• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అసెంబ్లీలో చెవిరెడ్డి భావోద్వేగం: జైలర్ ఎగిరి తన్నాడు: చంద్రబాబు పుట్టిన ఊరికి ఎమ్మెల్యేననే..!

|

ఏపీ అసెంబ్లీలో విప్..చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. తనతో మార్షల్స్ దురుసుగా ప్రవర్తించారని ప్రతిపక్ష నేత చంద్రబాబు సభలో ఫిర్యాదు చేస్తున్న సమయంలో చెవిరెడ్డి స్పందించారు. చంద్రబాబు హయాంలో తన పట్ల పోలీసులు దారుణంగా ప్రవర్తించారని వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వంలో చస్తూ బతికానని.. చంద్రబాబు పుట్టిన నియోజకవర్గంలో గెలవడం తప్పా.. అని ఈ సందర్భంగా చెవిరెడ్డి ప్రశ్నించారు. తిరుపతిలో ధర్నా చేస్తే కడప సెంట్రల్‌ జైల్లో వేశారని.. తీవ్రవాదిని కొట్టినట్టు పోలీసులు తనను కొట్టారని చెవిరెడ్డి చెప్పుకొచ్చారు. కనీసం తలనొప్పి మాత్ర కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని ఆయన ఆరోపించారు.

చంద్రబాబు అత్తగారికి కూడా పదవీ, ఎస్సీ,ఎస్టీ,బీసీలకు 50శాతం పదవులు, అసెంబ్లీలో జగన్

బస్సులో కింద పడుకోబెట్టి..తమిళనాడులో

సభలో చెవిరెడ్డి తాను చంద్రబాబు హాయంలో పోలీసుల కారణంగా ఏ స్థాయిలో ఇబ్బంది పడిందీ వివరించారు. ఆ సమయంలో ఆయన ఆవేదనకు గురయ్యారు. ఈ రోజు చంద్రబాబు తనను మార్షల్స్‌ తాకారు.. తోశారు.. అని మాట్లాడుతున్నారని... అప్పడు ఇదే శాసనసభలో తాము నల్ల బ్యాడ్జీలు వేసుకొని వస్తే మంగళగిరి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారని గుర్తు చేసారు. ఆనాడు వైఎస్సార్‌సీపీ కార్యకర్తల ఓట్లు తొలగి స్తున్నారని చిత్తూరులో తాను ధర్నా చేస్తే రాత్రికి రాత్రి పోలీసు బస్సులో ఎక్కించుకొని తమిళనాడుకు తీసుకెళ్లారని ఆవేదనగా చెప్పుకొచ్చారు. రాత్రంతా బస్సులో కింద పడుకోబెట్టి తమిళనాడు అంతా తిప్పారని... తల నొప్పిగా ఉందని అడిగితే కూడా ఒక్క టాబ్లెట్‌ కూడా ఇవ్వలేదుని సభకు వివరించారు. తెల్లారి సత్యవేడు పోలీస్‌ స్టేషన్‌లో పెట్టారని... అప్పడు తమ పార్టీ నాయకులంతా సంఘీభావం తెలిపితే వదిలారని చెప్పుకొచ్చారు. టీడీపీ ప్రభుత్వంలో బతుకుతానో..చస్తానో అని తెలియకుండా బతికానన్నారు. ఎన్ని ఇబ్బందులు పడ్డానో తనకు తెలుసని పేర్కొన్నారు. ఆ రోజు టీడీపీ ప్రభుత్వం తనపై అంతా అరాచకంగా ప్రవర్తించిందని ఆరోపించారు. ఒక శాసన సభ్యున్ని తమిళనాడుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంని చెవిరెడ్డి ప్రశ్నించారు.

YCP whip emotional in Assembly when he remembered police harassment in TDP tenure

జైలర్ ఎగిరితన్నాడు..

గత అయిదేళ్లు అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ నాయకులు అడ్డగోలుగా వ్యవహరించారని చంద్రగిరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీ ఆయనకు గత ప్రభుత్వంలో ఎదురైన అనుభవాలను వివరించారు. గతంలో తిరుపతి ఆర్డీవో కార్యాలయం ముందు నిరసనకు దిగితే.. సబ్‌ కలెక్టర్‌ చేతికింది ఉద్యోగిని కులం పేరుతో దుషించానని తప్పుడు కేసుతో కడప సెంట్రల్‌ జైలుకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. కడప సెంట్రల్‌ జైల్లో ఉదయం లేవగానే జైలర్‌ వచ్చి ఇక్కడ ఎందుకు కూర్చున్నావని ఎగిరి తన్నాడని, కారణం అడిగితే కూడా చెప్పలేదని భావోద్వేగానికి గురయ్యారు. రెండు రోజులు కనీసం నీళ్లు కూడా ముట్టుకోకుండా నిరసన చేశానని తెలిపారు. చంద్రబాబు పుట్టిన ఊరికి శాసన సభ్యున్ని అయినంతమాత్రాన తనను ఈ విధంగా శిక్షించాలా అని చెవిరెడ్డి ఆవేదన వ్యక్తం చేసారు. ముఖ్యమంత్రి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు సీఎంకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YCP Whip Chevireddy Bhaskara Reddy emotional in Assembly. He says in CBN tenure police harrased him and did not given single glass water.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more