వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాళేశ్వరానికి వ్యతిరేకంగా జలదీక్ష చేశావ్, కేసీఆర్ హిట్లర్ అన్నావ్ .. ఇప్పుడు ఎలా వెళ్తావ్ జగన్

|
Google Oneindia TeluguNews

ఉత్తర తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును ఈ నెల 21న ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు సీఎం కేసీఆర్ ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి రావాలనే ఆలోచనలో ఉన్నారు జగన్. అయితే జగన్ ఈ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి వస్తే తన తండ్రిని తప్పుపట్టినట్టే అని మెలిక పెట్టారు తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నేత భట్టి విక్రమార్క . ఇక ఏపీలోనూ కాంగ్రెస్ నేతలు సీఎం జగన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి వెళ్ళాలనే నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి జగన్ .. తప్పు పడుతున్న తెలంగాణా,ఆంధ్రా కాంగ్రెస్ నేతలు

కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి జగన్ .. తప్పు పడుతున్న తెలంగాణా,ఆంధ్రా కాంగ్రెస్ నేతలు

వై ఎస్ రాజశేఖర్ రెడ్డి నిర్మించ తలపెట్టిన ప్రాణహిత చేవెళ్ళప్రాజెక్ట్ రీ డిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తున్నారని ఇక అలాంటి ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి జగన్ ఎలా వస్తారని భట్టి అంటున్నారు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్ వస్తే తన తండ్రి వైఎస్ చేపట్టిన జలయజ్ఞాన్ని తప్పుబట్టినట్టేనని, ఆయనను అవమానించినట్టేనని తెలంగాణా కాంగ్రెస్ నేత భట్టి స్పష్టం చేశారు. ఇక ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి. వైయస్ జగన్ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్‌ వల్ల ఆంధ్రప్రదేశ్ ఎడారిలా మారబోతోందని ఆరోపిస్తూ జలదీక్ష చేశారంటూ గుర్తు చేశారు. అలాంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభానికి ఎలా వెళ్తారని ప్రశ్నించారు.

జలదీక్ష చేసి కాళేశ్వరం అక్రమ ప్రాజెక్ట్ అన్న జగన్ ఇప్పుడు ప్రారంభోత్సవానికి ఎలా వెళ్తారు అని ప్రశ్నించిన తులసీ రెడ్డి

జలదీక్ష చేసి కాళేశ్వరం అక్రమ ప్రాజెక్ట్ అన్న జగన్ ఇప్పుడు ప్రారంభోత్సవానికి ఎలా వెళ్తారు అని ప్రశ్నించిన తులసీ రెడ్డి

ఇక అంతే కాదు కర్నూలు జిల్లాలో వైయస్ జగన్ జలదీక్ష చేసిన సందర్భాన్ని గుర్తు చేశారు తులసీ రెడ్డి . కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాలను వ్యతిరేకిస్తూ జలదీక్ష చేసిన విషయాన్ని చెప్పి గోదావరి, కృష్ణా నదులపై అక్రమంగా తెలంగాణ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నారని అది ఆపకపోతే భవిష్యత్ లో రెండు రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాలు తలెత్తే ప్రమాదం ఉందని జగన్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసి అప్పుడు అలా అన్న జగన్ ఇప్పుడు ఎలా ఆ ప్రాజెక్ట్ ఓపెనింగ్ కు వెళ్తారని ప్రశ్నించారు . జలదీక్ష చేసిన సమయంలో అక్రమ ప్రాజెక్టు అయిన కాళేశ్వరాన్ని కేంద్రం జోక్యం చేసుకుని ఆపాలని లేని పక్షంలో భారత్, పాకిస్థాన్ లు ఎలా అయితే యుద్ధాలు చేసుకుంటున్నాయో అలాగే భవిష్యత్ లో నీటి కోసం తెలుగు రాష్ట్రాలు యుద్ధాలు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుందని జగన్ అన్న విషయాలు ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకోవాలని సూచించారు తులసీ రెడ్డి .

Recommended Video

పార్టీ కార్యాలయాల నిర్మాణ పనుల్లో వేగం పెంచండి - కేసీఆర్
కాళేశ్వరం పూర్తయితే ఏపీ ఎడారి ,కేసీఆర్ హిట్లర్ అన్న జగన్ అన్నీ మర్చిపోయారా ...

కాళేశ్వరం పూర్తయితే ఏపీ ఎడారి ,కేసీఆర్ హిట్లర్ అన్న జగన్ అన్నీ మర్చిపోయారా ...

ఆనాడు జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్ హిట్లర్ అంటూ అభివర్ణించారని, ఇప్పుడు నేడు ఆయన మంచి వ్యక్తి అయిపోయాడా అంటూ తులసిరెడ్డి విమర్శించారు. ప్రాజెక్టులపై చంద్రబాబు నాయుడును సైతం విమర్శించిన విషయం జగన్ కు గుర్తు లేదా అని ప్రశ్నించారు. ఇక కాళేశ్వరం పూర్తైతే ఆంధ్రప్రదేశ్ ఎడారైపోతుందని తెలిసి కూడా ఆ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్తున్న జగన్ ప్రజలకు ఏం సమాధానంచెప్తారని తులసిరెడ్డి జగన్ కు సూటి ప్రశ్న వేశారు .

English summary
Tulasi Reddy recalled the occasion of the Ys Jagan Jaladeeksha in Kurnool district. Telangana CM KCR Kaleshwaram project on the Godavari and Krishna rivers is illegal, if it does not stop the construction of the Kaleshwaram project,that there is a danger of water wars between the two states in the future Congress leader Tulasi reddy remembering Jagan's comments .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X