వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోదీ కోసం కాదు .. దేశం కోసం పనిచేయండి : ఈసీకి చంద్రబాబు సూచన

|
Google Oneindia TeluguNews

తిరుపతి : ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘాన్ని తాము పట్టలేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కానీ ఈసీ అవలంభించిన విధానాలను ఎత్తిచూపామని పేర్కొన్నారు. న్యాయం అనుకున్నప్పుడు రాజీలేని పోరాటం చేశానని గుర్తుచేశారు. రాష్ట్రంలోనే కాదు జాతీయస్థాయిలో అన్యాయం జరిగిన పోరాటం చేశానని తెలిపారాయన. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుపతిలో ఏర్పాటుచేసిన రక్తనిధి కేంద్రాన్ని ఆయన శనివారం ప్రారంభించారు.

you work country .. not modi says babu

వ్యవస్థల నిర్వీర్యం ..
ప్రజాస్వామ్య వ్యవస్థలను మోదీ నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల సంఘాన్ని కూడా దుర్వినియోగం చేయాలని చూశారని ఆరోపించారు. ఒడిశా, కర్ణాటక సీఎం ప్రయాణించి హెలికాప్టర్లను ఈసీ అధికారులు తనిఖీ చశారని .. ప్రధాని హెలికాప్టర్ తనిఖీ చేసిన అధికారిని మాత్రం సస్పెండ్ చేశారని చంద్రబాబు పేర్కొన్నారు. ఇదెక్కడి న్యాయం మోదీకో విధానం, సీఎంలకో విధానం అని ప్రశ్నించారు. తమ పోరాటం ఈసీపై కాదు .. అవలంభించే విధానాలపైననే ఉద్ఘాటించారు.

కోడ్ ఆఫ్ కండక్ట్ ..
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న ప్రధాని మోదీ అధికారులతో సమీక్షలు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఆంక్షలు అనేవి అందరికీ వర్తిచాలని .. కొందరిపై పెట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఈసీ ఆంక్షలు కేవలం ఏపీకి మాత్రమే పెట్టడం ఏంటని నిలదీశారు. బీజేపీ తప్ప మిగిలిన పార్టీ నేతలపై ఐటీ దాడులు చేయడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఎన్నికల వేళ రాజ్యాంగబద్ధ సంస్థలతో మోదీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. ఈసీ మోదీ కోసం కాక .. దేశం కోసం పనిచేయాలని సూచించారు.

English summary
AP CM Chandrababu said that they have not seen the Election Commission in connection with the elections. But pointed out the principles of easy adoption. He remembered that an uncompromising struggle was done when justice was planned. Not only in the state but also the injustice of national injustice.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X