హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అనంతను చూసి చలించిపోయా: పవన్‌తో యోగేంద్ర, జనసేన ఆఫీస్ సరిపోదని హోటల్లో

|
Google Oneindia TeluguNews

Recommended Video

Pawan Kalyan's JFC Meeting With Jayaprakash & Undavalli

హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను స్వరాజ్ అభియాన్ నేత, ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ కార్యనిర్వాహక సభ్యులు యోగేంద్ర యాదవ్ గురువారం కలిశారు.

చదవండి: విజయసాయిరెడ్డి ఎఫెక్ట్: షాకింగ్ మెలిక, రాజీనామాపై మళ్లీ దొరికిపోయిన జగన్

హైదరాబాదులోని జనసేన పార్టీ కార్యాలయంలో సాయంత్రం కలిశారు. యోగేంద్రకు జనసేనాని సాదర స్వాగతం పలికారు. అనంతపురం జిల్లాలో తన పర్యటన వివరాలను యోగేంద్రకు వివరించారు. ప్రత్యేక హోదా సాధనా సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ కూడా జనసేనానిని కలిశారు.

చదవండి: బాబును ప్రసన్నం చేసుకోండి: వారికి మోడీ ఆదేశం? దోస్తీ.. బీజేపీకి మరో పెద్ద భయం

అనంతను చూశాక అభిప్రాయం మారింది

అనంతను చూశాక అభిప్రాయం మారింది

ఈ సందర్భంగా యోగేంద్ర మాట్లాడుతూ... ఏపీ అంటే పచ్చటి పొలాలు, గోదావరి, కృష్ణా నదులతో కళకళలాడుతుందని మాత్రమే తెలుసునని, అయితే అనంతపురం జిల్లాను చూసిన తర్వాత తన అభిప్రాయం పూర్తిగా మారిపోయిందని చెప్పారు.

అనంతపురం బుందేల్‌ఖండ్‌లా ఉంది

అనంతపురం బుందేల్‌ఖండ్‌లా ఉంది

అనంతపురం జిల్లా కరవు, నిరుద్యోగం, ఆకలి బాధలు, నేతన్నల కష్టాలు చూసి తాను చలించిపోయానని యోగేంద్ర తెలిపారు. బుందేల్‌ఖండ్ మాదిరిగా అనంతపురం జిల్లా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

లెక్కలు తేలాల్సి ఉంది

లెక్కలు తేలాల్సి ఉంది

మరోవైపు, చలసాని శ్రీనివాస్ పవన్‌ను కలిసి జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీకి మద్దతు పలికారు. శుక్రవారం హైదరాబాదులో జరగనున్న తొలి సమావేశానికి హాజరవుతానని చెప్పారు. కేంద్రం ఏపీకి ఎంత ఇచ్చిందో, ఎంత ఖర్చయిందో, ఎంత రావాల్సి ఉందో లెక్కలు తేలాల్సి ఉందన్నారు. పవన్ కళ్యాణ్‌తో చలసాని ఏకాంతంగా భేటీ అయ్యారు.

పవన్ కళ్యాణ్‌ను ఆదర్శంగా తీసుకోవాలి

పవన్ కళ్యాణ్‌ను ఆదర్శంగా తీసుకోవాలి

పవన్‌తో భేటీ అనంతరం చలసాని శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. పవన్‌ను ఆదర్శంగా తీసుకొని ఇతర నటీనటులు ఏపీకి హోదా కోసం పోరాడాలని కోరారు. మనకు వచ్చిన నిధులు పాచిపోయిన లడ్డూ అని గతంలోనే పవన్ చెప్పారని గుర్తు చేశారు. అందరు కలిసి పోరాడాలన్నారు.

జనసేన కార్యాలయం సరిపోదని

జనసేన కార్యాలయం సరిపోదని

ఇదిలా ఉండగా, ఏపీకి ఇచ్చిన నిధులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లెక్కలు ఇవ్వాలని చెప్పిన పవన్ కళ్యాణ్‌కు టిడిపి, బీజేపీ నుంచి సానుకూల స్పందన రాలేదు. కేంద్రం ఇవ్వాలని టీడీపీ, కావాలంటే ఆర్టీఐ ద్వారా తీసుకోవచ్చునని బీజేపీ చెప్పింది. సానుకూల స్పందన రాకపోవడంతో శుక్రవారం పవన్ స్థాపించిన జేఎఫ్‌సీ కీలక భేటీ నిర్వహిస్తోంది. సుదీర్ఘ మేథోమధనం జరపనున్నారు. సమావేశాలకు జనసేన కార్యాలయం సరిపోదని, ఓ ప్రయివేటు హోటల్లో రెండు రోజుల పాటు సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో జేఎఫ్‌సి విధివిధానాలపై స్పష్టత రానుంది.

English summary
Yogendra Yadav and Chalasani Srinivas Rao meets Pawan Kalyan over AP Special status.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X