నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వీడియో వైరల్ : హవ్వా... ప్రభుత్వ కార్యక్రమంలో రికార్డింగ్ డాన్సులా ..?

|
Google Oneindia TeluguNews

ప్రభుత్వ కార్యక్రమంలో ఐటెం సాంగులు... ఐటెం సాంగ్స్‌కు యువతులు డ్యాన్సులు... కార్యక్రమానికి చేరివచ్చిన వారు ఈలలు గోలలు చప్పట్ల వేయడంతో ఆ ప్రాంగణం సందడిగా మారింది. ఇదెక్కడో అనుకునేరు... మరెక్కడో కాదు ఏపీలో ఈ సుందరదృశ్యాలు దర్శనమిచ్చాయి. ఇంతకీ ప్రభుత్వ కార్యక్రమంలో ఇలాంటి దురదృష్టకరమైన ఘటన ఎక్కడ జరిగిందో తెలుసా..?

ఘనంగా ప్రారంభించిన ఫింఛన్ల పెంపు కార్యక్రమం

ఏపీ ప్రభుత్వం పింఛన్ల పెంపు, పసుపు కుంకుమ పథకం కింద చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీన్ని ఎంతో ఘనంగా ప్రకటించారు. కానీ స్థానిక నేతలు మాత్రం ఎంతో ఘనంగా నిర్వహించాల్సిన కార్యక్రమంలో రికార్డింగ్ డ్యాన్సుల తరహాలో అమ్మాయిలతో నృత్యం చేయిస్తూ కార్యక్రమాన్ని అపహాస్యపాలు చేస్తున్నారు. కార్యక్రమానికి అధికారులు ఇంకా చేరుకోక ముందే ఆ గ్యాప్‌లో సభకు వచ్చిన వారికి బోర్ కొట్టకుండా ఇలా అమ్మాయిలతో నృత్యాలు చేయిస్తున్నారు పార్టీ కార్యకర్తలు. ఇలా డ్యాన్సులు చేస్తున్న యువతుల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఐటెం పాటలకు డ్యాన్స్ వేసిన యువతులు

ఐటెం పాటలకు డ్యాన్స్ వేసిన యువతులు

నెల్లూరు జిల్లా వాకాడులోని ఎమ్మార్వో ఆఫీసుకు సమీపంలో పింఛన్ల పెంపు, పసుపు కుంకుమ కార్యక్రమంను నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. కార్యక్రమంలో యువతులతో ఐటెం పాటలకు డాన్సులు చేయించారు. ఆ కార్యక్రమానికి వచ్చిన వారు బాగా ఎంజాయ్ చేశారు. మహిళలకు సంబంధించిన కార్యక్రమం అయినా డ్యాన్సులు గట్రా ఉండటంతో కొందరు పురుషులు కూడా ఇక్కడకు హాజరయ్యారు.ఇదిలా ఉంటే ఇదేమి చోద్యం అంటూ కొందరు మహిళలు చెవులుకొరుక్కుంటుండగా మరికొందరు ఇబ్బందికి గురయ్యారు.

 యువతుల డాన్సులపై సర్వత్రా విమర్శలు

యువతుల డాన్సులపై సర్వత్రా విమర్శలు

ఇదిలా ఉంటే వాకాడులో చెక్కులు, పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఇక్కడ జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సునీల్, గూడూరు ఛైర్ పర్సన్ దేవసేన, వైస్ ఛైర్మెన్ శీలం కిరణ్ కుమార్‌లు పాల్గొన్నారు. చెక్కుల పంపిణీ సందర్భంగా మహిళలు చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమం బాగానే జరిగినా ప్రారంభంలో రికార్డింగు డ్యాన్సుల తరహాలో యువతులు వచ్చి ఐటెం పాటలకు డాన్సులు వేయడంపై చాలా మంది తెలుగుదేశం కార్యకర్తలే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా ప్రభుత్వ కార్యక్రమాల్లో రికార్డింగ్ డాన్సులు ఇది తొలిసారి కాదు. ఇంతకుముందు కూడా పలుచోట్ల కార్యక్రమం ప్రారంభానికి ముందు కార్యకర్తలు డాన్స్ ప్రోగ్రాంలు నిర్వహించారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేశాయి. అప్పుడెప్పుడో ఎన్టీఆర్ జయంతి రోజున కూడా ఆయన నటించిన మేజర్ చంద్రకాంత్ చిత్రంలోని 'పుణ్యభూమి నాదేశం' అనే గొప్ప పాటకు యువతులచే అసభ్యకరంగా డ్యాన్సులు వేయించి కార్యకర్తలు పెద్ద ఎత్తున విమర్శల పాలయ్యారు.

English summary
The government programmes in AP are being criticized for roping in young women and making them dance for the item songs. This was witnessed in Vakadu of Nellore district where two young women were seen dancing for item songs before the program began.This video is making rounds in social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X