బాబుకు ఫిర్యాదు కోసం వచ్చి.. సచివాలయం ఎదుట యువతి ఆత్మహత్యాయత్నం

Subscribe to Oneindia Telugu

అమరావతి: బుధవారం ఆంధ్రప్రదేశ్‌ సచివాలయం ఎదుట ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కలకలం రేపింది. వసుధ అనే యువతి బుధవారం సచివాలయం ప్రధాన గేటు ఎదుట యువతి కళ్లు తిరిగి పడిపోయింది. ఈ విషయాన్ని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు.

అయితే, వసుధ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు వైద్యులు తేల్చారు. కాగా, విజయనగరం జిల్లాకు చెందిన శ్రవణ్ అనే వ్యక్తి వసుధను ప్రేమించి మోసం చేసినట్లు తెలిసింది.

 A young woman attempts suicide ap secretariat

ఈ విషయాన్ని అక్కడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో ఆమె... ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేసేందుకు వచ్చింది. అయితే వసుధను లోపలికి అనుమతించకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A young woman attempted to committed suicide at Andhra Pradesh secretariat.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి