జగన్ కేసు విచారణ వాయిదా: తెలంగాణకి సుప్రీం షాక్
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అక్రమాస్తుల కేసు విచారణనను హైదరాబాద్ నాంపల్లి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది. సోమవారం ఉదయం ఈ కేసుపై సిబిఐ కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో సిబిఐ దాఖలు చేసిన 10 చార్జిషీట్‌లలోని నిందితులు కోర్టుకు హాజరయ్యారు.
అనంతపురం జిల్లా పర్యటనలో ఉండడంతో కోర్టుకు హాజరుకాలేనని వైయస్ జగన్ అనుమతి తీసుకున్నారు. అయితే ఆయన కోర్టుకు హాజరయ్యారు. ఆయనతో పాటు విజయసాయిరెడ్డి, ఐసిసి చైర్మన్ శ్రీనివాసన్, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఇతర ప్రధాన నిందితులు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి హాజరయ్యారు.

ఈ కేసుకు సంబంధించి ట్రయల్స్ ప్రారంభంకానున్న నేపథ్యంలో విచారణను కోర్టు సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది. వైయస్ జగన్ అక్రమాస్తులపై సిబిఐ విచారణ జరిపి, చార్జిషీట్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌ను ఆగస్టు 31వ తేదీ లోపు పూర్తి చేయాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కౌన్సెలింగ్‌కు గడువును పొడగించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కౌన్సెలింగ్‌కు గడువును అక్టోబర్ 31వ తేదీవరకు పొడిగించాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. స్థానికతపై సుప్రీంకోర్టు ఏమీ చెప్పలేదని అదనపు అడ్వొకేట్ జనరల్ చెప్పారు.
అంతకు ముందు ఎంసెట్ కౌన్సిలింగ్‌పై విచారణను సుప్రీం కోర్టు సోమవారం మధ్యాహ్నానికి వాయిదా వేసింది. వేరే కోర్టులో బిజీగా ఉన్నందున విచారణకు సమయం కావాల్సిందిగా తెలంగాణ లాయర్ హరీష్‌సాల్లే సుప్రీంకోర్టును కోరారు. దీంతో ఎంసెట్‌కౌన్సిల్‌పై మధ్యాహ్నం తరువాత సుప్రీంలో విచారణకు వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications