసీపీ జెండా ఎగిరింది.

English summary
YCP Tsunami hit JC and Praital political empire in Anantapur dist. YCP candidates defeated JC brothers sons and Paritala Ravi son Sriram in Rapthadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X