రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దొంగచాటుగా కటింగ్ కు వెళ్తే .. పోలీసులు ఏం చేసారో తెలుసా !!

|
Google Oneindia TeluguNews

కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్ తో సెలూన్ షాపులు,మెన్స్ బ్యూటీ పార్లర్లు మూతపడ్డాయి. దీంతో సెలూన్ కష్టాలు జనాలకు బాగా పెరిగిపోయాయి. అసలే ఎండా కాలం , ఆపై పెరిగిన జుట్టు చెమటతో చిరాకు తట్టుకోలేక చాలా మంది ఎలాగైనా హెయిర్ కట్ చేయించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కొందరు ఇళ్ళలో ప్రయోగాలు చేస్తుంటే, కొందరు ఎవరైనా బార్బర్ దొరక్కపోతారా అని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక హెయిర్ కటింగ్ కోసం అలా చేసిన ప్రయత్నమే బెడిసి కొట్టి కొందరు యువకులను కప్ప గంతులు వేయించింది .

 మూతపడిన సెలూన్లు , కరోనా వ్యాప్తి నేపధ్యంలో కఠినమైన ఆంక్షలు

మూతపడిన సెలూన్లు , కరోనా వ్యాప్తి నేపధ్యంలో కఠినమైన ఆంక్షలు

మాసిన గడ్డం , పెరిగిన జుట్టు , కొందరికైతే ఏకంగా ఒక పిలక వేసుకునేంతగా పెరిగిన జుట్టుతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. క్షురకులు లేక గత నెల రోజులకు పైగా ప్రజలు నానా తిప్పలు పడుతున్నారు. గత నెలరోజులకు పైగా లాక్ డౌన్ కారణంగా నిత్యావసరాలు మినహాయించి అన్ని షాపులతో పాటు సెలూన్లు కూడా మూతపడ్డాయి. జుట్టు కత్తిరించుకోవాలని, ఎవరైనా బార్బర్ ను పట్టుకోవాలని జుట్టు బాధ పడలేని కొందరు బయటకు వస్తున్నారు. అయితే కటింగ్ షాపులకు వెళ్లి చాలామంది కరోనా బారిన పడిన నేపధ్యంలో ముఖ్యంగా సెలూన్ల మీద కఠినమైన ఆంక్షలు పెట్టారు .

కటింగ్ కోసం దొంగచాటుగా వెళ్తూ పడరాని పాట్లు

కటింగ్ కోసం దొంగచాటుగా వెళ్తూ పడరాని పాట్లు

తాజాగా హెయిర్ కటింగ్ కోసం వెళ్ళిన కొందరు యువకులు పడరాని పాట్లు పడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కటింగ్ చేయించుకోవడానికి కొంతమంది వ్యక్తులు ఓ కటింగ్ షాపుకు వెళ్లారు. షాపులు తెరిచేందుకు అనుమతి లేకపోయినా కొంతమంది దొంగచాటుగా తెరుస్తున్నారు. వచ్చిన వారికి క్షవరం చేసి పంపుతున్నారు సదరు క్షురకులు . అధిక ధరలను తీసుకుంటున్నా సరే జనాలు కిక్కురుమనకుండా కటింగ్ చేయించుకు వస్తున్నారు. అలా కటింగ్ చేయించుకున్న వాడు హీరోనే . కానీ సెలూన్ల వల్ల కరోనా వస్తుంది అని చెప్తున్నా తమ దాకా వస్తే గాని ప్రమాదం అని గుర్తించని నైజం ఈ తరహా పనులకు కారణం అవుతుంది.

ఓ కటింగ్ షాపులో నక్కిన యువకులు .. వారితో కప్పు గంతులు వేయించిన పోలీసులు

ఓ కటింగ్ షాపులో నక్కిన యువకులు .. వారితో కప్పు గంతులు వేయించిన పోలీసులు

ఇక ఇదే క్రమంలో రాజమండ్రిలో ఒక కటింగ్ షాపు కూడా తెరిచారు. దీంతో కొంతమంది వ్యక్తులు షాపుకు వెళ్లారు. అదే సమయంలో పోలీసులు రావడంతో డోర్స్ క్లోజ్ చేసుకొని లోపలే కూర్చున్నారు. అయితే, అనుమానం వచ్చిన పోలీసులు డోర్లు పగలగొట్టి లోపల ఉన్న వ్యక్తులను బయటకు లాక్కొచ్చారు. సెలూన్స్ తో కరోనా వ్యాప్తి జరుగుతుందని ఎంత చెప్పినా వినకుండా కటింగ్ కోసం వచ్చిన వారికి పనిష్మెంట్ ఇచ్చారు. లాక్ డౌన్ రూల్స్ ను అతిక్రమించినందుకు వారిచేత కప్పగంతులు వేయిస్తూ ఇంటికి పంపించారు.

English summary
The lock down effect is on salons. Social distance is not possible in salons and men's parlors. Cutting should be close enough so that corona spread is expected to control. Some are experimenting in houses, and some are making tribe attempts to find someone barber. It was the attempt to do the haircut police gave punishment with frog jumps to young men. .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X