అప్పుడు వైసీపీ..ఇప్పుడు టీడీపీ.. యంగ్ హీరో ఇలా మారిపోయాడేంటి..!
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని ప్రజలను కోరారు. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ ఎన్‌డీఏ కూటమి అభ్యర్థి ఎం కొండయ్యకు మద్దతుగా హీరో నిఖిల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈక్రమంలో నిఖిల్ మాట్లాడుతూ..చిరు నవ్వుల చీరాల కావాలంటే కూటమి అభ్యర్థి కొండయ్యకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అలాగే రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని నిఖిల్ అన్నారు.
ఇదిలా ఉంటే గత ఎన్నికల్లో నిఖిల్ వైసీపీకి మద్దతుగా నిలిచారు. ఆ ఎన్నికల్లో వైసీపీ తరుఫున ప్రచారం కూడా నిర్వహించారాయన. అప్పుడు వైసీపీకి సపోర్టు చేశారు కదా అని నిఖిల్‌ను ప్రశ్నిస్తే...గతంలో వైసీపీకి సపోర్ట్ చేశానంటే.. వాళ్లు మా రిలేటివ్స్ అందుకే ప్రచారంలో పాల్గొన్నాను. నేను సినిమాల్లో ఉన్నాను.. వైసీపీతో కాదు.. నేను ఒకే పార్టీతోలేను.. నా అనుకున్న వాళ్లు ఎక్కడ ఉంటే అక్కడ ఉన్నాను. గతంల జేడీగారు జనసేనలో ఉన్నప్పుడు ఆయనకి సపోర్ట్ చేశాను.

హైదరాబాద్‌లో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి అబ్బాయి సాయి పోటీ చేసినప్పుడు ఆయనకి సపోర్ట్ చేశాను. టీడీపీకి కూడా సపోర్ట్ చేశాను. నాకు ఏ పార్టీ లేదు.. పాలిటిక్స్ అంతకంటే లేదు.. నాకు తెలిసిన వ్యక్తులు ఎక్కడ ఉన్నా సపోర్ట్ చేస్తాను. నేను యాక్టర్‌ని.. నాకు తెలిసింది సినిమాలే' అంటూ చెప్పుకొచ్చారు నిఖిల్. రాష్ట్రాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కూటమిని భారీ మెజార్టీతో గెలిపించాలని నటుడు నిఖిల్ విజ్ఞప్తి చేశారు












Click it and Unblock the Notifications