వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ‌గ‌న్ సైలెంట్‌గా ఉండడు : చంద్ర‌బాబుపై వ్య‌తిరేక‌త లేక‌పోయినా: ఫ‌లితాల‌పై ప్రొఫెస‌ర్ విశ్లేష‌ణ‌..!

|
Google Oneindia TeluguNews

ఏపీ ఎన్నిక‌లపైన ఎగ్జిట్ ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యాయి. అందులో వైసీపీకి అనుకూలంగా జాతీయ ఛాన‌ళ్లు అంచ‌నాలు ఇవ్వ‌గా..ల‌గ‌డ‌పాటి మ‌రో సంస్థ టీడీపీకి అనుకూలంగా అంచ‌నాల‌ను ప్ర‌క‌టించాయి. ఈ స‌మ‌యంలో ప్ర‌ముఖ రాజ‌కీయ విశ్లేష‌కులు డాక్ట‌ర్ నాగేశ్వ‌ర్ ఏపీ ఫ‌లితా పైన త‌న అంచ‌నాల‌ను బ‌య‌ట పెట్టారు.

జ‌గ‌న్ సైలెంట్‌గా ఉండే ర‌కం కాదు..
ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితాల పైన త‌న అంచ‌నాల‌ను వెల్ల‌డించారు. రాజ‌కీయ విశ్లేష‌ణ‌ల్లో పేరున్న ఆయ‌న ఏపీ ఎన్నిక‌ల్లో వేసిన అంచ‌నాలు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో ఏపిలో అనుభ‌వానికి ఓటు వేసార‌ని..అయితే, జ‌గ‌న్ సైలెంట్‌గా ఉండే ర‌కం కాదంటూ..ఈ సారి ఆయ‌న‌కే మొగ్గు క‌నిపిస్తోంద‌ని పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైసీపికి 98 నుండి 102 సీట్ల వ‌ర‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేసారు. టీడీపీ అధికారినికి ద‌గ్గ‌ర‌య్యే స్థాయిలో సీట్లు గెలిచేందుకు అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా ఉన్నాయ‌ని ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ విశ్లేషించారు. ఇక‌, మూడో పార్టీగా బ‌రిలో ఉన్న జ‌న‌సేన‌కు మూడు నుండి అయిదు సీట్ల వ‌ర‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేసారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లోనూ వైసీపీ గ‌ణీన‌యంగా సీట్లు సాధించే ఛాన్స్ ఉంద‌న్నారు.

YCP will win in AP Assebly elections predicted by professor Nageswar..

ఆ నినాద‌మే క‌ద‌లించింది...
ఏపీలో వాస్త‌వానికి అంచ‌నా వేస్తున్న స్థాయిలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మీద వ్య‌తిరేక‌త లేద‌ని..త‌న‌కు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడాల‌నే అభ్య‌ర్ధ‌న ఓట‌ర్ల‌ను క‌ద‌లించింద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఓట‌ర్లు ఆ నినాదాన్ని ఆద‌రించి ఛాన్స్ ఇవ్వాల‌నే తాప‌త్ర‌య‌మే ఓటింగ్ స‌ర‌ళి పైన ప్ర‌భావం చూపింద‌ని నాగేశ్వ‌ర్ విశ్లేష‌ణ‌గా ఉంది. ఇక‌, ఎగ్జిట్ పోల్స్ ఒక్క ల‌గ‌డ‌పాటి మ‌రో సంస్థ మిన‌హా మొత్తంగా తొమ్మ‌ది సంస్థ‌లు ఏపీలో వైసీపీకి అనుకూలంగా ఫ‌లితాలు ఉంటాయ‌ని అంచ‌నాలు ఇచ్చాయి. అయితే, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మాత్రం స‌ర్వే సంస్థ‌లు ఏపీ ఓట‌ర్ల నాడి ప‌ట్టుకోవ‌టంలో విఫ‌ల‌మ‌య్యాయ‌ని..వంద‌కు వెయ్యి శాతం టీడీపి విజ‌యం సాధిస్తుంద‌ని ధీమాగా ఉన్నారు. అదే విధంగా లోక్‌స‌భ స్థానాల్లోనూ టీడీపీ 15 పైగా సాధిస్తుంద‌ని చెబుతున్నారు. ఈ ప‌రిస్థితుల్లో ఎవ‌రి అంచ‌నాలు నిజ‌మ‌వుతాయో మ‌రో రెండు రోజుల్లో తేలిపోనుంది.

English summary
Political professor K nageswar predicted YCP win in Ap elections. Nageswar analysed jagan slogan that one chance please mostly effected the voters. YCP may get around 100 seats as per Nageswar expectation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X