ఎమ్మెల్యే సీటు?: టీడీపీలో చేరాలంటూ అశోక్ బాబుకు షాకిచ్చిన చంద్రబాబు

Recommended Video

    Nava Nirmana Deeksha 2018 : Chandrababu Naidu Speech

    అమరావతి: ఏపీ ఎన్జీవో నేత అశోక్ బాబును తెలుగుదేశం పార్టీలో చేరాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆహ్వానించారు. మరో ఏడాదిలో అశోక్ బాబు పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆయన్ను రాజకీయాల్లోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

    అంతేకగా, వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఆయన్ను ఎమ్మెల్యేగా బరిలోకి దింపాలని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, చంద్రబాబు ఆహ్వానం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని, ఎన్జీవో నేతలతో చర్చించి తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని చెప్పినట్టు అశోక్ బాబు తనను కలిసిన మీడియా ప్రతినిధులతో చెప్పారు.

    You will join TDP, Chandrababu asks Ashok babu

    ఉద్యోగులకు, ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన ఎప్పటి నుంచో ఉందని, తప్పకుండా చేస్తానని అశోక్ బబు చెప్పారు. భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని అశోక్ బాబు అన్నారు. కాగా, శనివారం ఉదయం విజయవాడలో నవనిర్మాణ దీక్ష సందర్భంగా అశోక్ బాబు.. సీఎం చంద్రబాబు నాయుడు వెంటే ఉండటం గమనార్హం.

    నవనిర్మాణ దీక్షలోచంద్రబాబు మాట్లాడుతూ.. తిరుమల ఆలయంలో వజ్రం పోయిందంటున్నారని, ఈ విషయంలో సీబీఐ విచారణ పేరుతో అప్రతిష్టపాలు చేయాలనుకుంటున్నారని చెప్పుకొచ్చారు. సాక్షాత్తు వేంకటేశ్వరస్వామిని కూడా తానే కాపాడతానని అన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+