• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గిడ్డి ఈశ్వరి కోసం రంగంలోకి భారతి: వారు ఇంటికెళ్లినా నో, ఆధారాలతో దిమ్మతిరిగే షాక్

|

అమరావతి: వైసీపీ నుంచి సోమవారం టీడీపీలో చేరిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిని ఆపేందుకు ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి రెడ్డి కూడా రంగంలోకి దిగారా? ఆమె ప్రయత్నాలు కూడా ఫలప్రదం కాలేదా? అంటే ఈశ్వరి మాటలను చూస్తే అవుననే అంటున్నాయి.

  Breaking : MLA Giddi Eswari Joined TDP : Watch Video

  జగన్‌ను వేడుకున్నా కనికరించలేదు, గెంటేశారు: గిడ్డి ఈశ్వరి షాకింగ్

  గిడ్డి ఈశ్వరి సోమవారం మధ్యాహ్నం ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను జగన్‌కు అన్ని విషయాలను చెప్పానని తెలిపారు. జగన్ వినకపోవడం వల్లే తాను వైసీపీని వీడవలసి వచ్చిందని ఆమె తేల్చి చెప్పారు.

  వైసీపీనే గెలుస్తుంది: గిడ్డి ఈశ్వరి ఆసక్తికరం, టిడిపిలో చేరికకు మరో ఆసక్తికర కారణం

  గిడ్డి ఈశ్వరితో భారతి మంతనాలు

  గిడ్డి ఈశ్వరితో భారతి మంతనాలు

  ఆదివారం సాయంత్రం తనతో వైసీపీ అధినేత జగన్ సతీమణి భారతి రెడ్డి మాట్లాడారని గిడ్డి ఈశ్వరి వెల్లడించారు. అయితే సమస్యను పరిష్కరించకుండా ఎవరు ఎంతసేపు మాట్లాడినా ఉపయోగం లేదని ఈ సందర్భంగా ఈశ్వరి అనడం గమనార్హం.

  భారతిని రంగంలోకి దింపిన జగన్

  భారతిని రంగంలోకి దింపిన జగన్

  తద్వారా, గిడ్డి ఈశ్వరిని వైసీపీలోనే ఉంచేందుకు భారతి కూడా ప్రయత్నాలు చేశారు. అప్పటికే రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి, ధర్మశ్రీ తదితరులు ఆమెను బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. కానీ వినలేదు. దీంతో ఏకంగా భారతి రెడ్డిని రంగంలోకి దింపారని తెలుస్తోంది. కానీ అది కూడా ఫలితం లేకుండా పోయింది.

  జగన్ నన్ను పిలిచి చెప్పారు

  జగన్ నన్ను పిలిచి చెప్పారు

  జగన్ తనను పిలిచి పాడేరుకు మాత్రమే పరిమితం కావాలని సూచించారని గిడ్డి ఈశ్వరి వాపోయారు. అరకుతో నాకు సంబంధం లేదని చెప్పారన్నారు. దీంతో తాను మనస్తాపానికి గురైనట్లు ఆమె అభిప్రాయపడ్డారు. తాను పార్టీ కోసం పని చేస్తే, జగన్ తనను పక్కన పెట్టే ప్రయత్నాలు చేశారన్నారు.

  విలువలేని చోట ఉండలేనని కఠిన నిర్ణయం

  విలువలేని చోట ఉండలేనని కఠిన నిర్ణయం

  తనకు విలువలేని చోట ఉండలేనని, అందుకే కఠిన నిర్ణయం తీసుకోవాలనే తెగింపుకు వచ్చేశానని గిడ్డి ఈశ్వరి చెప్పారు. ఇదే విషయాన్ని తాను జగన్‌కు, విజయసాయి రెడ్డికి తేల్చి చెప్పానన్నారు. పార్టీని వీడకుండా తనను బుజ్జగించాలని చూశారన్నారు.

  ఎలా బుజ్జగించారంటే

  ఎలా బుజ్జగించారంటే

  కాగా, వైసీపీ తమ ప్రయత్నంలో భాగంగా గిడ్డి ఈశ్వరికి శనివారం ఫోన్ చేసి పార్టీని వీడవద్దని కోరారు. అయితే తాను విశాఖలో ఉన్నానని, కేఆర్ఎం కాలనీలోని మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ ఇంటికి ఓసారి రావాలని కోరారు. కానీ గిడ్డి మాత్రం ససేమీరా అన్నారు. రాత్రి విజయసాయి క్యాంప్ కార్యాలయానికి వెళ్లినప్పుడు బుజ్జగింపులు ప్రారంభిస్తే ఆమె నో చెప్పారు.

  రవిబాబుకు ఎవరూ హామీ ఇవ్వలేదు

  రవిబాబుకు ఎవరూ హామీ ఇవ్వలేదు

  రవిబాబు పార్టీలోకి వస్తే ఎమ్మెల్సీ ప్రతిపాదన ఉందని, కానీ ఆయనకు ఎమ్మెల్యే టిక్కెట్ పైన తాను లేదా జగన్ హామీ ఇవ్వలేదన్నారు. ఇదే విషయాన్ని విజయసాయికి చెప్పానన్నారు. ఇందుకు సంబంధించి ఆధారాలు చూపించగా.. విజయసాయి దానిని పక్కన పెట్టారని తెలుస్తోంది. ఆ తర్వాత ఆమె అక్కడి నుంచి బయటకు వచ్చారు.

  ఆ హామీ మాత్రమే ఉందని ఆధారాలు చూపిన గిడ్డి

  ఆ హామీ మాత్రమే ఉందని ఆధారాలు చూపిన గిడ్డి

  కాగా, రవిబాబుకు ఎమ్మెల్యే టిక్కెట్ హామీ లేదని, ఎమ్మెల్సీ హామీ మాత్రమే ఉందని కొయ్యడప్రసాద్ రెడ్డి చెప్పినట్లుగా ఉన్న వీడియోను గిడ్డి ఈశ్వరి.. విజయసాయికి చూపించారు. అనంతరం ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు.

  ఇంటికి వెళ్లినా నో చెప్పిన గిడ్డి

  ఇంటికి వెళ్లినా నో చెప్పిన గిడ్డి

  ఆ తర్వాత విజయసాయి.. ఈశ్వరి బాధ్యతను కొయ్యడకు అప్పగించారని తెలుస్తోంది. దీంతో కరణం ధర్మశ్రీ వంటి నేతలు ఆదివారం ఆమె వద్దకు వెళ్లారు. తాను రెండు నెలల క్రితమే రవిబాబును పార్టీలోకి తీసుకోవద్దని జగన్‌కు చెప్పానని ఈశ్వరి వారికి సూటిగా చెప్పారని తెలుస్తోంది. తాను టీడీపీలో చేరుతానని ఖరాఖండిగా చెప్పారని సమాచారం.

  టీడీపీలో చేరిన గిడ్డి ఈశ్వరి: జగన్‌పై సంచలనం, బాబు తల నరుకుతానని ఎందుకన్నానంటే..

  జగన్‌తో విసిగిపోయా, అన్ని చెప్తా: గిడ్డి సంచలనం, విజయసాయికి షాక్, ఆగ్రహానికి కారణాలివే

  English summary
  YSR Congress Party chief YS Jaganmohan Reddy's wife YS Bharati Reddy tried to stop Giddi Eswari joining Telugu Desam.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X