వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా చేరిన వైయస్ అవినీతి: సోమిరెడ్డి, కెవిపిపై ఫైర్

|
Google Oneindia TeluguNews

YS Governance fully corrupted: Somireddy
నెల్లూరు: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పాలన అంతా అవినీతిమయమేనని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. వైయస్ అవినీతి ఆంధ్రా నుంచి అమెరికా దాకా పాకిందని దుయ్యబట్టారు.

వైయస్ అవినీతిలో కీలక పాత్ర పోషించిన కెవిపి రామచంద్రరావు రాజ్యసభ సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఉన్నప్పటికీ అవినీతిపరులపై గవర్నర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.

మాట తప్పడం కెసిఆర్‌కే చెల్లింది: రమణ

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమానికి ముందోమాట, తర్వాత ఓ మాట మాట్లడటం తెలంగాణ రాష్ట్రసమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావుకే చెల్లిందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎన్నికల కమిటీ అధ్యక్షుడు ఎల్ రమణ విమర్శించారు. ఆయన శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్, హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రం వచ్చాక దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న కెసిఆర్ మాట తప్పి ఇప్పుడు ప్రజలను మభ్యపెడుతున్నాడని ఎల్ రమణ ఆరోపించారు. తెలంగాణ పునర్నిర్మాణంలో తమ పార్టీ పాత్రను వివరించారు. టిడిపి మొదటి నుంచి బడుగు బలహీన వర్గాల కోసం పని చేస్తుందని, తెలంగాణలో బిసిని ముఖ్యమంత్రి చేసి తీరుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. రాజ్యాధికారం బిసిలకు కల్పించకుంటే పార్టీలోనే ఉండి పోరాటం కొనస్తానని తెలిపారు.

English summary
Telugudesam Party Senior leader Somireddy Chandramohan Reddy on Saturday said that former CM YS Rajasekhar Reddy Governance was fully corrupted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X