• search
 • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఏపీలో 'చైనా' బ్యాచ్‌కు బ్యాడ్ టైం మొదలైంది..! మొన్న నారాయణ.. నిన్న చైతన్య

|
  మొన్న నారాయణ నిన్న శ్రీ చైతన్య స్కూల్ సీజ్ || Oneindia Telugu

  విద్యా సంవత్సరం ప్రారంభమైంది. తొలిరోజునే మాజీ మంత్రి నారాయణ విద్యా సంస్థ కు షాక్ ఇచ్చిన జగన్ సర్కార్ ఇప్పుడు తాజాగా శ్రీ చైతన్య విద్యాసంస్థలకు షాక్ ఇచ్చారు. విద్యా వ్యవస్థ ప్రక్షాళన కోసం నడుం బిగించిన ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు . అందులో భాగంగానే గుర్తింపు లేని పాఠశాలల, కళాశాలల ఏరివేతకు చర్యలు చేపట్టింది విద్యాశాఖ. నిన్నటి వరకు అరాకొరా అనుమతులతో వదల బ్రాంచీలు నడిపిన ఆ విద్యాసంస్థలకు ఇక బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. అనుమతులు లేకుంటే సహించేది లేదని ప్రభుత్వం తేల్చి చెప్తుంది.

  సజ్జలకు కేబినేట్ హోదా .. సీఎంకు ప్రజా వ్యవహారాల సలహాదారుగా ఉత్తర్వులు జారీ

  అనుమతులు లేని శ్రీ చైతన్య స్కూల్ సీజ్ చేసిన

  అనుమతులు లేని శ్రీ చైతన్య స్కూల్ సీజ్ చేసిన

  ఇక ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వం అనుమతులు లేని కళాశాలలు , స్కూళ్ళ పై ఉక్కుపాదం మోపుతోంది. నిబంధనలకు విరుద్దంగా నిర్వహిస్తున్న కడపలోని శ్రీ చైతన్య స్కూల్ ను అధికారులు సీజ్ చేశారు. ఈ సంఘటన కడప జిల్లా రాయచోటిలో చోటుచేసుకుంది. ఇక అసలు విషయానికి వస్తే కడప పట్టణంలోని రాజుకాలనీలో గల శ్రీచైతన్య బ్రాంచిని మంగళవారం మండల విద్యాశాఖాధికారి రామక్రిష్ణమూర్తి సీజ్‌ చేశారు. విద్యాశాఖ అనుమతులు లేకుండా , అసలు భవనం పూర్తి చేయకుండా అడ్మిషన్‌లు చేపడుతున్నట్లు సమాచారం తెలుసుకున్న ఎంఈవో రామక్రిష్ణమూర్తి శ్రీచైతన్య స్కూల్ బ్రాంచి 3ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

  భవనం పూర్తి కాకుండా, అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న కడపలోని శ్రీ చైతన్య బ్రాంచ్

  భవనం పూర్తి కాకుండా, అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న కడపలోని శ్రీ చైతన్య బ్రాంచ్

  ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చేంతవరకు అడ్మిషన్లు చేపట్టడం గానీ, తరగతులు నిర్వహించడం గానీ చెయ్యరాదని అక్కడున్న ప్రిన్సిపాల్‌ చేత రాతపూర్వకంగా స్టేట్‌మెంట్‌ తీసుకుని వారికి హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా పాఠశాలలు నిర్వహిస్తే జరిమానా తప్పదని హెచ్చరించారు. ఇక అక్కడున్న ఉపాధ్యాయులను, విద్యార్థులను బయటకు పంపి తాళం వేశారు. అనుమతులు లేకున్నా, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నా ఎంత పెద్ద విద్యా సంస్థ అయినా సరే కఠిన చర్యలు తప్పవని మరోసారి అధికారులు స్పష్టం చేశారు .

  మొన్న నారాయణ ... నిన్న శ్రీ చైతన్య .. తప్పు చేస్తే ఉక్కుపాదమే

  మొన్న నారాయణ ... నిన్న శ్రీ చైతన్య .. తప్పు చేస్తే ఉక్కుపాదమే

  మొన్నటికి మొన్న విజయవాడ సత్యనారాయణ పురం లో ఉన్న నారాయణ స్కూల్ కు అనుమతులు లేవని గతంలో మూడు దఫాలుగా నోటీసులు జారీ చేసినా వారి వైఖరి మారకుండా తరగతులు నిర్వహిస్తున్న నేపథ్యంలోనే విద్యాశాఖ అధికారులు నారాయణ స్కూల్ సీజ్ చేయడంతో పాటుగా, లక్ష రూపాయలు జరిమానా విధించారు. ఇక తాజాగా శ్రీ చైతన్య విద్యా సంస్థకు షాక్ ఇచ్చారు. విద్యా వ్యవస్థ ప్రక్షాళనకు దృఢ సంకల్పంతో ఉన్న ఏపీ సీఎం జగన్ విద్యా వ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. రూల్స్ ఫాలో కాకపోతే ఎవరైనా ఒకటే అని తేల్చి చెప్పారు. పాఠశాలలు ప్రారంభమైన తొలి నాడే మాజీ మంత్రి నారాయణ కు షాక్ ఇస్తూ నారాయణ స్కూల్ ను సీజ్ చేసిన జగన్ సర్కార్ తాజాగా శ్రీ చైతన్య స్కూల్ సీజ్ చేసి అనుమతుల్లేని విద్యా సంస్థలకు చెమటలు పట్టించే పనిలో పడింది. దీంతో ఏపీలో ఈ విద్యా సంస్థల ఆటలు ఇక చెల్లవనే సంకేతాలు ఇచ్చింది ఏపీ సర్కార్ .

  English summary
  The new government of Andhra Pradesh is dealing with unauthorized colleges and schools. Officials have seized the Sri Chaitanya School in Kadapa, which contravenes the rules. This incident happened in Kadapa district Rayachoti. The Sree Chaitanya Branch at Raju colony in Kadapa town was raided by mandal Education officer Ramakrishnamurthy on Tuesday. Ramakrishnamurthy Sree Chaitanya School Branch 3 was checked suddenly after he know that admissions were being carried out without the permission of the Ministry of Education and the completion of the original building.They have been issued a written statement by Principal then that they should not take admissions or conduct classes until they get permission from the government. The Narayana School in Vijayawada Satyanarayana Puram earlier had no permission and it was seized Recently Shri Chaitanya branch also closed.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more