రంగారెడ్డి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దారుణం: వృద్ధురాలిపై యువకుడు రేప్, విషమం(ఫొటో)

|
Google Oneindia TeluguNews

రంగారెడ్డి: జిల్లాలోని వికారాబాద్ పట్టణంలో దారుణం జరిగింది. 65ఏళ్ల వృద్ధురాలిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను వికారాబాద్ ఆస్పత్రికి తరలించారు.

వికారాబాద్‌లోని ఇందిరమ్మ కాలనీలోని బ్లాక్ నంబర్ 113లోని ఓ ప్లాట్‌లో వృద్ధురాలు తన కుమారిడితో కలిసి ఉంటోంది. వీరి ఫ్లాట్ ఎదురుగా గఫార్ అనే వ్యక్తి ఉంటున్నాడు. శుభకార్యాలకు వంటలు చేసే అతడి వద్ద వృద్ధురాలి కొడుకుతో పాటు పక్క ఫ్లాట్‌కు చెందిన ముజాహిద్(20) సహాయకులుగా పని చేస్తున్నారు. గఫార్ మంగళవారం హైదరాబాద్ వెళ్తూ తన ఫ్లాట్ తాళపు చెవిని పక్క బ్లాక్‌లో ఉంటున్న ముజాహిద్‌కు ఇచ్చాడు.

Youth held for raping 65 years old woman

రాత్రి వృద్ధురాలు, ఆమె కొడుకు వారి ఫ్లాట్‌లో వేర్వేరు గదుల్లో నిద్రించారు. ముజాహిద్ గఫార్ ఫ్లాట్‌లో టీవీ చూస్తూ ఉండిపోయాడు. అర్ధరాత్రి సమయంలో ముజాహిద్ వృద్ధురాలిని బలవంతంగా గఫార్ ప్లాట్‌లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. వృద్ధురాలు బుధవారం విషయాన్ని తన కొడుకుకు చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బాధితురాలిని వికారాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. నిందితుడు ముజాహిద్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు, అతడ్ని అరెస్ట్ చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు.

English summary
Youth held for raping 65 years old woman in Vikarabad in Rangareddy district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X