• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ప్రేమను నిరాకరించి చెంపపై కొట్టిన బాలిక; కత్తితో విచక్షణారహితంగా ప్రేమోన్మాది దాడి; ఆస్పత్రిలో బాలిక

|
Google Oneindia TeluguNews

దేశంలో మహిళల,బాలికల రక్షణకు ఎన్ని చట్టాలు వచ్చినా ప్రేమోన్మాదుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రేమోన్మాదులు మాత్రం మారడం లేదు. నిత్యం ఏదో ఒకచోట రెచ్చిపోతూనే ఉన్నారు. యువతులపై దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. ప్రేమను తిరస్కరించారని ఉన్మాదులు యువతులు, బాలికలపై పాశవికంగా దాడులు చేస్తూనే ఉన్నారు. తాజాగా కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఇంటర్ విద్యార్థినిపై ప్రేమోన్మాది కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. నడిరోడ్డుపై కత్తితో మెడ, ముఖంపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ప్రేమోన్మాది దాడిలో గాయపడిన యువతిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్నారు.

ప్రేమ పేరుతో బాలికకు వేధింపులు

ప్రేమ పేరుతో బాలికకు వేధింపులు

ఈ కేసు వివరాల్లోకి వెళితే కృష్ణా జిల్లా విజయవాడ నగరంలోని భారతి నగర్ లో నివసించే బాలిక ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. తల్లి లేని ఆ బాలికను, తండ్రి అనారోగ్యం బారిన పడటంతో నాయనమ్మ సాకుతోంది. ఇంటర్ చదువుతున్న ఈ బాలికను విజయవాడలో ఉంటున్న హైదరాబాద్ కు చెందిన హరీష్ ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నాడు. హరీష్ బాధిత బాలికతో కలిసి మూడేళ్లపాటు ఒకే స్కూల్లో చదవడంతో, అప్పటి నుండి వీరిద్దరి మధ్య స్నేహం ఉంది. అయితే ఇటీవల కాలంలో హరీష్ బాలికను ప్రేమిస్తున్నానంటూ ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు.

ప్రేమను అంగీకరించాలని అందరి ముందు ఒత్తిడి, చెంపపై కొట్టిన బాలిక, ఆపై ఆమెపై దాడి

ప్రేమను అంగీకరించాలని అందరి ముందు ఒత్తిడి, చెంపపై కొట్టిన బాలిక, ఆపై ఆమెపై దాడి


ఈ క్రమంలోనే మూడు రోజుల క్రితం ఫ్రెండ్స్ తో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న బాలికపై తన ప్రేమను అంగీకరించాలని అందరి ముందు ఒత్తిడి చేశాడు. దీంతో కోపంతో బాలిక హరీష్ ను చెంపపై కొట్టింది. బాలిక తన ప్రేమను నిరాకరించడమే కాకుండా అందరి ముందు చెంపపై కొట్టడంతో ఆగ్రహంతో ఊగిపోయిన నిందితుడు ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాధితురాలి ఇంటికి వెళ్ళాడు. చాలాసేపు ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. బాలిక తీరుపై కోపోద్రిక్తుడైన హరీష్ అక్కడ ఉన్న కత్తితో ఆమె ముఖంపై మెడపై దాడి చేశాడు.

కత్తితో దాడి చేసిన యువకుడు.. ఆస్పత్రిలో బాలిక, కేసు నమోదు

కత్తితో దాడి చేసిన యువకుడు.. ఆస్పత్రిలో బాలిక, కేసు నమోదు

బాలిక అరుపులు, కేకలు వెయ్యటంతో విన్న స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో హరీష్ అక్కడి నుండి పరారయ్యాడు. కత్తి దాడిలో గాయాలపాలైన బాలికను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న యువకుడిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నట్ల గా తెలుస్తోంది. ప్రేమోన్మాది దాడిలో గాయాలపాలైన బాలికకు ప్రాణాపాయ పరిస్థితి లేదని వైద్యులు చెబుతున్నారు.

నిత్యకృత్యంగా మారుతున్న ప్రేమోన్మాదుల దాడుల ఘటనలు.. తస్మాత్ జాగ్రత్త

నిత్యకృత్యంగా మారుతున్న ప్రేమోన్మాదుల దాడుల ఘటనలు.. తస్మాత్ జాగ్రత్త

ప్రేమ పేరుతో ఈ తరహా ఘటనలు సమాజంలో నిత్యకృత్యంగా మారుతున్నాయి. ఎప్పుడు.. ఎక్కడ.. ఎవరు.. ఎలా.. ఎవరిపైన దాడి చేస్తారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇటువంటి సంఘటనలు జరగకుండా అమ్మాయిలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. తమను ఎవరైనా ఇబ్బంది పెడుతున్న ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటే సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పోలీసులు వారిపై చర్య తీసుకోవడమో, లేదా వారికి కౌన్సిలింగ్ ఇవ్వడమో చేస్తారు. ఇక ఇదే సమయంలో యువకులు కూడా ఈ తరహా దాడులకు దిగడం వారి భవిష్యత్తును నాశనం చేస్తుందనే విషయం గుర్తించాలి.

English summary
A Young man attacked a girl with the name of love in vijayawada. The girl is studying Inter Second Year living in Bharathi Nagar in Vijayawada city is being harassed by Harish and attacked with knife.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X