వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చాకలి అని పిలిచారా ... జైలుకు పంపిస్తారు ... ఎక్కడో తెలుసా

|
Google Oneindia TeluguNews

అలవాటులో పొరపాటు అని చాకలి అని పిలిచారు అంటే జైలు ఊచలు లెక్కించాల్సి ఉంటుంది అంటున్నారు మన పొరుగు రాష్ట్ర రజకులు. ఎందుకంటే ఏపీ ప్రభుత్వం రజకుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. రజక వృత్తి ని తక్కువ చేసే పదాలను నిషేధించింది. చాకలి, చాకలోడు అనే పదాలపై నిషేధం విధించింది. ఇకపై బట్టలు ఉతకడాన్ని వృత్తిగా జీవిస్తున్న వారిని గౌరవిస్తూ రజకులని పిలవాలి. ప్రతి వృత్తి గౌరవప్రదమైనదే అని చెప్పటంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం.

రజకులను కులం పేరుతో దూషిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే ఇకనుండి ఎవరైనా రజకులను చాకలి, చాకలోడు అని పిలిస్తే జైలుకి పంపిస్తారు. ఆ పదాలు అవమానకరంగా ఉన్నాయని, అందువల్ల వాటిని నిషేదించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

you will be kept behind bars ... if you call laundry men as chakali... do you know where it is

ఏ కుల వృత్తి తక్కువ కాదని, రజక వృత్తి ని కూడా గౌరవంగా చూసేలా, రజకుల పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించకుండా ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో రజకులను 'చాకలి', 'చాకలోడు' తదితర పేర్లతో పిలుస్తున్నారు. ఇలాంటి అవమానకర పేర్లను నిషేధించాలని ఏపీ వాషర్‌మెన్‌ సహకార ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఎండీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనికి ప్రభుత్వం అంగీకారం తెలపడంతో చాకలి, చాకలోడు అనే పదాలను నిషేధిస్తూ బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఉదయలక్ష్మి బుధవారం (ఫిబ్రవరి-21-2019) ఉత్తర్వులు జారీ చేశారు. ఇకనుండి రజకులను పిలిచేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పిలవాలి.. లేకుంటే జైలుకు పంపించడం పక్కా అని దీని సారాంశం.

English summary
AP government has taken a sensetional decision on laundry men. The government banned the words "chakali , chakalodu " as the words are insulting their profession.If anybody call them with those words they will be punished and send behind bars. Even their profession has a lots of dignity in this prospective the governmnet has taken this decision .AP washerman cooperative finance corporation limited MD appeal to the government about this issue and the government agreed to ban the words and passed orders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X