అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్పీకర్‌గారు! మీరన్నట్లు కుట్రే, కానీ: 'జగన్ చాంబర్లోకి నీళ్లు'పై ఆళ్ల

వైసిపి అధినేత జగన్ కార్యాలయంలోకి నీరు రావడంలో కుట్ర ఉందని స్పీకర్ కోడెల శివప్రసాద రావు చెబుతున్నారని, మేం అదే చెబుతున్నామని, కానీ భవనం నిర్మాణంలో కుట్ర ఉందని చెబుతున్నామని వైసిపి నేత ఆళ్ల రామకృష్ణా

|
Google Oneindia TeluguNews

అమరావతి: వైసిపి అధినేత జగన్ కార్యాలయంలోకి నీరు రావడంలో కుట్ర ఉందని స్పీకర్ కోడెల శివప్రసాద రావు చెబుతున్నారని, మేం అదే అంటున్నామని, కానీ భవనం నిర్మాణంలో కుట్ర ఉందని చెబుతున్నామని వైసిపి నేత ఆళ్ల రామకృష్ణా రెడ్డి అన్నారు.

వారు బుధవారం సాయంత్రంవిలేకరులతో మాట్లాడారు. జగన్ చాంబర్లోకి నీళ్లు రావడంపై మాత్రమే కాదని, అసలు భవనం నిర్మాణాన్ని ఎవరికి అప్పగించారు, దీనిపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

మీడియాను ఎందుకు అనుమతించలేదు

మీడియాను ఎందుకు అనుమతించలేదు

భవనంలో ఏం జరుగుతుందో తాము తెలుసుకునేందుకు మీడియాతో కలిసి ఆ ప్రాంగణానికి వెళ్లామని, కానీ ఎమ్మెల్యేలను అనుమతిస్తామని, మీడియాను అనుమతించమని చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాను ఎందుకు అనుమతించరని ప్రశ్నించారు.

నిన్న అలా.. నేడు ఇలా.

నిన్న అలా.. నేడు ఇలా.

అక్రమాలు బయటపడతాయనే అసెంబ్లీలోకి మీడియాను అనుమతించడం లేదన్నారు. ఏసీ పైప్ నుంచి వర్షపు నీరు లోనికి వచ్చిందని నిన్న చెప్పారని, ఇప్పుడేమే పైప్ కోయడం వల్ల వచ్చిందని చెబుతున్నారని విమర్శించారు.

సమాధానం చెప్పలేదే

సమాధానం చెప్పలేదే

తమను ఎవరూ ఏమీ చేయరన్న విధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆళ్లనాని మండిపడ్డారు. మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకు స్పీకర్ సమాధానం చెప్పలేదన్నారు. సిసి కెమెరాల ఫుటేజీ బయటకు తీయాలని డిమాండ్ చేశారు.

మీ జేబులో మనుషులు అని చేస్తారా

మీ జేబులో మనుషులు అని చేస్తారా

సిఐడి విచారణ కాదని, సిబిఐ విచారణకు ఆదేశించాలని ఆళ్ల అన్నారు. సిఐడి మీ జేబులో మనుషులు అనే విచారణకు ఆదేశించారా అని ప్రశ్నించారు. కానీ భవనం విషయంలో టెండర్ల దగ్గర నుంచి సిబిఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.

మాపైకి అపవాదు

మాపైకి అపవాదు

నిన్న చూస్తే పైప్ కట్ అయి ఉందని, ఇవాళ అతికించి ఉందని ఆళ్ల నాని ఆరోపించారు. ఎందుకు అలా ఉందో చెప్పాలన్నారు. మొత్తానికి అపవాదును తమపైకి నెట్టే ప్రయత్నం చేశారని ఆళ్ల నాని మండిపడ్డారు.

English summary
YSR Congress Party leaders and MLA Alla Ramakrsihna Reddy on Wednesday demanded for CBI enquiry into Assembly construction.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X